




Best Web Hosting Provider In India 2024

తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలోకి వస్తోన్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ -ఫహాద్ ఫాజిల్ విలన్ -రన్‌టైమ్ గంటన్నరే
ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటించిన మలయాళం మూవీ ఇరుల్ తెలుగులోకి వస్తోంది. అపరాధి పేరుతో డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో సౌబీన్ షాహిర్, దర్శనా రజేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇరుల్ తెలుగులోకి వస్తోంది. అపరాధి పేరుతో తెలుగులోకి డబ్ అవుతోన్న ఈ మూవీ నేరుగా ఆహా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. ఈ సినిమా పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది. త్వరలోనే అపరాధి మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది.
నెగెటివ్ షేడ్స్‌తో…
అపరాధి మూవీలో ఫహాద్ ఫాజిల్‌తో పాటు దర్శన రాజేంద్రన్, సౌబీన్ షాహిర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మొత్తం ఒకే ఇంట్లో కేవలం మూడు పాత్రలతోనే ప్రయోగాత్మకంగా తెరకెక్కడం గమనార్హం. మలయాళంలో ఇరుల్ పేరుతో రిలీజైన ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించాడు. ఇరుల్ మూవీ కొవిడ్ కారణంగా మలయాళంలో కూడా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. ఈ మూవీకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్ దర్శకత్వం వహించాడు. సునీల్ యాదవ్ కథను అందించాడు. ఈ సినిమా రన్‌టైమ్ 91 నిమిషాలే కావడం గమనార్హం.
సింగిల్ షెడ్యూల్‌లో…
2021లో కొవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ సింగిల్ షెడ్యూల్‌లో కేవలం 30 రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్‌ను పూర్తిచేశారు. ప్రేమజంట జీవితంలోకి ఓ సీరియల్ కిల్లర్ ఎలా వచ్చాడు?అబద్ధానికి, నిజానికి మధ్య నెలకొన్న సంఘర్షణలో ఆ ప్రియురాలు ఎలాంటి నిర్ణయం తీసుకుందనే పాయింట్‌తో దర్శకుడు ఈ మూవీని రూపొందించాడు.
అపరాధి కథ ఇదే..
అలెక్స్ (సౌబిన్ షాహిర్) ఓ బిజినెస్‌మెన్. రచయితగా తొలి ప్రయత్నంగా సైకో కిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో ఇరుల్ పేరుతో థ్రిల్లర్ నవల రాస్తాడు. అర్చన ( దర్శనా రాజేంద్రన్) అనే లాయర్‌ను ప్రేమిస్తాడు అలెక్స్. అర్చనతో కలిసి ఓ వీకెండ్‌ట్రిప్ ప్లాన్ చేస్తాడు అలెక్స్. ఆ ట్రిప్‌లోనే అర్చనకు తన లవ్ ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు.
ఈ ట్రిప్‌లో కొండ ప్రాంతంలో అలెక్స్ కారు ట్రబుల్ ఇస్తుంది. వర్షం పడుతుండటంతో ఆ రాత్రికి దగ్గరలోని ఓ ఇంటిలో తలదాచుకోవాలని అనుకుంటారు. ఆ ఇంట్లో ఉన్ని (ఫహాద్ ఫాజిల్) ఒంటరిగా ఉంటాడు. అక్కడ ఓ మహిళ డెడ్‌బాడీ అలెక్స్‌కు కనిపిస్తుంది. తన నవలలో రాసిన విధంగానే సీరియల్ కిల్లర్ ఆమెను చంపిన ఆనవాళ్లు ఉంటాయి. ఉన్నినే ఈ హత్య చేశాడని అలెక్స్ అతడిని బంధిస్తాడు.
అదే టైమ్‌లో అలెక్స్ గురించి పలు సీక్రెట్స్ ఉన్ని ద్వారా అర్చనకు తెలుస్తాయి. ఆ ఇళ్లు అలెక్స్‌దేననే నిజం ఉన్ని బయటపెడతాడు. అలెక్స్ ఆ మహిళను హత్య చేశాడని ఉన్ని వాదిస్తాడు. అలెక్స్, ఉన్నిలలో అసలు సీరియల్ కిల్లర్ ఎవరు? అలెక్స్ గురించి అర్చన తెలుసుకున్న నిజాలేమిటి? అర్చనకు ఉన్ని ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడు? అన్నదే ఇరుల్ మూవీ కథ.
పుష్ప2లో విలన్‌గా…
గత ఏడాది రిలీజైన అల్లు అర్జున్ పుష్ప 2లో విలన్‌గా కనిపించాడు ఫహాద్ ఫాజిల్. భన్వర్ సింగ్ షెకావత్ అనే పోలీస్ ఆఫీసర్ కామెడీ టైమింగ్, విలనిజంతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం తెలుగులో డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనే మూవీ చేస్తోన్నాడు. మరోవైపు దర్శన రాజేంద్రన్ కూడా పరదా మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
సంబంధిత కథనం