ఆస్తమా తగ్గినా కూడా మళ్లీ వస్తుందా? ఏయే కారణాల వల్ల ఎటువంటి ఫలితాలున్నాయో తెలుసా?

Best Web Hosting Provider In India 2024

ఆస్తమా తగ్గినా కూడా మళ్లీ వస్తుందా? ఏయే కారణాల వల్ల ఎటువంటి ఫలితాలున్నాయో తెలుసా?

Ramya Sri Marka HT Telugu

ఆస్తమా అనేది చాలా ఇబ్బందికరంగా ఉండటమే కాదు, భవిష్యత్ ను కూడా ప్రశ్నార్థకంగా మార్చే సమస్య. ఈ వ్యాధితో పోరాడి బయటపడిన తర్వాత ప్రశాంతంగా ఊపిరి పోల్చుకుంటే సరిపోతుందా? ఈ సమస్య పూర్తిగా తొలగిపోయినట్లేనా.. అంటే కాదనే అంటున్నారు నిపుణులు. అదేంటో చూసేయండి.

ఆస్తమాతో ఇబ్బందిపడుతున్న వ్యక్తి (Image by 8photo on Freepik)

ఆస్తమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్య. ప్రశాంతంగా కూర్చోనివ్వదు. నిలబడనివ్వదు. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందికరంగా మార్చి కుదుటగా ఉండనీయకుండా చేస్తుంది. అంతేకాదు, ఇది ఛాతీలో శబ్దం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని సృష్టిస్తుంది. వృద్ధుల్లో చాలా మంది ఆస్తమా సమస్యతో శ్వాసకు ఇబ్బంది అయి ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. దీనికి కారణం శ్వాసనాళాల వాపు, సంకోచం వల్ల కలిగే ఆస్తమా తీవ్రత మారుతూ ఉంటుంది. అయితే ఆస్తమా మీద చాలా మందికి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల చాలా మందికి అది అదృశ్యమై మళ్ళీ వస్తుందా అనే సందేహం ఎక్కువ మందిలో కనిపిస్తుంది.

ఇదే విషయంపై హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో ఇంటర్వ్యూలో, ఫోర్టిస్ హాస్పిటల్ వసంత కుంజ్‌లో సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ సక్సేనా మాట్లాడారు.

పూర్తిగా తగ్గిందనుకోవద్దు:

ఆస్తమా ఉన్న చాలా మంది పిల్లలు తమ కౌమారదశ లేదా యవ్వన దశకు చేరుకున్న తర్వాత లక్షణాల నుండి గణనీయమైన ఉపశమనం పొందుతారు. అలా కలగడం వల్ల పేరెంట్స్‌లో గానీ, సన్నిహితుల్లో గానీ ఆస్తమా పూర్తిగా తగ్గిపోయిందనే భావన కలుగుతుంది. వాస్తవానికి ఆయా కుటుంబాలు ఆస్తమా గురించి పూర్తిగా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు” అని చెబుతున్నారు.

చిన్నతనంలో కనిపించిన ఆస్తమా వ్యాధి లక్షణాల తీవ్రత, లక్షణాలు తక్కువగా ఉన్నప్పటికీ శరీరంలో సమస్య పూర్తిగా తగ్గిపోయినట్లు కాదు. దాని ప్రవృత్తి కొనసాగుతూనే ఉంటుంది. లక్షణాలు లేని కాలంలో కూడా, శ్వాసనాళాలు కొన్ని ట్రిగ్గర్లకు సున్నితంగా ఉంటాయి.

ఆస్తమా లక్షణాలు తక్కువ కావడం:

“పిల్లలలో లక్షణాలు తగ్గడానికి అనేక కారణాలు ఉండవచ్చు, వాటిలో రోగనిరోధక వ్యవస్థ పరిపక్వం సాధించడం, అలెర్జీలకు తక్కువగా స్పందించడం, శ్వాసనాళాల సహజ పెరుగుదల వంటివి దోహదపడతాయి. ఇవన్నీ ఆరోగ్యకరమైన శ్వాసకోశ పనితీరుకు దోహదం చేస్తాయి” అని డాక్టర్ ప్రశాంత్ సక్సేనా అన్నారు.

“చిన్నతనంలో ఆస్తమాకు గురైన వారికి తిరిగి కొన్నేళ్ల తర్వాత ఆస్తమాకు గురయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. దీని వల్ల రోగులు, కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుందని ఆయన చెబుతున్నారు. కానీ, కొందరు శాశ్వతంగా ఆస్తమా సమస్య పోయిందనే బాధలో ఉంటారు. అలా ఉండొద్దని రోగులు, కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది” అని డాక్టర్ హైలైట్ చేస్తూ ప్రస్తావించారు.

ఆస్తమా మళ్ళీ ఎందుకు వస్తుంది?

లైఫ్ లో దూరమైపోయిందనుకున్న సమస్య మళ్లీ వస్తుందంటే, అది ఎందుకనే సందేహం మీలోనూ కలిగిందా? “ఆస్తమా అనేది జీవితంలో ఏదైనా దశలో, కొన్నిసార్లు సంవత్సరాలు లేదా దశాబ్దాల తర్వాత కనిపించొచ్చు. ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండానే ఆస్తమా లక్షణాలు మళ్ళీ రావచ్చు. పెద్దవారిలో అస్తమా రావడానికి కారణాలు శ్వాసకోశ సంక్రమణలు, హార్మోన్ల మార్పులు, పర్యావరణ ట్రిగ్గర్లు, స్వచ్ఛమైన గాలి దూరమై పొల్యూషన్ పెరిగిపోవడం కూడా హ ద్యోగ సంబంధిత ప్రభావాలు కావచ్చు,” అని పల్మనాలజిస్ట్ అన్నారు.

మీ వంతు బాధ్యతగా సమస్య ఉందని అనుమానం వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. సరిపడని ఆహారానికి దూరంగా ఉంటూ వైద్యుల సలహా తప్పక పాటించాలి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024