మీరు నిద్రలో నవ్వుతుంటారని ఎవరైనా చెప్పారా? మరి దానికి ఏయే కారణాలున్నాయో తెలుసుకోండి!

Best Web Hosting Provider In India 2024

మీరు నిద్రలో నవ్వుతుంటారని ఎవరైనా చెప్పారా? మరి దానికి ఏయే కారణాలున్నాయో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

నిద్రలో నవ్వుకోవడం సాధారణంగానే చాలా మందిలో కనిపించే అలవాటే. వాస్తవానికి ఇది ఒక న్యూరాలాజికల్ సమస్య. అంతేకాకుండా దీనికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయట. అవేంటో చూసేద్దామా?

నిద్రలో నవ్వడం వెనుక కారణం

మీరు నిద్రపోతున్నప్పుడు నవ్వారని మీ కుటుంబ సభ్యుల్లోనో, ఇంకా తెలిసిన వాళ్లెవరైనా చెప్పారా? నిజానికి ఇలాంటి అలవాటు చాలా మందికి ఉంటుందట. పెద్దవాళ్లలో ఇది తక్కువగా కనిపించినా చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇందులో కొద్దిగా సమస్య ఉన్నప్పటికీ ఇది ఎటువంటి హానికరమైన విషయం కాదు. కొన్నిసార్లు స్లీప్ డిజార్డర్ వల్ల, న్యూరాలాజికల్ పరిస్థితి కారణంగానైనా ఇలా జరగొచ్చు.

మరి దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కలలు:

చాలామంది నిద్రపోతున్నప్పుడు కనురెప్పలను వేగంగా కదిలిస్తుంటారు. దీనినే ర్యాపిడ్ ఐ మూమెంట్ (REM) స్లీప్ అంటారు. అలాంటప్పుడు ఏ వ్యక్తైనా కలల్లో ఉన్నారని అర్థం. ఆ పరిస్థితుల్లో కలలను బట్టి బ్రెయిన్ నవ్వును ప్రేరేపిస్తుందట. “కల బ్రెయిన్ యాక్టివిటీని మెరుగుపరుస్తుందట. అప్పుడే ఎమోషనల్ ఫీలింగ్ కలుగుతుంది. దాంతో సహజంగానే నవ్వుతుంటాం” అని ఫిజీషియన్ డా. తారానాథ్ చెబుతున్నారు.

పారాసోమ్నియా:

ఇదొక స్లీపింగ్ డిజార్డర్. నిద్రపోతున్నప్పుడు కలిగే చర్యల్లో ఇదొకటి. ప్రవర్తనల్లో మార్పుల కారణంగా నిద్రపోయే సమయంలో శరీరాన్ని పేరలైజ్ కాకుండా ఉంచుతుంది. ఆ విధంగా శరీరంలో కదలికలు కలుగుతాయి. ఒక్కోసారి నవ్వుతారు కూడా.

న్యూరాలాజికల్ కండీషన్స్:

చాలా అరుదైన పరిస్థితుల్లో మాత్రం స్లీప్ లాఫింగ్ లేదా హైప్నోగెలీ అనేది ఒక న్యూరాలాజికల్ డిజార్డర్ కూడా అనుకోవచ్చు. పార్కిన్సన్ డిసీజ్, మల్టిపుల్ క్లెరోసిస్ వంటివి నరాల జబ్బులు ఒక్కోసారి ఈ పరిస్థితికి కారణమవుతాయి. ఈ సమస్యలు ఉన్న వారు కేవలం కలలు కారణంగానే నవ్వారని అనుకోకూడదు.

ఎమోషనల్ స్ట్రెస్ లేదా మానసిక పరిస్థితుల ప్రభావం:

నిద్రలో నవ్వుకు ఒత్తిడి కూడా కారణం కావొచ్చు. క్రోనిక్ ఒత్తిడి, ఆందోళన, మూడ్ డిజార్డర్స్ నిద్రపై ప్రభావం చూపిస్తుంది. ఇది మీ ఎమోషనల్ రెస్పాన్స్‌ను మారుస్తుంది. అది మీరు కలలో ఉన్నప్పటికీ నవ్వు తీవ్రతను పెంచి బయటకు కనిపించేలా చేస్తుంది.

సంపూర్ణ విశ్రాంతి దొరికినప్పుడు:

కొన్ని సమయాల్లో మానసికంగా ఒత్తిడి లేకుండా మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు లైట్ హార్టెడ్ కలల్ని ప్రాసెస్ చేస్తుంది. అలాంటి వారిలో నిద్రపోయేటప్పుడు నవ్వు ఎక్కువగా కనిపించొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మానసికంగా ప్రశాంతంగా ఉండటం కోసం ధ్యానం, యోగా లేదా యాంటీ స్ట్రెస్ కార్యకలాపాలు చేస్తుండాలి.

జన్యుపరమైన ప్రభావం:

నిద్ర గురించి జన్యుపరంగా చాలామందిలో కొన్ని లక్షణాలు కనిపించొచ్చు. నిద్రలో మాట్లాడటం, నిద్రలో నడవడం, నిద్రలో నవ్వడం వంటివి. ఒకే కుటుంబంలో ఇలాంటివి ఉంటే జన్యుపరమైన సంబంధం ఉన్నట్లు భావించొచ్చు. మీ తల్లి, తండ్రి లేదా మీ తోబుట్టువుల్లో ఎవరికైనా ఉంటే మీకు లేదా మీ సంతానానికి ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి జన్యుపరంగా కూడా నిద్రలో నవ్వడం అనేది సాధారణమే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు.

కాకపోతే, నిద్రలో నవ్వడంతో పాటు ఎక్కువగా ఒంటరితనం, మూడ్ స్వింగ్స్, నిద్రలేమితో బాధపడుతున్నట్లయితే సైకాలజిస్టును సంప్రదించడం మంచిది.

చిన్నారుల్లో నవ్వు కలగడానికి కారణం వారి బ్రెయిన్ ఎదుగుదలలో ఉండటం. వారిలో ఙాపకశక్తిని మెరుగుపరుచుకునే తీరు ఎదిగే క్రమంలో ఇలా జరగొచ్చు. ఇది హానికరం కాదు. అంతేకాకుండా కొన్నిసార్లు మెలకువతో ఉన్నప్పుడు చేసిన పనులు గుర్తొచ్చి కూడా వారిలో నవ్వు కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024