





Best Web Hosting Provider In India 2024

రూ.6 టికెట్ బ్లాక్‍లో ఎంతకు అమ్ముడయ్యాయో ఊహించగలా! ఎనలేని క్రేజ్‍తో దుమ్మురేపిన చిరంజీవి బ్లాక్‍బస్టర్ సినిమా!
జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. సరిగ్గా 35 సంవత్సరాల తర్వాత మళ్లీ వెండితెరపై ఈ ఈ క్లాసిక్ బ్లాక్‍బస్టర్ సందడి చేయనుంది. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ టికెట్ రేటు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ విషయాలు ఇవే.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. 1990లో విడుదలైన ఈ ఫ్యాంటసీ సినిమా.. బ్లాక్‍బస్టర్ అవడంతో పాటు ప్రేక్షకులకు అప్పట్లో కొత్త అనుభూతిని కలిగించింది. క్లాసిక్‍గా నిలిచిపోయింది. ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. అందాల దేవత శ్రీదేవీ ఈ మూవీలో హీరోయిన్‍గా చేశారు. ఈ మరపురాని క్లాసిక్ చిత్రం మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి కొన్ని విశేషాలు ఇవి..
35 ఏళ్లకు రీ-రిలీజ్.. 3డీలో కూడా..
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మరో ఐదు రోజుల్లో మే 9వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. సరిగ్గా 35 ఏళ్లకు మళ్లీ వెండితెరపై ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చేస్తోంది. అప్పట్లో 1990 మే 9న ఈ మూవీ విడుదలైంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని 2డీతో పాటు 3డీ వెర్షన్‍లోనూ రిలీజ్ చేస్తోంది వైజయంతీ మూవీస్.
రూ.6 టికెట్.. రూ.210
జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి అమ్ముడైన బ్లాక్ టికెట్ అప్పట్లో ఓ రికార్డు. ఈ సినిమా ఫస్ట్ మ్యాట్నీ షోకు రూ.6ల టికెట్లు బ్లాక్‍లో ఏకంగా రూ.210కి అమ్ముడయ్యాయట. ఏకంగా 35 రెట్ల అధిక ధరకు బ్లాక్‍లో టికెట్ టికెట్లు పలికాయి. అప్పట్లో ఈ మూవీకి ఆ రేంజ్‍లో క్రేజ్ వచ్చింది. థియేటర్లు చాలా రోజులు జనాలతో నిండిపోయాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. చిరంజీవి కెరీర్లో ఈ మూవీ ఓ మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది.
106 డిగ్రీల జ్వరంతో చిరంజీవి డ్యాన్స్
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో ‘దినక్కుతా’ పాట ఓ ఊపు ఊపేసింది. ఇళయరాజా బీట్.. చిరంజీవి, శ్రీదేవి అదిరే స్టెప్‍లు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే, ఈ పాట చిత్రీకరిస్తున్న సమయంలో చిరంజీవికి 108 డిగ్రీల జ్వరం ఉందట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు.
శ్రీదేవి కాల్‍షీట్లు రెండు రోజులే ఉండటంతో అంత జ్వరంలోనూ ఈ పాటకు చిరంజీవి స్టెప్స్ వేశారని తెలిపారు. ఈ పాట షూటింగ్ తర్వాత చిరంజీవిని ఆసుపత్రిలో చేర్పించగా.. 15 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారని అశ్వినీదత్ చెప్పారు.
ఒక్క రోజులో ‘అబ్బ నీ తియ్యనీ దెబ్బ’
జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని అబ్బ నీ తియ్యని దెబ్బ పాట ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆ పాట క్రేజ్ అలా ఉంది. అయితే, ఈ పాట కంపోజింగ్ అంతా ఒక్క రోజులో అయిపోయిందని చిరంజీవి చెప్పారు. ఇళయరాజా ఉదయం ట్యూన్ కంపోజింగ్ మొదలుపెట్టి మధ్యాహ్నానికే పూర్తి చేశారని, అది తనకు, రాఘవేంద్ర రావుకు బాగా నచ్చిందని తెలిపారు. మధ్యాహ్నం భోజనం సమయంలో వేటూరి సుందరరామ్మూర్తి లిరిక్స్ రాస్తే.. ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోజే పాడేశారని చిరూ అన్నారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో టూరిస్ట్ గైడ్‍గా చిరంజీవి, దేవకన్యలా శ్రీదేవి నటించారు. అమ్రిష్ పురి నెగెటివ్ రోల్ చేశారు. దిగ్గజ నటుడు అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మే 9న మరోసారి ఈ మూవీ వెండితెరపైకి వచ్చేస్తోంది.
సంబంధిత కథనం