నేను ముస్లిం అమ్మాయినని ఎవరికి తెలియదు, గూగుల్‌లోనే హిందువని రాసుంది: బ్రహ్మముడి స్వప్న ఫేమ్ హమీద ఖటూన్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

నేను ముస్లిం అమ్మాయినని ఎవరికి తెలియదు, గూగుల్‌లోనే హిందువని రాసుంది: బ్రహ్మముడి స్వప్న ఫేమ్ హమీద ఖటూన్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్‌లో స్వప్న పాత్రతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిపుల్ హమీద ఖటూన్. అయితే, తాను ముస్లిం అని, గూగుల్‌లో కూడా తన రిలిజియన్ హిందువు అని రాసి ఉందని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో హమీద ఖటూన్ చెప్పుకొచ్చింది. దీంతో తెలుగు బిగ్ బాస్ బ్యూటి హమీద ఖటూన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నేను ముస్లిం అమ్మాయినని ఎవరికి తెలియదు, గూగుల్‌లోనే హిందువని రాసుంది: బ్రహ్మముడి స్వప్న ఫేమ్ హమీద ఖటూన్ కామెంట్స్

స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అయ్యే బ్రహ్మముడి సీరియల్‌లో స్వప్న పాత్రతో మంచి క్రేజ్ తెచ్చుకుంది బ్యూటిపుల్ హమీద ఖటూన్. బ్రహ్మముడి సీరియల్ ప్రారంభం నుంచి స్వప్నగా పాపులారిటీ తెచ్చుకున్న హమీద ఖటూన్ ఇటీవలే ఆ పాత్ర నుంచి వైదొలిగింది.

బ్రహ్మముడి నుంచి తప్పుకుని

బ్రహ్మముడి సీరియల్ నుంచి తప్పుకున్న హమీద ఖటూన్ ఓటీటీ రియాలిటీ షో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2లో మెంటార్‌గా వ్యవహరించింది. అయితే, తాను ముస్లిం అని, గూగుల్‌లో కూడా హిందువు అనే రాసి ఉంటుందని రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది హమీద ఖటూన్. దీంతో హమీద ఖటూన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

యాంకర్ శివ ఇంటర్వ్యూ

బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన యాంకర్ శివకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన రిలీజియన్ గురించి తెలిపింది హమీద ఖటూన్. “హమీద నీలో చాలా స్పెషల్ టాలెంట్ చూశాను నేను. చర్చికి వెళ్తావ్, మసీద్‌కు వెళ్తావ్. టెంపుల్స్‌కి వెళ్తావ్. అన్నింటికంటే ఎక్కువ ఇంట్రెస్ట్ టెంపుల్స్‌కు వెళ్లడానికి, చీర కట్టుకోడానికి, బొట్టు పెట్టుకోడానికి లేకపోతే విలేజ్ వాతావరణంలో తిరగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావ్. స్పెషల్ ఏంటీ” అని యాంకర్ శివ అడిగాడు.

నేను ఒక ఇండియన్

“ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు చర్చి, టెంపుల్, మసీదు ఈ మూడింటికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే, నా వరకు నేను ఒక ఇండియన్. నేను చిన్నప్పటినుంచి చదివిన స్కూల్ సెపరేట్‌గా ముస్లిం స్కూల్‌లో చదవలేదు” అని హమీద ఖటూన్ తెలిపింది.

సరస్వతి, దుర్గ పూజలు

“మేము చదివిన స్కూల్‌లో చిన్నప్పటి నుంచి పూజలు, సరస్వతి పూజ ఒకటి ఉంటది. చదువు కోసం చేస్తారు. అక్కడ కలకత్తాలో ఉండేది. సరస్వతి పూజ ఒకటి, దుర్గా పూజ ఒకటి. కాళీమాత పూజ ఒకటి . ఇవన్నీ ఆ ఫ్రెండ్స్‌తో కలిసి తిరగడంతో అలవాటు అయింది” అని హమీద ఖటూన్ పేర్కొంది.

కలిసే ఉండేవాళ్లం

“అక్కడ అంత డిఫరెన్స్ లేదు. ఇక్కడ హైదరబాద్‌లో నేను ముస్లిం, హిందువు నువ్ అడుగుతున్నట్లు అంత డిఫరెన్స్ అక్కడ ఉండదు. మేమందరం కలిసే ఉండేవాళ్లం. ఇప్పుడు నేను ఒక ముస్లిం అమ్మాయిని ఇది అది అని నాకు కూడా లేదు” అని హమీద ఖటూన్ తెలిపింది.

గూగుల్‌లోనే రాసి ఉంది

“కానీ, ఇక్కడ చాలామంది షాక్ అవుతారు తెలుసా. చూశావా ఎప్పుడైనా” అని యాంకర్ శివ అన్నాడు. నేను ముస్లిం అమ్మాయి అని ఎవరికి తెలియదు. గూగుల్‌లోనే నా రిలీజియన్ ఏంటంటే హిందువు అని రాసి ఉంది” అని నవ్వుతూ చెప్పింది హమీద ఖటూన్. కాబట్టి తనకు ఆ డిఫరెన్స్ లేదని చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ షోలలో

ఇదిలా ఉంటే, హమీద ఖటూన్ తెలుగు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5తోపాటు బిగ్ బాస్ నాన్‌స్టాప్ ఓటీటీ సీజన్‌ వంటి రెండింట్లో తనదైన ఆటతో అలరించింది బ్రహ్మముడి స్వప్న అకా హమీదా ఖటూన్.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024