





Best Web Hosting Provider In India 2024

ముగిసిన తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు- ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్లు విడుదల
తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ స్ట్రీమ్ లలో సుమారు 93 శాతానికి పైగా హాజరు నమోదు అయిందని అధికారులు తెలిపారు. ఈ మూడు విభాగాల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చర్ పేపర్లు విడుదల అయ్యాయి.
తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి. జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు 93 శాతం పైగా హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగగా, మే 2, 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు.
టీజీ ఈఏపీసెట్ అగ్రికల్చర్ పరీక్షకు 92 శాతం, ఫార్మసీ స్ట్రీమ్‌లో 94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో దాదాపు 94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. తెలంగాణ ఈఏపీసెట్ రెస్పాన్స్ షీట్, ప్రాథమిక కీ పై నిర్వాహకులు అప్డేట్ ఇచ్చారు.
అగ్రికల్చర్, ఫార్మసీ కీ, రెస్పాన్స్ షీట్
టీజీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ ను https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు మే 04వ తేదీ మధ్యాహ్నం 12:00 నుంచి మే 06, 2025 మధ్యాహ్నం 12:00 వరకు ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలు (ఏదైనా ఉంటే) సమర్పించడానికి అవకాశం కల్పించారు.
ఇంజినీరింగ్ ప్రిలిమినరీ కీ విడుదల
మే 02 నుంచి 04వ తేదీ వరకు జరిగిన ఇంజినీరింగ్ పరీక్షలకు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నాపత్రాన్ని వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ వివరాలతో లాగిన్ అయితే రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు అంటే 07 మే, 2025 సాయంత్రం 05:00 గంటల లోపు తెలియజేయవచ్చు.
ఈఏపీసెట్-2025 ఆధారంగా రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈఏపీసెట్-2025 పరీక్షలకు భారీగా హాజరు నమోదు కావడం ఈ కోర్సుల్లో విద్యార్థులకున్న ఆసక్తిని తెలియజేస్తుందని అధికారులు తెలిపారు.
విద్యార్థులు ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి రెస్పాన్స్ షీట్ పొందవచ్చు.
టీజీ ఐసెట్-2025 దరఖాస్తు గడువు పొడిగింపు
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే టీజీఐసెట్ – 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా మే 3వ తేదీ నాటికి అప్లికేషన్ల గడువు ముగిసింది. అయితే ఈ గడువును మే 10వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
అర్హులైన అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇక రూ. 250 ఫైన్ తో మే 17 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
ఈ గడువు ముగిస్తే రూ. 500 ఆలస్య రుసుంతో మే 26వ తేదీ వరకు అప్లికేషన్ ప్రాసెస్ కు అవకాశం ఉంటుంది. మే 16వ తేదీ నుంచి అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఏమైనా తప్పులు ఉంటే మే 20 వరకు సవరించుకోవచ్చు.
సంబంధిత కథనం
టాపిక్