స్టేజ్‍పై జోష్‍గా డ్యాన్స్ చేసిన సమంత.. మీరు లేకుంటే నేను నథింగ్ అంటూ ఎమోషనల్

Best Web Hosting Provider In India 2024

స్టేజ్‍పై జోష్‍గా డ్యాన్స్ చేసిన సమంత.. మీరు లేకుంటే నేను నథింగ్ అంటూ ఎమోషనల్

సమంత చాలా రోజుల తర్వాత ఫుల్ జోష్‍తో కనిపించారు. స్టేజ్‍పైనే డ్యాన్స్ చేశారు. తాను నిర్మిస్తున్న శుభం ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో సామ్ పాల్గొన్నారు.

స్టేజ్‍పై జోష్‍గా డ్యాన్స్ చేసిన సమంత.. మీరు లేకుంటే నేను నథింగ్ అంటూ ఎమోషనల్

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం సినిమాల్లో యాక్టింగ్‍కు బ్రేక్ ఇచ్చారు. చివరగా 2023లో ఖుషి చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మయోసైటిస్‍కు చికిత్స తీసుకున్నారు. మళ్లీ త్వరలో రీ-ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సమంత నిర్మాతగా మారారు. త్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మొదలుపెట్టి తొలి చిత్రంగా ‘శుభం’ను నిర్మించారు. ఈ హారర్ కామెడీ మూవీ మే 9న విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (మే 4) జరిగింది.

వైజాగ్‍లో జరిగిన శుభం సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు సమంత హాజరయ్యారు. ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేసిన సామ్ ఈ ఈవెంట్‍లో జోష్‍గా కనిపించారు. తన అభిమానులతోనూ మాట్లాడారు.

డ్యాన్స్ చేసిన సమంత

శుభం ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో సమంత డ్యాన్స్ చేశారు. స్టేజ్‍పై స్టెప్‍లతో జోష్ నింపారు. ఈ చిత్రంలోని జన్మజన్మల బంధం అనే పాటకు మూవీ టీమ్‍తో కలిసి డ్యాన్స్ చేశారు సామ్.

అభిమానులు లేకపోతే నథింగ్

అభిమానులు లేకపోతే తాను లేనని సమంత ఎమోషనల్‍గా మాట్లాడారు. మీ డై హార్డ్ అభిమానుల కోసం ఒక్క మాట చెప్పండి అంటూ ఓ ఫ్యాన్ సమంతను అడిగారు. “ఇందాక ఆ ఏవీ చూసేటప్పుడు నేను ఒక విషయం గురించి ఆలోచించా. మీరు లేకుండా నేను నథింగ్. ఇది నా కష్టం కాదు. ఇది నేను కాదు.. మీరు” అని సమంత అన్నారు. అభిమానులకు బోడౌన్ అనేలా అభివాదం చేశారు. ఎప్పుడూ తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు.

వైజాగ్‍లో ఈవెంట్లు జరిగిన తన సినిమాలు బ్లాక్‍బస్టర్స్ అయ్యాయని సమంత గుర్తు చేసుకున్నారు. ఓ బేబీ, మజిలీ, రంగస్థలం సినిమాల ఈవెంట్లు వైజాగ్‍లో జరిగాయని, అవి సూపర్ హిట్ అయ్యాయని, శుభంతో కూడా బ్లాక్‍బస్టర్ ఇస్తారని అనుకుంటున్నానని సామ్ అన్నారు.

అందుకే ప్రొడక్షన్ హౌస్

కొత్త ఆలోచనలతో.. అందరినీ ఆకట్టుకునే కథలు చెప్పాలనునే వారికి అవకాశం ఇచ్చేందుకే తాను త్రాలాల ప్రొడక్షన్ స్థాపించానని సమంత చెప్పారు. ఇదే తన ప్రొడక్షన్ హౌస్ విజన్ అని అన్నారు. తనకు సినిమాలు అంటే ప్రాణమని, నటిగా, నిర్మాతగా ఇదే తన అస్థిత్వమని చెప్పారు.

శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, గరివిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శాలినీ కొండేపూడి ప్రధాన పాత్రలు పోషించారు. సమంత కూడా క్యామియో రోల్‍లో కనిపించనున్నారు. కామెడీ హారర్ చిత్రంగా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ చిత్రం మే 9న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024