రేషన్ కార్డుదారులు బీఅలర్ట్, బియ్యం అమ్ముకుంటే కార్డు రద్దు-మంచిర్యాల జిల్లా అధికారుల వార్నింగ్

Best Web Hosting Provider In India 2024

రేషన్ కార్డుదారులు బీఅలర్ట్, బియ్యం అమ్ముకుంటే కార్డు రద్దు-మంచిర్యాల జిల్లా అధికారుల వార్నింగ్

Bandaru Satyaprasad HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Bandaru Satyaprasad HT Telugu

రేషన్ దుకాణాల్లో ఉచితంగా పొందిన సన్న బియ్యాన్ని విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. సన్నబియ్యాన్ని అమ్ముకుంటున్నారన్న సమాచారంలో మంచిర్యాల జిల్లాలో అధికారులు తనిఖీలు చేశారు. బియ్యం విక్రయించిన 11 రేషన్ కార్డులు రద్దు చేశారు.

రేషన్ కార్డుదారులు బీఅలర్ట్, బియ్యం అమ్ముకుంటే కార్డు రద్దు-మంచిర్యాల జిల్లా అధికారుల వార్నింగ్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on Facebook

రేషన్ బియ్యం అమ్ముకునే వారికే మంచిర్యాల అధికారులు గట్టి షాక్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులపై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. అయితే రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం ఉచితంగా తీసుకుని వాటిని అమ్ముకుంటున్నారన్న సమాచారంతో రెవెన్యూ అధికారులు మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని అచలాపూర్ లో తనిఖీలు చేశారు.

11 రేషన్ కార్డులు రద్దు

గ్రామంలో పలువురు రేషన్ కార్డులపై ఉచితంగా పొందిన సన్నబియ్యాన్ని కిలో రూ.16 చొప్పున 1.91 క్వింటాళ్లు మహేశ్ అనే వ్యక్తికి విక్రయించినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు 11 రేషన్ కార్డులు రద్దు చేశారు. బియ్యం రేషన్ బియ్యం అమ్మిన, కొన్న వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

మే నెలలో పెరిగిన రేషన్ కార్డుదారులు

మే నెలలో కొత్తగా 11 లక్షల మందికి పైగా కొత్తగా రేషన్ పొందారు. రాష్ట్రవ్యాప్తంగా తాజాగా రేషన్ పొందే వారి సంఖ్య 2.93 కోట్లకు చేరుకుంది. ప్రభుత్వం కొత్త కార్డుల జారీతో… రేషన్ కార్డుదారుల సంఖ్య భారీగా పెరిగింది.

రాష్ట్రంలో తాజా గణాంకాల ప్రకారం 31,084 కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు జారీ అయ్యాయి. వీటి ద్వారా 93,584 మంది సభ్యులు లబ్దిపొందున్నారు. పాత కార్డుల్లో అదనంగా 10,12,199 మంది పేర్లు చేర్చారు. దీంతో రేషన్ బియ్యం కోటా పెరిగింది.

జనవరిలో 1.79 లక్షల టన్నులుగా ఉన్న బియ్యం కోటా, మే నెల నాటికి 1.86 లక్షల టన్నులకు పెరిగింది. కొత్త రేషన్ దారుల కోసం అదనంగా 4,431 టన్నుల సన్నబియ్యాన్ని అధికారులు సిద్ధం చేశారు.

12 లక్షల మందికి కొత్త రేషన్

జనవరి నుంచి మే మధ్యలో కొత్తగా 19 లక్షలకు పైగా లబ్ధిదారులను కొత్తగా గుర్తించింది ప్రభుత్వం. అయితే సాంకేతిక సమస్యంలో 7 లక్షలకు పైగా పేర్లు తొలగించారు. మార్పుచేర్పులతో నికరంగా 12 లక్షల మంది కొత్తగా రేషన్ పొందనున్నారు.

ఇంకా పెండింగ్

ఇంకా మూడు లక్షల వరకూ రేషన్ కార్డులు పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు వాటిని దశలవారీగా పరిశీలిస్తున్నారు. భర్త, భార్య వేర్వేరు కార్డుల్లో ఉన్నవారికి ఒకే కార్డులో చేర్చడం, కొత్తగా పిల్లలను చేర్చడం వంటి ప్రక్రియలు శరవేగంగా కొనసాగుతున్నాయి.

Bandaru Satyaprasad

TwittereMail
సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Ration CardsTelangana NewsTrending TelanganaHyderabadTelugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024