





Best Web Hosting Provider In India 2024

థియేటర్స్‌కు పిల్లల్ని తీసుకురావడం లేదు, లేడీస్‌కు ఎక్కువ నచ్చడం సర్ప్రైజింగ్.. డైరెక్టర్ శైలేష్ కొలను కామెంట్స్
హిట్ ఫ్రాంచైజీతో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను. నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ హిట్ 3. మే 1న థియేటర్లలో విడుదలైన హిట్ 3కి రెస్పాన్స్ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో సినీ విశేషాలను డైరెక్టర్ శైలేష్ కొలను పంచుకున్నారు.
టాలీవుడ్లో హిట్ ఫ్రాంచైజీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను. ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీనే హిట్ 3. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన హిట్ ది థర్డ్ కేస్ మూవీలో హీరోయిన్గా కన్నడ బ్యూటి శ్రీనిధి శెట్టి చేసింది.
పాన్ ఇండియాగా గ్రాండ్ రిలీజ్
మే 1న పాన్ ఇండియాగా గ్రాండ్ రిలీజ్ అయిన హిట్ 3 మూవీకి వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో డైరెక్టర్ శైలేష్ కొలను ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినీ విశేషాలను విలేకరుల సమావేశంలో పంచుకున్నారు.
నానిని ఎంత వయోలెంట్‌గా చూపించాలని దసరా చూసిన తర్వాత అనిపించిందా?
-హిట్ సెకండ్ పార్ట్‌లోనే నాని గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చివరిలో ఒక గ్లింప్స్లాగా చూపించా. అర్జున్ సర్కార్ ఎలా ఉంటాడో అప్పుడే ఆడియన్స్‌కి ఒక అవగాహన వచ్చింది. ఈ తరహా పాత్రకు ఎలాంటి క్యారెక్టరైజేషన్ కావాలో అలా డిజైన్ చేయడం జరిగింది.
-ఈ సినిమాకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారని ముందు అనుకున్నాం. అయితే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ లేడీస్‌కి ఎక్కువగా నచ్చడం మాకు సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. మేమైతే ఒక టార్గెట్ ఆడియన్స్ అనుకున్నాము. మా అంచనాలను దాటి ఆడియన్స్ వస్తున్నారు. ముఖ్యంగా థియేటర్స్‌లోకి ఫ్యామిలీస్ వచ్చేస్తున్నారు. పిల్లల్ని తీసుకురావడం లేదు. అదొక గుడ్ థింగ్.
-గత రెండు రోజులుగా థియేటర్స్ విజిట్ చేస్తున్నాం. చాలామంది లేడీస్ ధియేటర్స్ రావడం గమనించాం. బహుశా నాని గారిని అలాంటి డిఫరెంట్ క్యారెక్టర్జేషన్లో చూడడానికి ఒక ఎగ్జైట్మెంట్తో వస్తున్నారు.
ఇంత వయోలెంట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు నాని గారి ఫస్ట్ రియాక్షన్ ఏంటి?
-ప్రిమైజ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కథ బాగా చెప్పగలిగితే అద్భుతంగా ల్యాండ్ అవుతుందని ముందే అనుకున్నాం. ఈ క్యారెక్టర్ మీద నాకు, నాని గారికి మొదటి నుంచి నమ్మకం ఉంది. అది కరెక్ట్ ప్లేస్‌లో ల్యాండ్ అయింది. ఆడియన్స్ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది.
ఇందులో డార్క్ వెబ్‌ని ఎక్స్‌ఫ్లోర్ చేశారు కదా.. దాని గురించి ?
–డార్క్ వెబ్ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సైబర్ డిపార్ట్మెంట్ దీని మీద వర్క్ చేస్తోంది. ఈ సినిమా కోసం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా హెల్ప్ చేశారు. డార్క్ వెబ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
సంబంధిత కథనం