ఏం తింటాంలే అని ఎండుకొబ్బరిని లైట్ తీసుకోకండి! దీన్ని చిరుతిండిగా తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి!

Best Web Hosting Provider In India 2024

ఏం తింటాంలే అని ఎండుకొబ్బరిని లైట్ తీసుకోకండి! దీన్ని చిరుతిండిగా తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

ఎండుకొబ్బరిని కేవలం కూరల్లో మాత్రమే వేసుకునే పదార్థంగా భావించొద్దు. దీనిని చిరుతిండిగా కూడా తినొచ్చు. ఇలా తినడం వల్ల మీరు ఊహించని ప్రయోజనాలను పొందొచ్చు కూడా. దీన్ని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు చెడు కొలెస్ట్రాల్ పరిమాణం కచ్చితంగా తగ్గిపోతుంది.

ఎండుకొబ్బరి తినడం వల్ల ప్రయోజనాలేంటంటే.. (shutterstock)

కుడకలు లేదా ఎండు కొబ్బరిని ఇప్పటి వరకూ వంటల్లో వేసుకునే ఆహార పదార్థంగా మాత్రమే వాడుతున్నాం కదా. వాస్తవానికి దీనిని రుచి కోసం మాత్రమే కాదట. ఇది తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తరచుగా ఖీర్‌లో వేయడానికి లేదా చట్నీ చేయడానికి ఎక్కువగా వినియోగిస్తుంటాం. కొన్ని సందర్భాల్లో చికెన్, దొండకాయ, బెండకాయ, కాకరకాయ లాంటి కూరల్లో ఎక్స్‌ట్రా ఐటెంగా వేసుకుని కూడా ఎంజాయ్ చేస్తాం. ఇలా తింటే టేస్టీగానూ, హెల్తీగానూ ఉంటాం. దీనిని కేవలం వంటల్లో మాత్రమే కాకుండా, స్నాక్‌గా కూడా తినొచ్చట.

ఎండుకొబ్బరిని స్నాక్‌గా తినొచ్చా:

సాధారణంగా ఎక్కువ శాతం మంది కొబ్బరి ఎండుదైనా, పచ్చిదైనా ఒక ముక్క నోట్లో వేసుకోనిదే ఊరుకోరు. ఎందుకంటే, కొబ్బరిని ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే ప్రతిసారీ ఎండుకొబ్బరిని తినడం అనేది చాలా మంచిదట. అయితే దీనిని కొబ్బరి తురుముగా కూడా తీసుకోవచ్చు. అలా చేయడం వల్ల కూడా ఒకేలాంటి ఫలితాలుంటాయి. అవేంటో తెలుసుకుందామా..!

బరువు తగ్గడానికి ఎండుకొబ్బరి:

స్నాక్స్‌గా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ముఖ్యమైనది బరువు తగ్గడం. తరచూ ఈవెనింగ్ స్నాక్స్ కోసం చూస్తున్నవారు, ఎండుకొబ్బరి తురుమును ప్రయత్నించడం బెటర్. మీకు వీలైనప్పుడల్లా తింటే ఇంకా మంచిది. ఎందుకంటే, ఎండుకొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్‌ను శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఫలితంగా తగినంత శక్తిని ఇచ్చి సంపూర్ణత్వ భావనతో జీవక్రియకు మద్దతు ఇస్తుంది. ఎండుకొబ్బరితో బరువు తగ్గడానికి సరైన కార్బొహైడ్రేట్స్ అందుతాయి.

ఎండుకొబ్బరిలో ఉండే మరిన్ని పోషక విలువలేంటంటే:

ఎండు కొబ్బరి పెంకులలో బరువు తగ్గడానికి సరైన కార్బోహైడ్రేట్ల పరిమాణం తక్కువగా ఉంటుంది. అలాగే, అవసరమైన శరీరానికి అవసరమైన మాంగనీస్, రాగి, సెలీనియం పుష్కలంగా ఉండి, శరీర పనితీరుకు అవసరం పడుతుంది.

చాలా పోషకాలతో ఆరోగ్యకరమైన కొవ్వుల కారణంగా, ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. కీళ్ళు ఫ్రీగా కదిలి ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది.

మాంగనీస్, రాగి వంటి పోషకాలు కూడా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్‌ను కూడా ఉంటాయి.

ఎండిన కొబ్బరి చిప్పలలో అవసరమైన అమైనో ఆమ్లాలు కూడా ఉన్నాయి, ఇవి ప్రోటీన్ కోసం బిల్డింగ్ బ్లాక్లుగా పనిచేస్తాయి. కణజాల మరమ్మత్తు నుండి మరమ్మత్తు వరకు హార్మోన్ల ఉత్పత్తికి అమైనో ఆమ్లాలు అవసరం. రోజూ ఎండు కొబ్బరి శరీరంలో అవసరమైన ప్రోటీన్ లోపాన్ని తొలగిస్తుంది.

రోజూ ఎండుకొబ్బరి తినడం మొదలుపెట్టిన వారి చర్మంలో, జుట్టులో మార్పులు కనిపిస్తాయి. ఇది జుట్టును స్ట్రాంగ్‌గా, ఒత్తుగా మార్చడానికి, చర్మాన్ని మృదువుగా మార్చడానికి సహాయపడుతుంది.

రోజూ ఎనిమిది నుంచి పది పల్చని కొబ్బరి ముక్కలను తినడం వల్ల డైటరీ ఫైబర్ లభిస్తుంది. ఇది ప్రేగు కదలికకు మద్దతు ఇస్తుంది. దాంతో పాటుగా అరుగుదల ప్రక్రియను సులభతరం చేసి మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

ఎండుకొబ్బరి తినడం వల్ల శరీరంలో తగ్గిన లిక్విడ్ స్థాయిని తిరిగి భర్తీ చేస్తుంది. ముఖ్యంగా భోజనానికి ముందు కనీసం ఒక ముక్క అయినా తినడం ఆరోగ్యకరంగా ఉంటుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024