





Best Web Hosting Provider In India 2024

ఏపీలో భారీగా అక్రమ మైనింగ్, వెనుక టీడీపీ ఎంపీ- మాజీ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో అక్రమ మైనింగ్ జరుగుతోందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. అక్రమ మైనింగ్ వెనుక టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ వేమిరెడ్డి అక్రమ మైనింగ్ లో 70 శాతం మంది టీడీపీ బాధితులే ఉన్నారన్నారు.
“ఏపీలో 150-200 మైన్స్ ఉంటే, వాటిలో యాక్టీవ్ మైన్స్ 100 వరకూ ఉంటాయి. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఈ 10 నెలల్లో కేవలం 30 మైన్స్‌ను మాత్రమే సెలెక్టీవ్‌గా ఓపెన్ చేశారు. రాష్ట్రం నుంచి ఒక టన్ను మైన్స్ బయటికి వెళ్లినా.. ప్రభుత్వం తరఫున ఎక్కడో ఒక చోట పర్మిట్ కొట్టి తీరాల్సిందే.
వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మైన్స్ ద్వారా రూ.150 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. కానీ ఇప్పుడు రూ.30-40 కోట్లు కూడా రావడం లేదు” అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.
ఏపీలో అక్రమ మైనింగ్ జరుగుతోందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శంచారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో గనులపై జరిమానాలు విధించారన్నారు. శోభారాణి మైన్ కు రూ. 32 కోట్లు విధించారని చెప్పారు. అధికారులు విచారణ చేసి ఆ గనిలో 35 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో తెలిపారన్నారు.
అక్రమ మైనింగ్
ఏడు నెలల తర్వాత అక్కడ లక్ష 25 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఈ తెల్లరాయిని తరలించేందుకు పర్మిషన్ ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు ఎమ్మార్వో చెబుతున్నారు. సాధారణంగా మైన్స్ కాల పరిమితి ముగిసిన తర్వాత ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి. ఇలాంటి గనులన్నింటినీ స్వాధీనం చేసుకుని అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని మాజీ మంత్రి అనిల్ ఆరోపించారు.
గనుల వద్ద గూండాలు
“కూటమి ప్రభుత్వం కొత్త గనుల విధానం ప్రకారం గనుల వద్ద తెల్లరాయి నిల్వలను వేస్తామన్నారు. ఈ తెల్లరాయిని వేలం వేస్తే ప్రభుత్వానికి రూ.500 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ గనుల్లో కొన్నింటిని అమర్ నాథ్ రెడ్డి నిర్వహిస్తున్నారు. వీటిని పరిశీలించేందుకు అధికారులను అనుమతించడం లేదు. గనుల వద్ద గూండాలను పెట్టుకున్నారు. అక్రమ మైనింగ్ కోసం పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారు” – మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
వేమిరెడ్డి సమాధానం చెప్పాలి
ఈ అక్రమ మైనింగ్ వెనుక టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ఉన్నారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. అధికారులకు అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాలపై ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరు తెల్ల రాయి తీసినా తనకే అమ్మాలని వేమిరెడ్డి భయపెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.
టీడీపీ వాళ్లే బాధితులు
గనుల్లో 70 శాతం మంది బాధితులు టీడీపీ వాళ్లేనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి రూ.15 వందల కోట్ల మేర దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. గనుల్లో అక్రమాలు చేస్తున్న ఎంపీ వేమిరెడ్డిపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించారు. అక్రమంగా మైనింగ్ చేస్తే అందరికీ అవకాశం కల్పించారని, కేవలం బడా బాబులకు మాత్రమే అవకాశం ఇవ్వడం మంచిది కాదన్నారు. అక్రమ మైనింగ్ పై స్వయంగా వెళ్లి పరిశీలిస్తానన్నారు.
తనపై కేసులు పెట్టి అరెస్టు చేస్తే అందరూ బయటకు వస్తారని అన్నారు. తనతో పాటు సిండికేట్ లో అన్న వారంతా ఇబ్బంది పడతారని, వారి పేర్లు బయటపెడతానన్నారు.
సంబంధిత కథనం
టాపిక్