అరగంటలో రెడీ అయ్యే అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నారా? కచ్చితంగా ఇది మీ కోసమే!

Best Web Hosting Provider In India 2024

అరగంటలో రెడీ అయ్యే అద్భుతమైన బ్రేక్‌ఫాస్ట్ కోసం చూస్తున్నారా? కచ్చితంగా ఇది మీ కోసమే!

Ramya Sri Marka HT Telugu

ఆలూ, బొంబాయి రవ్వ మిక్స్ చేసి తయారుచేసే ఈ బ్రేక్‌ఫాస్ట్ అరగంటలో రెడీ అయిపోతుందంటే ఆశ్చర్యపోతున్నారా? టైంలోనే కాదు, టేస్ట్‌లో కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందంటే నమ్మండి. ఈ రెసిపీ ట్రై చేసేయండి.

ఇన్‌స్టంట్ దోసలు తయారుచేయడమెలా

ఉదయం మనం ఎంత ఆలస్యంగా లేచినా బ్రేక్‌ఫాస్ట్ మాత్రం త్వరగా రెడీ అయిపోవాలి. ఇది అందరి ఇళ్లల్లో ఉండే తంతే. మరి అంత త్వరగా తయారైపోయే బ్రేక్‌ఫాస్ట్ ఏమై ఉండొచ్చు! మీరనుకునేది కరెక్టే బొంబాయి రవ్వతో బ్రేక్‌ఫాస్ట్‌ను చాలా ఈజీగా, త్వరగా చేసేయొచ్చు. అలా అని రవ్వ దోసెలు వేసుకోలేరు కదా. కానీ, అందులో కాస్త ఆలూ వేసి, కొంచెం వెజిటేబుల్ టచ్ ఇస్తే స్పెషల్ టేస్ట్ తో నిండిపోతుంది. మరింకెందుకు ఆలస్యం. అరగంటలో రెడీ అయిపోయి ప్లేట్లో సర్వ్ చేసుకునేంత స్పీడ్ వంటకాన్ని చూసేద్దామా.. వచ్చేయండి మరి.

కావాల్సిన పదార్థాలు:

  • బంగాళ దుంపలు 2
  • బొంబాయి రవ్వ 1 కప్పు
  • పెరుగు 1 కప్పు
  • ఉల్లిపాయ 1 (తరిగినది)
  • టమాటో 1 (ముక్కలు చేసుకోవాలి)
  • కొత్తిమీర (సరిపడినంత)
  • పచ్చిమిర్చి (సరిపడినంత)
  • జీలకర్ర 1 టీస్పూన్
  • తెల్ల నువ్వులు 1 టీస్పూన్
  • కారం పొడి 1 టీస్పూన్
  • ఉప్పు (రుచికి తగినంత)
  • ఆవాలు 1 టీస్పూన్
  • కరివేపాకు (కొన్ని ఆకులు)
  • వంట సోడా 1/4 టీస్పూన్

తయారుచేసే విధానం:

  1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు పోసి బంగాళ దుంపల తురుము వేసుకోండి.
  2. అలా బాగా శుభ్రం చేసిన బంగాళ దుంపల తురుమును గిన్నెలో వేసుకుని, అందులో బొంబాయి రవ్వ, పెరుగు వేసి బాగా కలపండి.
  3. ఆ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు వేసి పిండి చిక్కగా మారే విధంగా కలుపుకోండి.
  4. అందులో తరిగిన ఉల్లిపాయ, తరిగిన టమాటా, తురిమిన కొత్తిమీర వేసుకుని పిండి చిక్కగానే ఉంచుతూ కలపండి.
  5. కొద్దిసేపటి తర్వాత అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, కారం పొడి, వేసి మరోసారి కలిపి మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి.
  6. ఆ తర్వాత గిన్నె మూత తీసి వంట సోడా, కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి మరోసారి కలపండి.
  7. అలా కలుపుకున్న పిండిని దోసె వేసేందుకు రెడీ చేసుకోండి.
  8. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆవాలు, నువ్వులు, కరివేపాకు వేయండి. వాటన్నిటి మీద పిండిని పరుస్తూ సన్నని రొట్టెలా లేదా మందపాటి దోసలా వేయండి.
  9. దానిపై మూత పెట్టి ఒకవైపు బాగా వేగిందనుకున్న తర్వాత మరోవైపుకు తిప్పండి.
  10. ఇలా చేస్తున్నంత సేపు మీడియం ఫ్లేమ్ మీదే ఉంచాలి. లేదంటే మధ్యలో ఉన్న భాగం సరిగా ఉడకదు.
  11. అలా రెండు వైపులా వేగిందని కన్ఫామ్ చేసుకున్న తర్వాత తీసి గ్రీన్ చట్నీ లేదా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.

బెనిఫిట్:

ఈ బ్రేక్‌ఫాస్ట్ చాలా త్వరగా అంటే అరగంటలో రెడీ అయిపోయేదే కాకుండా, త్వరగా జీర్ణమవుతుంది కూడా. బంగాళాదుంపలతో చేస్తారు కాబట్టి ఉదయాన్నే శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. ఉదయం లేటుగా లేచి హడావిడిగా బ్రేక్‌ఫాస్ట్ కోసం ట్రై చేసే వాళ్లకు ఇది చాలా బెటర్. కాస్త కూరగాయలు కూడా వేయడం వల్ల అదనపు రుచితో పాటు పోషకాలు కూడా అందుతాయి. కానీ, ఇది కేవలం సాధారణ ఫుడ్ మాత్రమే.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024