





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో అదరగొడుతున్న డైరెక్ట్ స్ట్రీమింగ్ సినిమా.. రెండు రోజుల్లోనే ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు..
కాస్తవ్ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ మూవీ భారీ వ్యూస్ సాధిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది.
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్ర పోషించిన కాస్తవ్ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చింది. 1990ల్లో గోవాలో కస్టమ్స్ అధికారిగా పని చేసిన కాస్తవ్ ఫెర్నాండెజ్ జీవితంలోని యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీకి సేజల్ షా దర్శకత్వం వహించారు. ఈ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా సినిమా కాస్తవ్ స్ట్రీమింగ్‍లో ప్రస్తుతం అదరగొడుతోంది.
ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు..
కాస్తవ్ చిత్రం మే 1వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈ మూవీకి మొదటి నుంచి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు రోజుల్లోనే ప్రస్తుతం (మే 3) ఈ చిత్రం జీ5లో నేషనల్ వైడ్ ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చింది.
కాస్తవ్ చిత్రం జీ5 ఓటీటీలో హిందీలో ఒక్కటే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. డబ్బింగ్‍లో ఇతర భాషల్లోనూ ఈ మూవీ వస్తుందా అనేది చూడాలి. ఇప్పుడైతే హిందీలో జీ5 ఓటీటీలో చూడొచ్చు.
స్మగ్లింగ్‍ను అడ్డుకునేందుకు..
గోవాలో గోల్డ్, డ్రగ్స్ స్మగ్లింగ్‍ను అడ్డుకునేందుకు కస్టమ్స్ ఆఫీసర్ కాస్తవ్ ఫెర్నాండెజ్ చేసిన కృషి, ప్రయత్నాల చుట్టూ ఈ మూవీ సాగుతుంది. ఈ చిత్రంలో కాస్తవ్ పాత్రను నావాజుద్దీన్ సిద్ధిఖీ పోషించారు. గ్రిప్పింగ్‍గా ఈ బయోగ్రాఫికల్ మూవీని తెరకెక్కించారు డైరెక్టర్ సేజల్ షా.
కాస్తవ్ సినిమాలో నవాజుద్దీన్‍తో పాటు ప్రియా బాపట్, కిశోర్ కుమార్, మహిక శర్మ, హుసేన్ దలాల్, దేవినా కొలాకో, గగన్ దేవ్ రియార్, రవి శంకర్ జైస్వాల్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని వినోద్ భానుశాలి, కమలేశ్ భానుశాలి, భవేశ్ మండాలియా, సేజల్ షా, శ్యామ్ సుందర్, ఫైజుద్దీన్ సిద్ధీఖీ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి రఫే మహమూద్ సినిమాటోగ్రఫీ చేశారు.
జీ5లో రాబిన్‍హుడ్
జీ5 ఓటీటీలోకి తెలుగు యాక్షన్ కామెడీ మూవీ రాబిన్‍హుడ్ వచ్చేస్తోంది. మే 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ చిత్రం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. అదే సమయానికి జీ తెలుగు టీవీ ఛానెల్‍లో టెలికాస్ట్ కానుంది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‍హుడ్ సినిమా మార్చి 28న థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్‍లో కనిపించారు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, దేవ్‍దత్తా నాగే, వెన్నెల కిశోర్, షైన్ టామ్ చాకో, మైమ్ గోపీ, ఆడుకాలం నరేన్ కీలకపాత్రలు పోషించారు.
సంబంధిత కథనం