




Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి 270 కోట్ల యాక్షన్ థ్రిల్లర్.. 5 భాషల్లో స్ట్రీమింగ్.. 6.9 ఐఎమ్‌డీబీ రేటింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి మరో నాలుగు రోజుల్లో రూ. 270 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్ కానుంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫిషియల్‌గా ప్రకటించారు. 6.9 ఐఎమ్‌డీబీ రేటింగ్ సాధించిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకుందాం.
ఓటీటీలోకి రూ. 270 కోట్ల భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్ కానుంది. ఆ సినిమానే గుడ్ బ్యాడ్ అగ్లీ. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన లేటెస్ట్ మూవీనే గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ సినిమాలో అజిత్‌కు జోడీగా త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా చేసింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ నటీనటులు
అలాగే, గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, ప్రియా ప్రకాష్ వారియర్, సునీల్, షైన్ టైమ్ చాకో, ప్రభు, ప్రసన్న వెంకటేషన్, యోగిబాబు, రాహుల్ దేవ్, తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఇక భారీ అంచనాల నడుమ వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైంది.
రూ. 246 కోట్ల కలెక్షన్స్
దాంతో బాక్సాఫీస్ వద్ద గుడ్ బ్యాగ్ అగ్లీ కలెక్షన్ల వర్షం కురిపించింది. గుడ్ బ్యాడ్ అగ్లీ సుమారు రూ. 200 కోట్ల కలెక్ట్ చేసిందని ట్రేడ్ సంస్థలు తెలిపాయి. అలాగే, తమిళంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా గుడ్ బ్యాడ్ అగ్లీ నిలిచింది. ఇక వరల్డ్ వైడ్‌గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి రూ. 246 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు సక్నిల్క్ సంస్థ పేర్కొంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్
అలాంటి గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీలోకి వచ్చేయనుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో మే 8వ తేది నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అంటే, ఇంకో నాలుగు రోజుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ రిలీజ్ అవనుంది. అది కూడా తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి 5 భాషల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
ఐఎమ్‌డీబీ రేటింగ్
ఈ విషయాన్ని తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. సుమారు రూ. 270 నుంచి 300 కోట్ల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు ఐఎమ్‌డీబీ సంస్థ 10కి 6.9 రేటింగ్ ఇచ్చింది.
రూ. 270 కోట్ల బడ్జెట్
దాదాపుగా 28 రోజుల్లో రూ. 270 కోట్ల భారీ యాక్షన్ థ్రిల్లర్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో అదరగొట్టిన గుడ్ బ్యాడ్ అగ్లీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం