



Best Web Hosting Provider In India 2024

టీజీ ఐసెట్ 2025 దరఖాస్తుల గడువు పొడిగింపు – ఇలా అప్లయ్ చేసుకోండి
టీజీ ఐసెట్ – 2025 దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. లేట్ ఫీజు లేకుండా మే 10వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జూన్ 8,9 తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి.
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఐసెట్ – 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా మే 3వ తేదీ నాటికి అప్లికేషన్ల గడువు ముగిసింది. అయితే ఈ గడువును మే 10వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక రూ. 250 ఫైన్ తో మే 17 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ గడువు ముగిస్తే రూ. 500 ఆలస్య రుసుంతో మే 26వ తేదీ వరకు అప్లికేషన్ ప్రాసెస్ కు అవకాశం ఉంటుంది. మే 16వ తేదీ నుంచి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే మే 20 వరకు సవరించుకోవచ్చు.
టీజీ ఐసెట్ -2025 దరఖాస్తు విధానం ఇలా…
- అర్హులైన అభ్యర్థులు తెలంగాణ ఐసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి,
- ముందుగా Application Fee Paymentపై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
- ఆ తర్వాత Fill Application Form పై క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియను ప్రాసెస్ చేసుకోవచ్చు.
- మీ వివరాలతో పాటు ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
- చివరగా సబ్మిట్ పై నొక్కి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
టీజీ ఐసెట్ – 2025 హాల్ టికెట్లు మే 28వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 8,9 తేదీల్లో పరీక్షలను నిర్వహిస్తారు. సీబీటీ(కంప్యూటర్ బేస్డ్) విధానంలో ఎగ్జామ్స్ ఉంటాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 :30 గంటలకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మధ్యాహ్నం సెషన్ ఉంటుంది.
ఎంట్రెన్స్ పరీక్షకు సంబంధించి జూన్ 21న పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేస్తారు. జూన్ 22 నుంచి 26 వరకు ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జులై 7న ఫలితాలను ప్రకటిస్తారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఐసెట్ – 2025 దరఖాస్తు ఫీజు చెల్లించుకోవచ్చు.
ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఐసెట్ – 2025కు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
టాపిక్