




Best Web Hosting Provider In India 2024

జీవితంలో కొత్తదనం కోరుకుంటున్నారా? ముందుగా ఏం చేయాలో, ఏమేం చేయకూడదో తెలుసా!
మనలో చాలా మంది జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాం. కానీ, దాని కోసం ఏం చేయాలో తెలియదు. ఆలోచన అయితే ఉంటుంది. దానిని ఎలాంటి పనులతో సాకారం చేసుకోవాలో ఆలోచించలేం. అటువంటి వారి కోసమే ఈ స్పెషల్ మెసేజ్. అదేంటో చూద్దామా!
లైఫ్‌లో ఓడిపోయినా లేదా పూర్తిగా యాంత్రికమైపోయినా కామన్‌గా అనిపించే విషయం ఏంటంటే, కాస్త మార్పు కావాలి. అంతా రొటీన్ అయిపోయింది. ఏదైనా కొత్తదనం కావాలని పదేపదే అనిపిస్తుంటుంది. కానీ, అదెలాగో అర్థం కాదు. అటువంటి సమయంలో మనం కొన్ని పనులు చేయడం ద్వారా అనుకున్నది సాధించవచ్చు. కాకపోతే మీరనుకున్న విషయంపై నిబద్దత ఉంటే సరిపోతుంది. మరి కొత్తదనం కోసం చేయాల్సిన పనులేంటో తెలుసుకుందామా!
జీవితంలో కొత్త మార్గం ప్రారంభించడానికి ముందు గతాన్ని బయట పెట్టుకోవడం మొదలు పెట్టాలి. మనలోని స్వీయ అవగాహన, మన లక్ష్యాలు, వాటిని పునఃసమీక్షించుకోవటం వంటివి కీలకంగా వ్యవహరిస్తాయి. దాని కోసం ముందుగా ఈ పనులు మొదలుపెట్టాలి.
జీవితంలో కొత్తదనం కోరుకునే వారు చేయాల్సిన పనులు:
భయాలను దాటితేనే విజయం:
కొత్త దారులలోకి అడుగుపెట్టేటప్పుడు ఎవరిలోనైనా సహజంగానే భయం ఉంటుంది. అది విఫలమవుతుందేమో, లేదా ఆ మార్పు వల్ల సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే అనుమానాలు పీడిస్తుంటాయి. ఈ భయాలను అధిగమించి ముందుకు సాగడం అత్యంత ముఖ్యమైనది. ప్రతీసారి మనం భయంతో నిలబడితే, మన ఎదుగుదలను మనమే ఆపేసిన వాళ్లమవుతాం.
మనస్సును ఓపెన్ చేయడం:
మనం కొత్తదనాన్ని ఆహ్వానించాలంటే, మన మనస్సు పూర్తిగా ఓపెన్ అయి ఉండాలి. మనం అనుకున్న దానితో అనుగుణంగా ప్రయాణం సాగిపోతుంటే, 0సరికొత్త ఆలోచనలు, సరికొత్త ఆవిష్కరణలు మనకు సహాయం చేస్తాయి. అంతే కాదు, ఈ తరహా ప్రయాణంలో కొంత జ్ఞానం కూడా పెరుగుతుంది.
బలమైన సంకల్పం:
కొత్త మార్గం అన్వేషణలో మనం ఒక కొత్త దారిని ఎంచుకోవాల్సి ఉంటుంది. అది సులభంగా అనిపించకపోయినా, సంకల్పంతో దానిని సాధించాలని బలంగా భావించాలి. క్రమంగా మీరు ఆశించిన మార్పు కోసం మీ ఉద్దేశాన్ని పునఃపరిశీలించడం, సంకల్పం చెదరకుండా కాపాడుకోవడం లక్ష్యానికి చేరువ చేస్తుంది.
మార్పుకు ఆటంకంగా మారే విషయాలు:
మార్పు కోసం ప్రయత్నిస్తుంటాం. కానీ, అది ఆరంభంలో మాత్రమే ఉంటుంది. క్రమంగా మార్పు గురించి చేసే ప్రయత్నాల్లో వెనుకబడిపోయి రొటీన్ లైఫ్ కి వెళ్లిపోతాం. అలా జరగకుండా ఉండాలంటే,
గతాన్ని గుర్తుచేసుకోవాలి:
గతాన్ని ఎప్పటికప్పుడు ప్రస్తావించుకోవాలి. అదే సమయంలో మరోసారి పొరబాటు చేయమనే సంకల్పం కూడా ఉండాలి. అప్పుడే ప్రస్తుత జీవితంపై గతం ప్రభావం కనిపించదు. ఆ ప్రభావం లేనప్పుడే ముందుకు సాగగలం.
భావోద్వేగానికి గురికావొద్దు:
నూతన మార్గంలో అనేక సవాళ్లు ఉంటాయి. అవి చిన్నవైనా, పెద్దవైనా ఎమోషనల్‌గా కుంగిపోకుండా నిలబడాలి. పరిస్థితులకు తలొగ్గడం ఆలోచనలను సంకోచించి ఎదుగుదలని అడ్డుకుంటుంది. వాటికి బదులుగా మనం ఓర్పు, నమ్మకం కలిగి ఉండాలి.
ఇతరుల ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడం:
ఏదైనా మార్పు మీలో రావాలని కోరుకుంటే అది మీలో నుంచే రావాలి. ఇతరుల అభిప్రాయాలను ప్రయోగించి ఏదైనా పెద్ద లక్ష్యాన్ని సాధించాలంటే అది మీకు ఆటంకంగా మారొచ్చు. ఎల్లప్పుడూ ఇతరుల నిర్ణయాలతోనే కాలం గడపలేరు కదా.
ఇవే కాకుండా, కొత్తదనం కోరుకునే వారు ప్రేరణాత్మకమైన పనులు చేస్తుండాలి. ఎప్పటికప్పుడు స్వీయ పరిశీలనతో ఉంటూ ప్రతి రోజు మీ ఆలోచనలు, మీరు చేయగలిగే మార్పులను దృష్టిలో పెట్టుకుని నడవాలి. అలా చేయడం వల్ల మనిషి జీవితంలో ఉన్నత స్థితులకు చేరుకోవచ్చు.
కొత్త అనుభవాలు:
కొత్త పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. కొత్త ఆలోచనలను అన్వేషించడం మన జీవితంలో కొత్త భావనను రేకెత్తిస్తుంది. మానసికంగా, శారీరకంగా ఆవిష్కరణలు చేయడానికి తోడ్పడుతుంది.
ఒప్పుకోవాలి:
పరిస్థితులను అర్థం చేసుకుని నిస్సహాయతను ఒప్పుకోగలగాలి. మార్పును స్వీకరించడం కూడా కొత్త ఆలోచనలకు దారి తీస్తుంది. స్వీకరించడం మాత్రమే కాదు, దాన్ని ఎంగేజ్ చేయడం కూడా మనలను ముందుకు తీసుకువెళ్ళుతుంది.
అన్నింటికంటే ముఖ్యమైన విషయమేమిటంటే, మార్పు అనేది ఒక రోజులొ ఒక నెలలో వచ్చేది కాదు. ప్రతి రోజూ చిన్న చిన్న మార్పుల ద్వారా చేరుకుంటుంది. అందుకే కెరీర్లో ముందుకు వెళ్లాలంటే గతాన్ని త్యజించి ముందుకు సాగాలి.