బ్రహ్మముడి మే 5 ఎపిసోడ్: జోకర్‌లా వరసలు మార్చేసిన రామ్- ఎగిరెగిరి పడిన అప్పు- యామినికి షాక్- కావ్య డిజైన్స్ ప్లాన్!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి మే 5 ఎపిసోడ్: జోకర్‌లా వరసలు మార్చేసిన రామ్- ఎగిరెగిరి పడిన అప్పు- యామినికి షాక్- కావ్య డిజైన్స్ ప్లాన్!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి మే 5 ఎపిసోడ్‌లో రామ్ అందరి వరసలు మార్చేస్తాడు. జోకర్‌లా ప్రవర్తించకండని కావ్య చెబుతుంది. కావ్యతో మనసు విప్పి మాట్లాడిన రామ్ ఏడడుగులు నడవాలని ఉందంటాడు. యామిని బందం అబద్ధమనిపిస్తుందని చెబుతాడు. రిసార్టుకు వచ్చిన యామినికి కావ్య షాక్ ఇస్తుంది. కావ్య డిజైన్స్ ప్లాన్ వేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌ మే 5వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రిసార్టుకు శ్వేత ఎంట్రీ ఇస్తుంది. రాజ్ గురించి పెద్ద బ్యాడ్ న్యూస్ ఇంత ఆలస్యంగా చెప్పావ్ ఏంటీ. రాజ్ నాకు ఎంతో హెల్ప్ చేశాడు. రాజ్‌కు గతం గుర్తుకు రావడానికి నేను ఏమైనా చేస్తాను. ఏం చేయను చెప్పు అని శ్వేత అంటుంది.

కల్యాణ్‌ను ఆపిన అప్పు

మీరు కాలేజ్‌లో ఎంత క్లోజో తెలుసుగా మీరు నన్ను రాజ్‌లా అనుకుని నాతో రిపీట్ చేస్తుండాలి. అలా అయినా నాలో తనను తాను గుర్తు చేసుకుంటాడేమో అని నా నమ్మకం అని కల్యాణ్ అంటాడు. షూర్ అని శ్వేత అంటుంది. ఇంతలో రాజ్, కావ్య కారులో వస్తారు. వాళ్లను చూసి అన్నయ్య అంటూ ప్రేమగా దగ్గరికి వెళ్తాడు కల్యాణ్. కానీ, అప్పు చేయి పట్టుకుని ఆపుతుంది.

కల్యాణ్, అప్పులను పరిచయం చేస్తుంది కావ్య. అప్పా.. ఎంత ఉంది.. అప్పు అని రాజ్ అంటాడు. దాంతో అంతా డిసాప్పాయింట్ అవుతారు. జోక్.. జోక్ అని అప్పు మీద జోక్ వేసినట్లు రామ్ చెబుతాడు. నేను మిమ్మల్ని హీరోలా పరిచయం చేద్దామనుకుంటున్నాను. జోకర్‌లా ప్రవర్తించకండి అని కావ్య చెబుతుంది. తను అప్పు నా చెల్లి. తను కల్యాణ్ అని కావ్య అంటుంది.

నేను చెబుతాను. మీ బ్రదర్ కదా అని కావ్యకు కల్యాణ్‌ను బ్రదర్‌ను చేస్తాడు రాజ్. దాంతో అంతా చూసేసరికి.. గెస్ చేద్దామని అని రామ్ అంటాడు. ఆగట్లేదా. మీరు నా ఫ్రెండ్ అని చెప్పి తీసుకొచ్చాను. ఆస్ట్రాలజర్ అని చెప్పలేదు. తను మా చెల్లి హస్బండ్ అని కావ్య క్లారిటీ ఇస్తుంది. మీకే ఇంకా పెళ్లి కాలేదు కదా. మరి అప్పు..డే అని రామ్ అంటాడు. దాంతో ముగ్గురు షాక్ అవుతారు.

రాజ్ వెటకారం

తొందరపడి ఓ కోయిల ముందే కూసింది అని కల్యాణ్ అంటాడు. మ్యారేజ్ అయ్యాక హైట్ తగ్గడం మర్చిపోయినట్లున్నారే అని రాజ్ అంటాడు. మీరు గతం మర్చిపోయాక వెటకారం ఎక్కువైపోయింది బావ అని మనసులో అనుకుంటుంది అప్పు. తన నిక్ నేమ్ కూడా పొట్టినే అన్నయ్య అని కల్యాణ్ అంటాడు. ఏమన్నావ్ అని రామ్ అంటే.. సారీ.. మా అన్నయ్య మీలాగే ఉంటారు. ఫ్లోలో అన్నాను అని కల్యాణ్ అంటాడు.

అంటే, తప్పేముందు నాకు కూడా బ్రదర్స్ ఎవరు లేరు. నువ్ నా తమ్ముడివే అనుకుంటాను అని రామ్ అంటాడు. దాంతో రాజ్‌ను హగ్ చేసుకుంటాడు కల్యాణ్. థ్యాంక్స్ అన్నయ్య అని కల్యాణ్ ఎమోషనల్ అవుతాడు. అది చూసి ఏమైందని రాజ్ అడుగుతాడు. మా అన్నయ్య గుడికి వెళ్లి ఇంకా రాలేదు. రెండేళ్లు అవుతుందని కల్యాణ్ అంటాడు. దాన్ని వెళ్లడం అనరు. వదిలివెళ్లిపోవడం అంటారు. ఎప్పుడోరోజు తిరిగి వస్తాడు. అప్పటివరకు నేనే మీ అన్నయ్య అనుకో అని రాజ్ అంటాడు.

ఇంతలో శ్వేత హాయ్ అంటూ చేయి ఊపుతుంది. మీ పెద్ద చెల్లి నన్ను గుర్తుపట్టి చేయి ఊపుతుందండి అని కావ్యతో రాజ్ అంటే.. తను ఊపింది మీకు కాదు. కల్యాణ్‌కు అని కావ్య చెబుతుంది. హో.. కల్యాణ్ చెల్లి ఆ అని రాజ్ అంటే.. కాదు చెలి అని కావ్య చెబుతుంది. అంటే, చిన్నిల్లా అని రాజ్ అంటాడు. అలాంటిదే అని కావ్య చెబుతుంది. దానికి రాజ్ నోరెళ్లబెట్టి షాక్ అవుతాడు.

గర్ల్ ఫ్రెండ్ అయిపోతుందా

అమ్మ తమ్ముడా.. నీలో ఇన్ని కళలున్నాయా అని రాజ్ అనుకుంటాడు. శ్వేత వచ్చి కల్యాణ్‌తో మాట్లాడుతుంటే అప్పు గొడవ పెట్టుకుంటుంది. దాంతో తమ్ముడు మీ పొట్టి ఎందుకు ఎగిరెగిరి పడుతుంది. అదే మీ అప్పు అని రాజ్ అడుగుతాడు. తను నా ఫ్రెండ్ అన్నయ్య. తను నాతో మాట్లాడటం తనకి ఇష్టం లేదు. క్లోజ్‌గా ఉండి మాట్లాడితే గర్ల్ ఫ్రెండ్ అయిపోతుందా. చిన్నప్పటి నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఆ క్లోజ్‌నెస్‌తో తనకు తన హస్బండ్ నుంచి ప్రాబ్లమ్ ఉందని హెల్ప్ చేశాను అని కల్యాణ్ అంటాడు.

అది ఫ్రెండ్షిపే. దాంట్లో తప్పేముంది అని రాజ్ అంటాడు. కదా. నా ప్లేసులో మీరుంటే ఏం చేస్తారో చెప్పండి అని కల్యాణ్ అంటాడు. నువ్ చెబుతుంటే నా లైఫ్‌లో ఇదే సేమ్ స్టోరీ.. ఎక్కడో.. నాకు కనెక్ట్ అవుతుంది. గతంలో అనుకుంటా అని రాజ్ అంటాడు. ఇంతలో రామ్ అని శ్వేత పొరపాటుగా అంటుంది. నా పేరు ఎలా తెలిసింది అని రామ్ అడుగుతాడు.

అది కవర్ చేసే క్రమంలో రామ్‌ను అప్పు బావ అని పిలుస్తుంది. దానికి రామ్ షాక్ అవుతాడు. కల్యాణ్‌ను తమ్ముడిలా ఫీల్ అవుతున్నారుగా. అలా వరుస కలిపేసింది అని కావ్య కవర్ చేస్తుంది. బాగుంది వరుస.. తమ్ముడు మరదలు బాగుంది అని రామ్ అంటాడు. తర్వాత శ్వేతను చూస్తూ మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో ఏదో కనెక్షన్ ఉన్నట్లు అనిపిస్తుంది అని రామ్ అంటాడు. అయ్యో.. సబ్జెక్ట్ చివరిదాక తీసుకెళ్లి కింద పడేస్తున్నారు అని కావ్య అనుకుంటుంది.

సిగ్గుపడిన రామ్

తర్వాత రామ్‌ను కల్యాణ్ లోపలికి తీసుకెళ్తాడు. ఇక్కడి నుంచి వెళ్లేలోపు రాజ్‌కు గతం గుర్తుకు వచ్చేలా చేద్దాం అని శ్వేత అంటుంది. ఇవే మనముండే రూమ్స్.. నువ్ నేను ఈ రూమ్‌లో అన్నయ్య వదిన ఈ రూమ్‌లో అని కల్యాణ్ అంటాడు. దాంతో రామ్ సిగ్గుపడతాడు. కళావతి గారెతో రూమ్ షేరింగ్ అంటే అని సిగ్గుపడుతుంటాడు రామ్. ఈ రొమాంటిక్ యాంగిల్ తట్టుకోలేకపోతున్నాను అని కావ్య అంటుంది.

తర్వాత అప్పు అలా కాదని, మీరు ఫ్రెండ్స్ కదా, వద్దని అంటుంది. దాంతో రామ్ నిరాశపడతాడు. తర్వాత నేను అన్నయ్య ఒక రూమ్, అప్పు, కావ్య ఒక రూమ్‌లో అని కల్యాణ్ అంటాడు. ఇంతలో రిసార్టుకు యామిని వస్తుంది. రాజ్ నా కళ్లే కప్పి ఇక్కడికి వచ్చేలా చేశావ్. నేనేంటో తెలియక నాతోనే ఛాలెంజ్ చేశావ్. ఈ యామినితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు ఈరోజే రుచి చూపిస్తాను అనుకుంటుంది యామిని.

తర్వాత శ్రుతి తీసుకొచ్చి డిజైన్స్ ఇస్తుంది. మళ్లీ సర్‌కు గతం గుర్తుకు వచ్చి ఆఫీస్‌కు వస్తే మళ్లీ ఎలా ఉంటుందో అని భయపడుతున్నా అని శ్రుతి అంటుంది. దాంతో అప్పు, కావ్య కోప్పడతారు. నీకు నెల రోజులు జీతం కట్ చేస్తున్నా. ఇంకో మాట అంటే రెండు నెలల జీతం కట్ చేస్తున్నా అని కావ్య అంటుంది. తర్వాత రూమ్‌లో వాటర్ రావట్లేదని మన రూమ్‌కు కల్యాణ్ పంపిస్తాడని తమ ప్లాన్ చెబుతుంది అప్పు.

రాజ్ బిల్డప్

కావ్య వాళ్ల రూమ్ దగ్గర రాజ్ పడిగాపులు పడతాడు. కల్యాణ్ వచ్చి పిలుస్తున్న పట్టించుకోడు రాజ్. ఏంట్రా నీ గోల అని కోప్పడి వెనక్కి చూస్తాడు రామ్. ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు కల్యాణ్. రామ్ కవర్ చేస్తాడు. వాటర్ రావట్లేదు. అప్పు రూమ్‌లోకి వెళ్లి స్నానం చేస్తావా అని కల్యాణ్ అంటాడు. దాంతో రాజ్ తెగ సంతోషపడతాడు. కానీ, పైకి బిల్డప్ ఇస్తాడు.

మరి ఇబ్బందిగా ఉంటే వద్దులే అన్నయ్య వచ్చేయ్ అని కల్యాణ్ రివర్స్ అవుతాడు. తర్వాత కావ్య గదిలోకి రామ్ వెళ్తాడు. కన్ఫర్మ్ అన్యయ్యకు వదిన గాలి సోకిందని కల్యాణ్ అనుకుంటాడు. బనియన్, టవల్ మీద కావ్య దగ్గరికి వెళ్తాడు. మీకోసమే వాటర్ కట్ చేశానని కావ్య చెబుతుంది. కరెంట్ కూడా తీసేస్తే రాత్రి ఇక్కడే పడుకోవచ్చు అని రాజ్ అనుకుంటాడు.

మీ మంచితనం, మంచి మనసు అని రామ్ అంటుంటే.. మీరు మంచితనంలో ముంచుతున్నారు అని కావ్య అంటుంది. మీరు నన్నెప్పుడో ముంచేశారు అని రాజ్ అంటాడు. నేను మిమ్మల్ని ముంచేశానా అని కావ్య ఆశ్చర్యపోతుంది. ఇద్దరు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. ఈ మనసెప్పుడో మీ మనసును కోరుకుంది. మీ చేయి పట్టుకుని మీతో ఏడడుగులు వేయమంటుంది అని రామ్ అంటాడు.

బంధమే అబద్ధం

మరి మీ మరదలు యామిని సంగతి ఏం చేస్తారు అని కావ్య అంటుంది. ఏరోజు తనకు బావ అనే ఫీలింగే రాలేదు. తన పిలుపులో ప్యూరిటీ లేదు. అసలు మా బంధమే అబద్ధం అనిపిస్తుంది. మన బంధం అందమైన కావ్యంలా ఉంటుంది. అది మీ మనసునే అడగండి. చెప్పండి, చెప్పండి రామ్ అంటాడు. కానీ, అక్కడ కావ్య కనిపించదు. ఓరి నాయన ఇదంతా నా కలనా. ఎవరు చూడలేదుగా అని కళావతి గారు అంటూ పిలుస్తాడు రామ్.

ఇంతలో కావ్య వచ్చి.. రామ్‌ను చూసి కళ్లు మూసుకుంటుంది. ఇద్దరు సరదాగా వాదించుకుంటారు. తర్వాత మీతో ఓ విషయం మాట్లాడాలి అని రాజ్ అంటాడు. కాసేపటికి యామినితో నువ్ తేలు కుట్టిన దొంగలా మూలకు ఉండి మా అన్యూన్య దాంపత్యాన్ని చూస్తూ ఉండు అని కావ్య అంటుంది. మీ మధ్య అడ్డుగోడల ఎప్పుడు అడ్డొస్తూనే ఉంటాను అని యామిని అంటుంది.

యామిని షాక్

గోడను బద్దలు కొట్టుకుని మా ఆయన నాకోసం వస్తారు అని కావ్య చెబుతుంది. దాంతో యామిని షాక్ అవుతుంది. కావ్య ప్లాన్ చేసి పెట్టిన డిజైన్స్ చూసిన రామ్‌కు కాస్తా గతం గుర్తుకు వచ్చినట్లు అవుతుంది. ఈ డిజైన్స్ అని రామ్ అంటుంటే.. హాయ్ బావ అని యామిని ఎంట్రీ ఇస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అనుమానంగా అడుగుతాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024