




Best Web Hosting Provider In India 2024

వెంకటేష్‌కి పెద్ద హిట్ ఇవ్వాలనే కోరిక ఉంది, పహల్గామ్ అంటే అందమైన అనుభూతి.. సైంధవ్ డైరెక్టర్ శైలేష్ కొలను కామెంట్స్
హిట్ ఫ్రాంచైజీతో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ శైలేష్ కొలను సైంధవ్ మూవీతో మాత్రం ఘోరా పరాజయాన్ని ఎదుర్కొన్నారు. రీసెంట్‌గా హిట్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు శైలేషన్ కొలను విక్టరీ వెంకటేష్‌కి పెద్ద హిట్ ఇవ్వాలనే కోరిక ఉన్నట్లు తెలిపారు. ఆ వివరాల్లోకి వెళితే..!
హిట్ మూవీ ఫ్రాంచైజీతో టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను సైంధవ్ సినిమాతో మాత్రం ఫ్లాప్ ఎదుర్కొన్నారు. అందులో హీరోగా నటించిన విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ఓ డిజాస్టర్ రికార్డ్ అయింది. అయితే, రీసెంట్‌గా హిట్ 3 మూవీతో నానిని డైరెక్ట్ చేశారు దర్శకుడు శైలేష్ కొలను.
మనసులోని మాట
మే 1న విడుదలైన హిట్ 3 మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన డైరెక్టర్ శైలేష్ కొలను హీరో వెంకటేష్‌కు పెద్ద హిట్ ఇవ్వాలనే కోరిక ఉన్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. ఆ ఇంటర్వ్యూ వివరాల్లోకి వెళితే!
నెక్ట్స్ సినిమా హిట్ 3 కంటే వయోలెంట్‌గా ఉంటుందా?
-హిట్ ఫ్రాంచైజీలో ఆ కథకి ఏది అవసరమో ఆ ఎలిమెంట్‌ని చేసుకుంటూ వెళ్లడం నా ఉద్దేశం. హిట్ వన్ కంప్లీట్‌గా ఇన్వెస్టిగేషన్. హిట్2 ఒక సైకో కిల్లర్ చుట్టూ నడిచే కథ. హిట్ 3 ఒక నేషనల్ లెవెల్ క్రైమ్. ప్రతి మూమెంటు విజిల్ కొట్టేలాగా ఉండాలనే ఉద్దేశంతో రాసిన సినిమా ఇది. హిట్ 4 వేరే ఎలిమెంట్స్‌తో ఉండొచ్చు.
వెంకటేష్ గారితో మరో సినిమా చేసే ఆలోచన ఉందా?
–వెంకటేష్ గారితో మరో సినిమా చేసి ఆయనకి ఒక పెద్ద హిట్ ఇవ్వాలనే కోరిక ఉంది. ఆయన నాకు చాలా ఇష్టమైన మనిషి. సినిమా రిలీజ్ అయిన తర్వాత వెంకటేష్ గారు నాతో ప్రతిరోజు ఫోన్‌లో మాట్లాడేవారు. మా అబ్బాయి అంటే వెంకటేష్ గారికి ఇష్టం. మా అబ్బాయి వీడియోలు, ఫోటోలు వెంకటేష్ గారికి సెండ్ చేస్తుంటాను. ఆయన కూడా రిప్లై ఇస్తుంటారు. మా మధ్య సినిమాకి మించిన బాండింగ్ ఏర్పడింది.
మిక్కిజే మేయర్ గురించి ?
-మిక్కీ జే మేయర్ గారు ఈ సినిమాకి పర్‌ఫెక్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశారు. మ్యూజిక్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. సౌండ్ ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.
పెహల్గామ్ ఈ సినిమా షూట్ చేశారు కదా. ఇప్పుడు అక్కడ ఒక విషాదకరమైనటువంటి దుర్ఘటన జరిగింది. ఎలా అనిపిస్తుంది?
–పహల్గాం అంటే మనసులో ఒక అందమైన అనుభూతి. మేము అక్కడ ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే కొన్ని బ్యూటిఫుల్ విజువల్స్‌ని షూట్ చేశాం. ఇలాంటి దారుణమైన ఘటన జరగడం మనసును కలిచివేసింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి.
నాని గారు ప్రొడ్యూసర్, హీరో అవడం మీకు ఎంత మేరకు కలిసి వచ్చింది?
-చాలా కలిసొచ్చింది. ఆయనకి సినిమాకి ఏం కావాలో తెలుసు. వాల్ పోస్టర్ నాకు హోం బ్యానర్ లాంటి ప్రొడక్షన్ హౌజ్.
సంబంధిత కథనం