




Best Web Hosting Provider In India 2024

హీరోయిన్ రితూ వర్మ నయా వెబ్ సిరీస్.. వచ్చేది ఈ ఓటీటీలోనే..
హీరోయిన్ రితూ వర్మ.. లీడ్ రోల్‍లో ఓ నయా వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ టైటిల్ తాజాగా ఖరారైంది. ఫస్ట్ లుక్‍ను ఓటీటీ ప్లాట్‍ఫామ్ వెల్లడించింది.
అందంతో పాటు యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌తో టాలీవుడ్ హీరోయిన్ రితూ వర్మ మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు. రితూ హీరోయిన్‍గా నటించిన మజాకా చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అనుకున్న రేంజ్‍లో హిట్ కాలేకపోయింది. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు రితూ వర్మ. ఆ సిరీస్ టైటిల్, ఫస్ట్ లుక్‍ను నేడు రివీల్ చేసింది ఓటీటీ ప్లాట్‍ఫామ్.
టైటిల్ ఇదే
రితూ వర్మ నటిస్తున్న వెబ్ సిరీస్ టైటిల్ నేడు (మే 4) రివీల్ అయింది. ఈ సిరీస్‍కు ‘దేవిక అండ్ డానీ’ అనే టైటిల్ ఖరారైంది. ఈ సిరీస్‍లో సూర్య విశిష్ట, రితూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వచ్చింది. వర్షంలో రితూ వర్మ గొడుగు పట్టుకొని ఉంటే.. పక్క నుంచి సూర్య ప్రేమగా చూస్తున్నట్టు ఈ పోస్టర్ ఉంది.
రితూ వర్మ చేతిలో పుస్తకాలు, టిఫిన్ బాక్స్ ఉండటంతో ఈ సిరీస్‍లో ఆమె టీచర్ క్యారెక్టర్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. రొమాంటిక్ కామెడీ సిరీస్‍గా ‘దేవిక అండ్ డానీ’ ఉండనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ సింపుల్‍గా, క్యూట్‍గా ఉంది.
స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్
‘దేవిక అండ్ డానీ’ వెబ్ సిరీస్ జియోహాట్‍స్టాట్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రానుంది. ఈ ఫస్ట్ లుస్ పోస్టర్‌ను హాట్‍స్టార్ నేడు తీసుకొచ్చింది. “రెండు హృదయాలు. ఒకే భవిష్యత్తు. దేవికగా రితూ వర్మ, డానీగా సూర్య వశిష్ట ఆత్మీయ బంధాన్ని చూడండి. జియోహాట్‍స్టార్‌లో త్వరలో డేవిక అండ్ డానీ వచ్చేస్తుంది” అని జియోహాట్‍స్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
దేవిక అండ్ డానీ సిరీస్‍కు శ్రీకారం ఫేమ్ డైరెక్టర్ కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. శివ కందుకూరి కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. సుబ్బరాజు, మోనిక రెడ్డి, సోనియా సింగ్, చాగంటి సుధాకర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్‍కు జైక్రిష్ సంగీతం అందిస్తున్నారు.
దేవిక అండ్ డానీ స్ట్రీమింగ్ డేట్‍ను జియోహాట్‍స్టార్ ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే టీజర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అప్పుడు డేట్ రివీల్ చేసే ఛాన్స్ ఉంది. తెలుగుతో పాటు ఇతర భాషల డబ్బింగ్‍లోనూ ఈ వెబ్ సిరీస్‍ను తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.
గతంలో మోడ్రన్ లవ్ హైదరాబాద్, మోడ్రన్ లవ్ చెన్నై వెబ్ సిరీస్‍ల్లోనూ రితూ నటించారు. ఇప్పుడు దేవిక అండ్ డానీతో మరోసారి ఓటీటీ సిరీస్ చేస్తున్నారు.
సంబంధిత కథనం