



Best Web Hosting Provider In India 2024
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు మృతి
ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీలు, కారు ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం (unsplash)
ప్రకాశం జిలాల్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒంగోలు మండలం కొప్పోలు వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
ప్రాథమిక వివరాల ప్రకారం…. గుడ్ల లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తాపడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అయితే బోల్తా పడిన లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ లో అగి ఉన్న కారును వెనక నుంచి వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా… పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
టాపిక్
Road AccidentAndhra Pradesh NewsPrakasam District
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.