హరి హర వీరమల్లు సినిమా: పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‍న్యూస్

Best Web Hosting Provider In India 2024

హరి హర వీరమల్లు సినిమా: పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‍న్యూస్

హరి హర వీరమల్లు గురించి సూపర్ అప్‍డేట్ వచ్చేసింది. సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఊరట కలిగించే విషయం ఇది.

హరి హర వీరమల్లు సినిమా: పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్‍న్యూస్

హరి హర వీరమల్లు సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఐదేళ్లుగా బ్రేక్‍లు పడుతూ కాస్త ముందుకు సాగుతూ అన్నట్టుగా ఈ ప్రాజెక్ట్ ఉంది. డైరెక్టర్ క్రిష్ తప్పుకోగా దర్శకత్వ బాధ్యతలను ఏఎం జ్యోతికృష్ణ తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ పదవి చేపట్టాక రానున్న చిత్రం కావటంతో హరి హర వీరమల్లుకు మరింత క్రేజ్ వచ్చింది. మే 9న ఈ మూవీని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించినా.. మరోసారి వాయిదా పడింది. అయితే, జోష్ తెచ్చేలా తాజా అప్‍డేట్ బయటికి వచ్చింది.

షూటింగ్‍కు పవన్

హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‍లో నేడు పవన్ కల్యాణ్ మళ్లీ పాల్గొన్నారని సమాచారం బయటికి వచ్చింది. పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేసేందుకు జాయిన్ అయ్యారని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తయితే మూవీ రిలీజ్ డేట్‍పై ఓ క్లారిటీ వస్తుంది. దీంతో ఈ తాజా అప్‍డేట్‍తో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హరి హర వీరమల్లు సినిమాకు పవన్ మరో నాలుగు రోజులు కేటాయిస్తే షూటింగ్ పూర్తయ్యే దశకు వచ్చింది. కానీ టైమ్ దొరకకపోవటంతో ఆయన చిత్రీకరణ కంప్లీట్ చేయలేకపోయారు. దీంతో మే 9 నుంచి మూవీ వాయిదా పడింది. ఇప్పుడు మిగిలిన షూటింగ్‍ను పవన్ పూర్తి చేసేందుకు రెడీ అయ్యారు.

జూన్‍లో సాధ్యమేనా!

పవన్ కల్యాణ్ మళ్లీ హరి హర వీరమల్లు షూటింగ్‍కు జాయిన్ అవడంతో సినిమా రిలీజ్ ఎప్పుడనే చర్చ మొదలైంది. జూన్‍లోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. చిత్రీకరణ పూర్తయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులను అంచనా వేసుకొని కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. మరి జూన్‍లో ఈ మూవీ వస్తుందేమో చూడాలి.

హరి హర వీరమల్లు చిత్రం పీరియడ్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. మొఘలుల కాలం నాటి బ్యాక్‍‍డ్రాప్‍లో ఈ చిత్రం రూపొందుతోంది. 2020లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. చివరికి డైరెక్టర్ క్రిష్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. గతేడాది ఏఎం జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

హరి హర వీరమల్లు చిత్రంలో పవన్ కల్యాణ్‍కు జోడీగా నిధి అగర్వాల్ జోడీగా నటిస్తున్నారు. బాబీ డియోల్, సత్యరాజ్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి, విక్రమ్‍జీత్ విర్క్, జిస్సు సెంగుప్తా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. మెగాసూర్య ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై ఏ దయాకర్ రావ్, ఏఎం రత్నం ప్రొడ్యూజ్ చేస్తున్నారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024