నిన్నుకోరి ప్రోమో: వరదరాజులుకు ఎదురుతిరిగిన చంద్రకళ- శ్రీరాజ్ చెంపలు వాయించిన చెల్లి- స్పృహలోకి వచ్చిన రఘురాం!

Best Web Hosting Provider In India 2024

నిన్నుకోరి ప్రోమో: వరదరాజులుకు ఎదురుతిరిగిన చంద్రకళ- శ్రీరాజ్ చెంపలు వాయించిన చెల్లి- స్పృహలోకి వచ్చిన రఘురాం!

Sanjiv Kumar HT Telugu

నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రఘురాం మావయ్యను వ్యాన్‌తో గుద్ది యాక్సిడెంట్ చేసింది శ్రీరాజ్ అన్నయ్యే అని ఇంట్లోవాళ్లకు చెబుతుంది చంద్రకళ. ఆ తర్వాత స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (జియో హాట్‌స్టార్) ఓటీటీలో ప్రసారం అవుతోన్న నిన్ను కోరి సీరియల్‌లో ఏం జరిగిందంటే?

నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

నిన్ను కోరి సీరియల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌‌ ప్రోమోలో హాస్పిటల్‌లో రఘురాంను వార్డ్ బాయ్ గెటప్‌లో చంపేందుకు ప్రయత్నిస్తుంటాడు శ్రీరాజ్. కానీ, ఎవరు మాట వినకుండా జగదీశ్వరి ఐసీయూలోకి రావడంతో పక్కన ఉన్న కర్టెన్స్ వైపు దాక్కుంటాడు. ఐసీయూలోకి జగదీశ్వరుతోపాటు విరాట్, వరదరాజులు కూడా వస్తారు.

తల్లిని ఓదార్చిన విరాట్

రఘురాంను చూసి జగదీశ్వరి కుమిలిపోతుంటుంది. శ్రీరాజ్ ఎక్కడున్నాడో చూసిన వరదరాజులు దొరకలేదని ఊపిరి పీల్చుకుంటాడు. అమ్మకు సర్దిచెప్పి బయటకు తీసుకెళ్లమని వరదరాజులు అంటాడు. తల్లి జగదీశ్వరిని విరాట్ ఓదార్చుతుంటాడు. కానీ, జగదీశ్వరి మాట వినదు. ఇంతలో డాక్టర్ వచ్చి ఇక్కడ ఇంతమంది ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోండి. పేషంట్‌ను డిస్టర్బ్ చేయకండి అని అందరిని బయటకు పంపిస్తాడు.

తర్వాత కాసేపటికి రఘురాం కోమాలోకి వెళ్లిపోయినట్లు డాక్టర్‌కు తెలుస్తుంది. ఆ విషయం ఇంట్లోవాళ్లకు చెబుతాడు డాక్టర్. దాంతో అంతా షాక్ అయి ఏడుస్తూ ఉంటారు. వరదరాజులు, శ్రీరాజ్ మాత్రం సంతోషంగా ఫీల్ అవుతారు. మళ్లీ కాసేపటికి రఘురాంకు ట్రీట్‌మెంట్ చేస్తాడు డాక్టర్. అప్పుడు రఘురాం కోమా నుంచి బయటకు వస్తాడు. అయితే, డాక్టర్‌తో మాట్లడలేడు, చెప్పింది వినలేకపోతాడు రఘురాం.

ఓ నిర్ణయానికి వచ్చిన డాక్టర్ బయటకు వచ్చి రఘురాంకు స్పృహ వచ్చిందని చెబుతాడు. దాంతో వరదరాజులు, శ్రీరాజ్ ఉలిక్కిపడతారు. రఘురాం కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. కానీ, స్పృహ అయితే వచ్చింది కానీ, మాట్లాడలేడు, వినలేడు. ఇలా ఎంతకాలం ఉంటారో చెప్పలేం అని డాక్టర్ చెబుతాడు. దాంతో ఇంట్లోవాళ్లు బాధపడుతుంటే వరదరాజులు, శ్రీరాజ్ సంతోషిస్తారు.

నరరూప రాక్షసుడు

ఇక వాడు ఏం చేయలేడని వరదరాజులు ఫిక్స్ అవుతాడు. కాసేపటికి వరదరాజులు కుటుంబం ఇంటికి వెళ్తుంది. ఇంట్లో రఘురాంకు అలా జరగడంపై అంతా బాధపడుతుంటారు. దేవుడు లాంటి మనిషికి ఆ గతి పట్టించాడు దేవుడు అని చంద్రకళ తల్లి అంటుంది. అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రకళ మావయ్యకు ఆ గతి పట్టించింది దేవుడు కాదమ్మా. నరరూప రాక్షసుడు అని అంటుంది.

దాంతో అంతా షాక్ అవుతారు. శ్రీరాజ్ భయంగా చూస్తాడు. ఇంట్లో వాళ్లు ఏం అర్థంకానట్లు చూస్తారు. రఘురాం మావయ్యను వ్యాన్‍‌తో గుద్ది చంపాలని ప్రయత్నించింది ఈ నీచుడే నానమ్మ అని శ్రీరాజ్ గురించి చంద్రకళ చెబుతుంది. దాంతో మరింత షాక్ అవుతాడు శ్రీరాజ్. ఇంట్లో వాళ్లంతా అవాక్కవుతారు. ఏంటండి.. తను అన్నేసి మాటలు అంటుంటే మీరు మౌనంగా ఉన్నారేంటీ అని శ్రీరాజ్ భార్య అంటుంది.

నిన్నటిదాకా ఆ ఇంటి వాళ్లు నిందలు వేశారు. ఇప్పుడు ఈవిడ మొదలుపెట్టింది అని శ్రీరాజ్ అంటాడు. దాంతో కోపంతో ఊగిపోయిన చంద్రకళ అన్నయ్య శ్రీరాజ్ చెంపలు వాయిస్తుంది. దాంతో ఇంట్లోవాళ్లంతా తెగ షాక్ అయిపోతారు. ఇలా కొట్టిందేంటీ అని అనుకుంటారు. అది చూసి తట్టుకోలేక చంద్రకళను కొట్టడానికి చేయి లేపుతాడు వరదరాజులు.

నిజం చెప్పిన చంద్రకళ

కానీ, వరదరాజులు చేయిని పట్టుకుని ఆపుతుంది చంద్రకళ. అది చూసి శ్రీరాజ్‌తోపాటు ఇంట్లో వాళ్లు షాక్ అవుతారు. వరదరాజులుకు చంద్రకళ ఎదురు తిరగడం చూసి అంతా అవాక్కవుతారు. చంద్రకళ ఏం చేస్తున్నావ్ అని తల్లి అడిగితే.. అంతా చేసింది వీళ్లేనమ్మా అని నిజం చెబుతుంది.

రఘురాం మావయ్య వాళ్లకు రూ. రెండు కోట్లు పంపడం అబద్ధం. నాతో డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి పెద్దనాన్నే కొట్టేశాడు. అదంతా సీసీ టీవీ ఫుటేజ్‌లో రఘురాం మావయ్య చూశారు. ఆ విషయం నాకు చెప్పారు. అలాగే, విరాట్ బావ కంపెనీకి కావాలనే శ్రీరాజ్ అన్నయ్య నష్టం చేశారు. కాంట్రాక్టర్‌ను కొనేశాడు. అది నేను కళ్లారా చూశాను. పెద్దనాన్న, అన్నయ్య ఇద్దరు ప్లాన్ చేసి మనల్ని మోసం చేసి పగ తీర్చుకునేందుకు ఇక్కడికి వచ్చారని చంద్రకళ చెబుతుంది.

అన్నయ్యే చేశాడు

ఇదంతా తెలిసి జగదీశ్వరి అత్తయ్యకు రఘురాం మావయ్య చెప్పాలనుకున్నాడు. అలాగే, సర్దిచెప్పి నాతో విరాట్ బావకు పెళ్లి చేయాలనుకున్నాడు. అత్తయ్యకు నిజం చెప్పి ఎక్కడ విరాట్ బావతో నా పెళ్లి చేయిస్తారో అని రఘురాం మావయ్యను వ్యాన్‌తో గుద్దాడు శ్రీరాజ్ అన్నయ్య అని చంద్రకళ చెబుతుంది. అక్కడితో నిన్ను కోరి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024