



Best Web Hosting Provider In India 2024
కోహినూర్ వజ్రం భారత్ తిరిగి వస్తుందా? బ్రిటన్ మంత్రి ఆసక్తికర కామెంట్స్
కోహినూర్ వజ్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశానికి చెందిన ఈ వజ్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. కానీ భారత్ దగ్గర లేదు. దీనిపై తాజాగా బ్రిటన్‌కు చెందిన మంత్రి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
్రిటన్ మహారాణి కిరిటంలో ఉన్న కోహినూర్ వజ్రం భారత్‌కు చెందినదని అందరికీ తెలుసు. కానీ ఇది భారత్ దగ్గర మాత్రం లేదు. దీనిపై ఎప్పటి నుంచో చర్చ ఉంది. చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే దీనిపై తాజాగా బ్రిటన్ మంత్రి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత్ పర్యటనలో భాగంగా దిల్లీకి వచ్చారు లీసా నాండీ. సాంస్కృతిక శాఖకు సంబంధించిన పలు ఒప్పందాల గురించి కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో చర్చలు జరుపుతున్నారు.
కోహినూర్‌ను భారత్‌కు తిరిగి ఇచ్చేస్తారా అనే ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల మంత్రి లీసా నాండీ సమాధానమిచ్చారు. సాంస్కృతిక కళాఖండాలను పంచుకునేందుకు భారత్‌తో బ్రిటన్ చర్చలు జరుపుతోందని అన్నారు. అన్ని సరిగా జరిగితే.. అందరకీ ఆమోదయోగ్యమైన నిర్ణయం రావొచ్చని చెప్పారు.
అయితే లీసా నాండి కోహినూర్ భారత్‌కు తిరిగి ఇవ్వడంపై అర్థంకాని వ్యాఖ్యలు చేశారు. ఇవ్వొచ్చు, ఇవ్వలేం అని నేరుగా చెప్పలేదు. 108 క్యారెట్ల కోహినూర్ రత్నాన్ని మహారాజా దులీప్ సింగ్ 1849లో విక్టోరియా రాణికి ఇచ్చారు. దీనిని 1937లో రాణి తన కిరీటంపై ధరించింది.
యూకే, భారత్ రెండు దేశాల్లోని ప్రజలు వివిధ యుగాలకు చెందిన సాంస్కృతిక కళాఖండాలకు ప్రాప్యత పొందేలా ఎలా కలిసి పనిచేయాలనే దానిపై తాము కొంతకాలంగా చర్చలు జరుపుతున్నామని ఈ సందర్భంగా లీసా తెలిపారు. సృజనాత్మక, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో భారత్‌తో బ్రిటన్‌కు లోతైన భాగస్వామ్యం ఉందన్నారు.
‘సినిమా, ఫ్యాషన్, టీవీ, మ్యూజిక్, గేమింగ్ ఇలా క్రియేటివ్ ఇండస్ట్రీల్లో యూకే, ఇండియా చాలా బాగున్నాయి. మేం ఈ విషయాలలో నిజంగా మంచివాళ్లం. ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తాం. కానీ సహకారం ద్వారా మరింత చేయగలం. కలిసి ఎక్కువ సాధించగలం.’ అని లీసా నాండీ చెప్పారు.
Best Web Hosting Provider In India 2024
Source link