తగ్గిన హిట్ 3 కలెక్షన్లు.. మూడు రోజుల్లో నాని సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే? సూర్య రెట్రో కంటే ఎక్కువే!

Best Web Hosting Provider In India 2024

తగ్గిన హిట్ 3 కలెక్షన్లు.. మూడు రోజుల్లో నాని సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయంటే? సూర్య రెట్రో కంటే ఎక్కువే!

హిట్ ది థర్డ్ కేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 3: నాని సినిమా హిట్ 3 కలెక్షన్ల జోరు తగ్గింది. మూడో రోజు ఊపు కొనసాగించలేకపోయింది. అయినా సూర్య రెట్రో ఫిల్మ్ కంటే ఎక్కువే సాధించింది.

హిట్ 3 మూవీలో నాని

నాని లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్: ది థర్డ్ కేస్’ బాక్సాఫీస్ కలెక్షన్లు తగ్గాయి. ఈ మూవీ రిలీజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ శనివారం అనుకున్నంత వసూళ్లు రాలేకపోయాయి. తొలి రెండు రోజులతో పోలిస్తే నెట్ వసూళ్లు మూడో రోజు మరింత తగ్గాయి. ఈ హిట్ 3 మూవీ మే 1న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి.

మూడో రోజు ఎన్ని కోట్లంటే?

నాని హిట్ 3 మూవీ మూడో రోజు (మే 3) రూ.8.57 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టినట్టు సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. దీంతో ఈ క్రైమ్ థ్రిల్లర్ కు మూడు రోజుల్లో కలిపి ఇండియాలో రూ.40.07 కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. నాని సినిమా ఇండియాలో ఫస్ట్ రోజు రూ.21 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. ఇందులో తెలుగు నుంచి రూ.20.25 కోట్లు, తమిళంలో రూ.0.35 కోట్లు, కన్నడలో రూ.0.05 కోట్లు, హిందీ నుంచి రూ.0.25 కోట్లు, మలయాళం నుంచి రూ.0.1 కోట్లు రాబట్టింది.

రెండో రోజు నాని హిట్ 3 మూవీకి రూ.10.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. దీంతో రెండు రోజుల వసూళ్లు రూ.31 కోట్లకు చేరడంతో పాటు హిట్ 2 లైఫ్ టైమ్ వసూళ్లను అధిగమించింది. అయితే తొలి శనివారం (3వ రోజు) ఈ చిత్రం రూ.8.57 కోట్లు మాత్రమే రాబట్టింది. మొత్తం రూ.40.07 కోట్లకు చేరింది.

రెట్రో కంటే ఎక్కువే

మరోవైపు సూర్య రెట్రో మూవీకి ఆశించిన వసూళ్లు దక్కడం లేదు. మూడో రోజు ఆ మూవీ రూ.4.48 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. మూడో రోజుల్లో సూర్య సినిమా మొత్తం వసూళ్లు రూ.31.48 కోట్లుగా ఉన్నాయి. రెట్రో కూడా మే 1న విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. సూర్య యాక్షన్ అవతారాన్ని కొందరు ప్రశంసించగా, మరికొందరు సినిమా కాస్త స్లోగా ఉందని భావించారు.

గ్రాస్ వసూళ్లు ఇలా

మరోవైపు నాని హిట్ 3 మూవీ గ్రాస్ వసూళ్లు రూ.100 కోట్లకు చేరేలా కనిపిస్తున్నాయి. ఈ మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.62 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ ప్రకటించారు. వాల్ పోస్టర్ సినిమాపై శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని, నాని నిర్మించిన చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో సూర్య శ్రీనివాస్, రావు రమేష్, నెపోలియన్, కోమలి ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024