ట్విస్టులతో సాగే మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో యూట్యూబ్‍లో ఫ్రీగా స్ట్రీమింగ్

Best Web Hosting Provider In India 2024

ట్విస్టులతో సాగే మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో యూట్యూబ్‍లో ఫ్రీగా స్ట్రీమింగ్

మలయాళంలో రూపొందిన కొన్ని సినిమాలు తెలుగు డబ్బింగ్‍లో యూట్యూబ్‍లో ఉచితంగా వస్తుంటాయి. వీటిలో కొన్ని మంచి ఇంట్రెస్టింగ్‍గా ఉంటాయి. అలా ఫ్రీగా యూట్యూబ్‍లో అందుబాటులో ఉన్న ఓ మూవీ గురించి ఇక్కడ చూడండి.

ట్విస్టులతో సాగే మలయాళ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో యూట్యూబ్‍లో ఫ్రీగా స్ట్రీమింగ్

యూట్యూబ్‍లో ఫ్రీగా సినిమాలు చూసేందుకు చాలా మంది వెతికేస్తుంటారు. ఏ సినిమా చూడాలో ఆలోచిస్తుంటారు. కొన్ని మలయాళ చిత్రాలు.. తెలుగు డబ్బింగ్‍లో యూట్యూబ్‍లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఫ్రీగా చేయవచ్చు. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ చిత్రాలు ఉన్నాయి. వాటిలో ‘ది హిట్ లిస్ట్’ ఒకటి. మలయాళ మూవీ వెట్టా (Vettah) తెలుగు డబ్బింగ్‍లో ది హిట్ లిస్ట్ పేరుతో వచ్చింది. ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం యూట్యూబ్‍లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..

యూట్యూబ్‍లో ఎక్కడంటే..

ది హిట్ లిస్ట్ చిత్రంలో కుంచకో బోబన్, కాదల్ సంధ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఊహించని ట్విస్టులతో సాగుతుంది. ఈ సినిమా యూట్యూబ్‍లో భవానీహెచ్‍డీ మూవీస్ యూట్యూబ్ ఛానెల్‍లో అందుబాటులో ఉంది. చాలా రోజుల క్రితమే ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.

ఈ సమ్మర్‌లో ఖాళీగా ఉన్న టైమ్‍లో మలయాళ థ్రిల్లర్ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్‍లో చూడాలనుకుంటే ‘ది హిట్ లిస్ట్’ మంచి ఆప్షన్. యూట్యూబ్‍లో కాబట్టి ఫ్రీగా చూసేయవచ్చు. అందులోనూ ఈ చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుంది.

వెట్టా సినిమా మలయాళంలో 2016 ఫిబ్రవరిలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీకి రాజేశ్ పిళ్లై దర్శకత్వం వహించారు. వరుస కిడ్నాప్‍లు, హత్యలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రమే ది హిట్ లిస్ట్ పేరుతో తెలుగులో డబ్బింగ్ అయింది.

ఈ చిత్రంలో కుంచకో బోబన్, మంజు వారియర్‌తో పాటు ఇంద్రజిత్ సుకుమారన్, దీపక్ పరంబోల్ సంధ్య, రోనీ డేవిడ్, ప్రేమ్ ప్రకాశ్, సానుషా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి షాన్ రహమాన్ సంగీతం అందించారు. రాజేశ్ పిళ్లై ఫిల్మ్స్ పతాకంపై రాజేశ్ పిళ్లై, హనీఫ్ మహమ్మద్ ఈ చిత్రాన్ని పొడ్యూజ్ చేశారు.

ఆఫీసర్ ఆన్ డ్యూటీతో రీసెంట్ హిట్

మలయాళ సీనియర్ యాక్టర్ కుంచకో బోబన్.. ఈ ఏడాది బ్లాక్‍బస్టర్ సాధించారు. ఆయన లీడ్ రోల్ చేసిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన విడుదలై సూపర్ హిట్ కొట్టింది. తెలుగు డబ్బింగ్‍లోనూ ఈ మూవీ థియేటర్లలో హిట్ అయింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ చిత్రం అదరగొట్టింది. భారీ వ్యూస్ సాధించింది. తెలుగులోనూ కుంచకో బోబన్ పాపులర్ అయ్యారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందిలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. నేషనల్ రేంజ్‍లో స్ట్రీమింగ్‍లో అదరగొట్టింది. ఈ సినిమాకు జితూ అష్రాఫ్ దర్శకత్వం వహించగా.. ప్రియమణి ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024