





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చిన న్యూ హారర్ ఫాంటసీ థ్రిల్లర్- 4 భాషల్లో స్ట్రీమింగ్- ఇక్కడ చూసేయండి!
ఓటీటీలో సరికొత్త హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్‌గా ఓటీటీ రిలీజ్ అయిన పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ మూవీ ఏకంగా 4 భాషల్లో అందుబాటులో ఉంది. భయపెట్టే పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలపై లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. వాటిలో ఎన్నో రకాల జోనర్స్‌లో ఆ మూవీస్ ఉంటాయి. అయితే, ఓటీటీ ఆడియెన్స్‌ను అమితంగా కట్టిపడేసే జోనర్ మాత్రం హారర్ థ్రిల్లర్స్ అని చెప్పుకోవచ్చు. వాటికి కాస్తా క్రైమ్ లేదా ఫాంటసీ, హిస్టరీ వంటి అంశాలు యాడ్ చేస్తే మరింత రసవత్తరంగా ఉంటాయి.
హారర్ థ్రిల్లర్‌కు ఫాంటసీ
అలా హారర్ థ్రిల్లర్‌కు ఫాంటసీని యాడ్ చేసి తెరకెక్కించిన సినిమానే పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్. హాలీవుడ్‌లో కొత్తగా వచ్చిన పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ సినిమాకు స్కాట్ చాంబర్స్ దర్శకత్వం వహించారు. స్కాటిష్ నవలా రచయిత అయిన జేఎమ్ బ్యారీ రాసిన పీటర్ పాన్ అనే నోవెల్ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.
పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ సినిమాలో మేగన్ ప్లాసిటో, మార్టిన్ పోర్ట్‌లాక్, కిట్ గ్రీన్, ఫిలిప్ ఫిల్మర్, చారిటీ కేస్, లిలా లాస్సో, కియర్‌స్టన్ వేరీంగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విన్స్ నైట్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ మూవీకి గ్రెగ్ బ్రికుమ్షా సంగీతం అందించారు.
1.2 మిలియన్ డాలర్స్
సుమారు 89 నిమిషాల రన్‌టైమ్ ఉన్న పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ మూవీ జనవరి 13న అమెరికాలో, ఫిబ్రవరి 24న యూనైటెడ్ కింగ్‌డమ్‌లో థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే, పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. దాదాపుగా 1.2 మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌ను ఈ మూవీ రాబట్టింది.
కానీ, ఐఎమ్‌డీబీ నుంచి మాత్రం పదికి 5.1 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది. టాక్ పరంగా కూడా ఓకే అనిపించిన పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ ఓటీటీలోకి వచ్చేసింది. రీసెంట్‌గా నాలుగు భాషల్లో పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ ఓటీటీ రిలీజ్ అయింది.
ఓటీటీ స్ట్రీమింగ్
అమెజాన్ ప్రైమ్‌లో పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇంగ్లీష్‌తోపాటు హిందీ, మలయాళం, తెలుగు వంటి 4 భాషల్లో పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. హారర్, థ్రిల్లింగ్ సీన్స్, పర్వాలేదనిపించే ట్విస్టులు, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ తెరకెక్కింది.
పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ కథలోకి వెళ్తే.. ఫాంటసీ థీమ్ ఉన్న సర్కస్‌లో పీటర్ పాన్ అనే వ్యక్తి మైమ్ పాత్ర పోషిస్తూ చిన్నారులను ఎంటర్‌టైన్ చేస్తుంటాడు. ఓరోజు షో అయిన తర్వాత రాత్రి 13 ఏళ్ల జేమ్స్ హుక్ అనే పిల్లాడిని పీటర్ పాన్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ, అది గమనించిన జేమ్స్ తల్లి పీటర్‌ను అడ్డుకుంటుంది.
థ్రిల్లింగ్ అంశాలు
ఈ క్రమంలో పీటర్ పాన్ మొహాన్ని జేమ్స్ తల్లి చెక్కేస్తుంది. దాంతో పీటర్ పాన్ చనిపోతాడు. ఆ తర్వాత ఏమైంది?, జేమ్స్ జీవితంలోకి పీటర్ పాన్ ఎలా వచ్చాడు? పీటర్ పాన్ నుంచి జేమ్స్ ఫ్యామిలీ ఎలా తప్పించుకుంది? వంటి థ్రిల్లింగ్ అంశాలతో పీటర్ పాన్స్ నెవర్‌ల్యాండ్ నైట్‌మేర్ తెరకెక్కింది.
సంబంధిత కథనం