అత్యధిక బడ్జెట్‍తో రూపొందిన 5 ఇండియన్ ఓటీటీ వెబ్ సిరీస్‍లు ఇవి.. మీరెన్ని చూశారు!

Best Web Hosting Provider In India 2024

అత్యధిక బడ్జెట్‍తో రూపొందిన 5 ఇండియన్ ఓటీటీ వెబ్ సిరీస్‍లు ఇవి.. మీరెన్ని చూశారు!

కొన్ని వెబ్ సిరీస్‍లు భారీ బడ్జెట్‍తో రూపొందాయి. భారీతనం, స్టార్ నటీనటులతో అలరించాయి. అలా అత్యధిక ఖర్చయిన ఐదు భారత వెబ్ సిరీస్‍ల గురించి ఇక్కడ తెలుసుకోండి.

అత్యధిక బడ్జెట్‍తో రూపొందిన 5 ఇండియన్ ఓటీటీ వెబ్ సిరీస్‍లు ఇవి.. మీరెన్ని చూశారు!

ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో వెబ్ సిరీస్‍లకు ఆదరణ క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రేక్షకులు భారీ స్థాయిలో చూసేస్తున్నారు. అందుకే కొన్ని ఓటీటీ వెబ్ సిరీస్‍లు కూడా భారీ బడ్జెట్‍తో రూపొందుతున్నాయి. ఇప్పటికే గ్రాండ్ లెవెల్‍లో కొన్ని సిరీస్‍లు వచ్చాయి. భారీ బడ్జెట్‍తో వచ్చి అలరించాయి. అలా అత్యంత ఖరీదైన ఐదు భారత వెబ్ సిరీస్‍లు ఏవో ఇక్కడ చూడండి.

హీరామండి

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గ్రాండ్ స్కేల్‍లో ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ తెరకెక్కించారు. ఈ సిరీస్‍కు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు బడ్జెట్ అయింది. ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన ఇండియన్ వెబ్ సిరీస్‍గా ఇది ఉంది. ఈ పీరియడ్ డ్రామా వెబ్ సిరీస్ గతేడాది మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. 1940ల బ్యాక్‍డ్రాప్‍లో వేశ్యల మధ్య ఆధిపత్య పోరు స్టోరీతో హీరామండి సిరీస్ రూపొందింది. ఈ సిరీస్‍లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, ఆదితి రావ్ హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మీన్ సేగల్ మెహతా, తారా షా బాదుషా లాంటి స్టార్లు కలిసి నటించారు.

రుద్ర

అజయ్ దేవ్‍గన్ ప్రధాన పాత్ర పోషించిన రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ వెబ్ సిరీస్ కూడా భారీ బడ్జెట్‍తో రూపొందింది. ఈ సిరీస్‍కు ఏకంగా రూ.200కోట్లు ఖర్చైందని అంచనాలు ఉన్నాయి. ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‍లో రాజేశ్ మపుష్కర్ దర్శకత్వం వహించారుయ. రాశీ ఖన్నా కూడా ఓ ముఖ్యమైన రోల్ చేశారు. ఈ రుద్ర వెబ్ సిరీస్ 2022 మార్చిలో డిస్నీ+ హాట్‍స్టార్ (ఇప్పుడు జియోహాట్‍స్టార్) ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది.

సెక్రేడ్ గేమ్స్

సెక్రేడ్ గేమ్స్ వెబ్ సిరీస్ దాదాపు రూ.100కోట్లతో రూపొందింది. రెండు సీజన్లకు కలిపి ఇంత బడ్జెట్ అయింది. సైఫ్ అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‍ రెండు సీజన్లు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే, నీజర్ గాయ్వాన్ దర్శకత్వం వహించిన సెక్రేడ్ గైమ్స్ బాగా సక్సెస్ అయింది.

మేడిన్ హెవెన్

మేడిన్ హెవెన్ వెబ్ సిరీస్ కూడా దాదాపు రూ.100కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ సిరీస్‍లో శోభితా దూళిపాళ్ల, అర్జున్ మాతుర్ ప్రదాన పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు ఈ సిరీస్‍లో రెండు సీజన్లు వచ్చాయి. ఈ సిరీస్‍కు నిత్యా మెహ్రా, జోయా అక్తర్, రీమా కగ్తి, ప్రశాంత్ నాయర్, అలంకిత, నీరజ్ దర్శకులుగా పని చేశారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చింది.

ది ఫ్యామిలీ మ్యాన్

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండు సీజన్లకు కలిపి రూ.60కోట్లు ఖర్చైంది. ప్రస్తుతం మూడో సీజన్ రూపొందుతోంది. దీంతో కలిపి ఈ సిరీస్ బడ్జెట్ రూ.100కోట్లు దాటుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‍లో మనోజ్ బాజ్‍పేయ్ ప్రధాన పాత్ర పోషించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ తొలి రెండు సీజన్లు భారీ వ్యూస్ దక్కించుకున్నాయి. ఈ సిరీస్‍కు రాజ్, డీకే క్రియేటర్లుగా ఉన్నారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024