నెలలోనే రెండో ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

Best Web Hosting Provider In India 2024

నెలలోనే రెండో ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

నవీన్ చంద్ర నటించిన ‘28 డిగ్రీ సెల్సియస్’ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన నెలలోనే రెండో ఓటీటీలోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలివే..

మరో ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ తెలుగు థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం 28 డిగ్రీ సెల్సియస్ అప్పుడే రెండో ఓటీటీలోకి అడుగుపెట్టింది. మార్చి 4న థియేటర్లలో రిలీజైన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా అనుకున్న రేంజ్‍లో సక్సెస్ కాలేకపోయింది. నవీన్ చంద్ర హీరోగా నటించిన ఈ మూవీకి అనిల్ విశ్వంత్ దర్శకత్వం వహించారు. గత వారమే ఓ ఓటీటీలోకి వచ్చిన ఈ 28 డిగ్రీ సెల్సియస్ చిత్రం ఇప్పుడు మరో ప్లాట్‍ఫామ్‍లో అందుబాటులోకి వచ్చింది.

స్ట్రీమింగ్ వివరాలివే..

28 డిగ్రీ సెల్సియస్ సినిమా నేడు (మే 4) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ చిత్రం ఏప్రిల్ 29న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అడుగుపెట్టింది. మరో ఐదు రోజుల్లోనే నేడు ఈటీవీ విన్‍లోనూ ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది.

శరీరంలో 28 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లేకపోతే హీరోయిన్ ప్రాణానికే డేంజర్ అనే విభిన్నమైన స్టోరీ పాయింట్‍తో ఈ మూవీ తెరకెక్కింది. లవ్ స్టోరీ కూడా ప్రధానంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, ఈటీవీ విన్ ఓటీటీల్లో చూసేయవచ్చు.

28 డిగ్రీ సెల్సియస్ మూవీలో నవీన్ చంద్రకు జోడీగా షాలినీ నటించారు. వైవా హర్ష, ప్రియదర్శి, జయప్రకాశ్, రాజా రవీంద్ర కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని సాయి అభిషేక్ ప్రొడ్యూజ్ చేయగా.. శరవణన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా ముందు క్యూరియాసిటీ పెంచినా.. రిలీజ్ తర్వాత మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది.

28 డిగ్రీ సెల్సియస్ స్టోరీలైన్

కార్తీక్ (నవీన్ చంద్ర), అంజలి (షాలినీ) పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటారు. అయితే అంజలికి ఓ అరుదైన ఆరోగ్య పరిస్థితి ఎదురవుతుంది. ఆమె శరీరంలో ఉష్ణోగ్రత కచ్చితంగా 28 డిగ్రీల సెల్సియస్‍గా ఉండాలని, లేకపోతే రిస్క్ అనే పరిస్థితి వస్తుంది. చికిత్స కోసం అంజలిని జార్జియా తీసుకెళతాడు కార్తీక్. వీరికి ఎలాంటి పరిస్థితులు, ఇబ్బందులు, సవాళ్లు ఎదురయ్యాయి? చివరికి కార్తీక్, అంజలికి ఏమైందనేదే 28 డిగ్రీ సెల్సియస్ స్టోరీలో ప్రధానాంశాలుగా ఉంటాయి.

ఈటీవీ విన్‍లో ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్రం మే 8వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలోకి వస్తోంది. ఈ చిత్రంలో దీపిక పిల్లి హీరోయిన్‍గా నటించారు. నితిన్, భరత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైంది. నెలలోపే మే 8న ఓటీటీలోకి రానుంది.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024