సింధూ జలాలను అడ్డుకునేందుకు భారత్ ఆనకట్ట నిర్మిస్తే దాడి చేసి నాశనం చేస్తాం : పాక్ మంత్రి

Best Web Hosting Provider In India 2024


సింధూ జలాలను అడ్డుకునేందుకు భారత్ ఆనకట్ట నిర్మిస్తే దాడి చేసి నాశనం చేస్తాం : పాక్ మంత్రి

Anand Sai HT Telugu

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. ఇప్పటికే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

సింధూ జలాలపై పాక్ మంత్రి కామెంట్స్

ారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం సహా భారత్ కఠిన చర్యలు తీసుకుంది. సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం పాక్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవేళ సింధు జలాల ప్రవాహాన్ని అడ్డుకునేందుకు భారత్ ఆనకట్ట నిర్మిస్తే దాడి చేసి నాశనం చేస్తామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు.

ఓ ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే ప్రకటన చేసి పాకిస్థాన్‌కు ఇచ్చే సింధు జలాలను ఆపడం దురాక్రమణగా పరిగణిస్తామని అన్నారు. సింధూ నదీ పరీవాహక ప్రాంతంలో భారత్ ఆనకట్ట నిర్మించడానికి సిద్ధపడితే పాకిస్థాన్ ప్రతిస్పందన ఏమిటని ప్రశ్నించగా, అది పాకిస్థాన్‌పై దురాక్రమణకు సమానమని మంత్రి సమాధానమిచ్చారు. ఫిరంగులు, బుల్లెట్ల ద్వారానే కాకుండా నీటిని ఆపడం లేదా మళ్లించడం కూడా పాకిస్థాన్‌పై దాడి చేయడమేనన్నారు. వారు(భారత్) అలాంటి ప్రయత్నం చేస్తే పాకిస్థాన్ ఆ నిర్మాణాన్ని నాశనం చేస్తుందని అన్నారు.

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఫ్రంట్ ఆర్గనైజేషన్ టీఆర్‌ఎఫ్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి తర్వాత రెండు దేశాల్లోనూ పరిస్థితి విషమించింది. భారత్ పలు కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‌కు చెందిన పలు సోషల్ మీడియా ఖాతాలను కూడా నిషేధించారు. పాకిస్థాన్‌కు అన్ని పోస్టల్, పార్శిల్ సర్వీసులను భారత్ శనివారం నిలిపివేసింది. దిగుమతులపై ఆంక్షలు పెట్టింది.

పాకిస్థా‌న్‌ జెండాగల నౌకలను భారతదేశంలోని ఏ రేవులోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. పాకిస్థా‌న్‌ జెండా ఉన్న నౌకలు భారత ఓడరేవులకు వెళ్లకుండా నిషేధం ఉంటుంది. భారత జెండాలు ఉన్న నౌకలు కూడా పాకిస్థా‌న్‌‌ ఓడరేవులోకి వెళ్లవు.

మరోవైపు 450 కిలోమీటర్ల దూరం వరకు ఉపరితలాన్ని తాకగల ‘అబ్దాలీ వెపన్ సిస్టం’ను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్ శనివారం ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరీక్ష చేయడం కవ్వింపు చర్యగా చూస్తున్నారు నిపుణులు. సైనికుల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడం, అధునాతన నావిగేషన్ వ్యవస్థలు, క్షిపణి అధునాతన వ్యవస్థను పరీక్షించడం ఈ ప్రయోగం లక్ష్యం అని ఒక ప్రకటనలో తెలిపింది.

Anand Sai

eMail

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link