





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలో రెండు రోజుల్లో 19 సినిమాలు.. చాలా స్పెషల్గా 7 మాత్రమే.. తెలుగులో 3 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి రెండు రోజుల్లో 19 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్గా 7 మాత్రమే ఉంటే.. తెలుగులో కేవలం 3 ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, సోనీ లివ్, ఆహా ఓటీటీ రిలీజ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ప్రతివారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే, వాటిలో ఎక్కువగా గురు, శుక్రవారాల్లో ఓటీటీ రిలీజెస్ అవుతుంటాయి. కానీ, ఈ వారం మాత్రం బుధ, గురు వారాల్లో అధికంగా ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి. మరి అవేంటో లుక్కేద్దాం.
నెట్ఫ్లిక్స్ ఓటీటీ
ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ది బిగ్ ఫైట్ (ఇంగ్లీష్ యానిమేషన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30
ఎక్స్టెరిటోరియల్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- ఏప్రిల్ 30
ది ఎటర్నాట్ (స్పానిష్ సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 30
ది టర్నింగ్ పాయింట్: ది వియాత్నం వార్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఏప్రిల్ 30
ది బిగ్గెస్ట్ ఫ్యాన్ (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 1
యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ (స్పానిష్ డాక్యుమెంటరీ సిరీస్)- మే 1
ది ఫోర్ సీజన్స్ (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్) – మే 1
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
అనెదర్ సింపుల్ ఫేవర్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ కామెడీ చిత్రం)- మే 1
సోనీ లివ్ ఓటీటీ
బ్రొమాన్స్ (తెలుగు డబ్బింగ్ మలయాళం అడ్వెంచర్ కామెడీ సినిమా)- మే 1
బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మే 1
కేర్మీ (ఇంగ్లీష్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)- యాపిల్ ప్లస్ టీవీ- ఏప్రిల్ 30
ఛల్ మేరా పుట్ట్ 2 (పంజాబీ కామెడీ డ్రామా సినిమా)- చౌపల్ ఓటీటీ- ఏప్రిల్ 30
కొస్టావో (హిందీ బయోగ్రాఫికల్ క్రైమ్ డ్రామా చిత్రం)- జీ5 ఓటీటీ- మే 1
వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ (తెలుగు కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆహా ఓటీటీ- మే 1
ఈఎమ్ఐ (తమిళ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- మే 1
భోగ్ (బెంగాలీ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్చోయ్ ఓటీటీ- మే 1
హార్ట్ బీట్ (హిందీ డబ్బింగ్ తమిళ, తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జియో హాట్స్టార్ ఓటీటీ- మే 1
వరుణన్ (తమిళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- మే 1
పరమాన్ (తమిళ సోషల్ డ్రామా చిత్రం)- సన్ ఎన్ఎక్స్టీ ఓటీటీ – మే 1
ఓటీటీలోకి 19
ఇలా బుధవారం (ఏప్రిల్ 30), గురువారం (మే 1) రెండు రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు కలిపి మొత్తంగా 19 వరకు ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చాయి. వీటిలో బ్రొమాన్స్, బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్, భోగ్, కొస్టావో, వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్, ఎక్స్టెరిటోరియల్, ది ఎటర్నాట్ మాత్రమే చూసేందుకు చాలా స్పెషల్గా ఉన్నాయి.
ఇంట్రెస్టింగ్ సినిమాలు
అంటే, 19లో కేవలం 7 మాత్రమే చాలా స్పెషల్గా ఉంటే వీటిలో తెలుగు భాషలో మూడు మాత్రమే ఇంట్రెస్టింగ్గా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం