




Best Web Hosting Provider In India 2024

‘రాజీవ్ యువ వికాసం స్కీమ్’ అప్డేట్స్ – దరఖాస్తుదారులకు మరో ఛాన్స్…! వెంటనే ఇలా చేయండి
తెలంగాణ రాజీవ్ యువ వికాసం స్కీమ్ పై ప్రభుత్వం మరో అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తు చేసుకొని హార్డ్ కాపీలను సమర్పించని వాళ్లకు మరో అవకాశం కల్పించింది. మిగిలిపోయిన వారు మండలాల కార్యాలయాల్లో అందజేయవచ్చని సూచించింది.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు రాయితీలపై రుణ సదుపాయం అందించేందుకు రాజీవ్ యువ వికాసం స్కీమ్ అమలు చేస్తోంది. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకానికి 16 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం వీటి పరిశీలన కొనసాగుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి… లబ్ధిదారుల జాబితాను వెల్లడించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
హార్డ్ కాపీల సమర్పణకు ఛాన్స్…!
ఇదిలా ఉంటే దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కాగా…. కొందరు హార్డ్ కాపీలను సమర్పించకలేకపోయారు. అయితే పలువురి నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
హార్డ్ కాపీలను సమర్పించలేకపోయిన దరఖాస్తుదారులు…. మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు లేదా వార్డు కార్యాలయాల్లో సమర్పించాలని సూచించింది. దరఖాస్తు ఫారమ్ తో పాటు అవసరమైన పత్రాలను ఇందుకు జత చేయాలని పేర్కొంది. వెంటనే ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
మీ అప్లికేషన్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
ఇక దరఖాస్తుదారులు వారి వివరాలను వెబ్ సైట్ లో తెలుసుకునేలా ప్రభుత్వం ఆప్షన్ తీసుకువచ్చింది. ఇక్కడ దరఖాస్తుదారుడి ఐడీ, ఆధార్ నెంబర్ ను ఎంట్రీ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి…..
- రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు దరఖాస్తు చేసుకున్న వాళ్లు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే అప్లికేషన్ ప్రింట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది.
- ముందుగా కార్పొరేషన్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత దరఖాస్తుదారుడి ఐడీ, ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే దరఖాస్తుదారుడి వివరాలు డిస్ ప్లే అవుతాయి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ పై నొక్కి ఈ కాపీని పొందవచ్చు.
ఇక రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో భాగంగా ఎక్కువ మంది కిరాణా జనరల్ స్టోర్, టెంట్‌హౌజ్ తో పాటు మరికొన్ని రంగాల్లో వ్యాపారానికి ఎక్కువ మొగ్గు చూపినట్లు అధికారులు గుర్తించారు. అర్హతలను ఉన్న వారిని గుర్తించి… జాబితాను ప్రకటించనున్నారు. జూన్ 2వ తేదీన ఎంపికైన వారికి పత్రాలను అందజేయాలని ప్రభుత్వం ప్రాథమిక నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ స్కీమ్ కింద కేటగిరీల వారీగా రాయితీ అందుతుంది. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు రుణం పొందే ఛాన్స్ ఉంటుంది. ఇందులో కేటగిరీ-1 కింద రూ.50 వేల విలువైన యూనిట్‌కు వంద శాతం రాయితీ ఉంటుంది. బ్యాంక్ లింకేజీ లేకుండానే ఈ రుణాన్ని అమలు చేస్తారు. కానీ మిగతా కేటగిరిలో మాత్రం బ్యాంక్ లింకేజీని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
సంబంధిత కథనం
టాపిక్