ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2025, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఆస్తమా లక్షణాల మధ్య తేడాను ఎలా గుర్తించాలి?

Best Web Hosting Provider In India 2024

ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2025, ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఆస్తమా లక్షణాల మధ్య తేడాను ఎలా గుర్తించాలి?

 

ఆస్తమా ఇప్పుడు ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు, ఆస్తమా లక్షణాలు ఒకేలా ఉంటాయి. దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటివి ఆస్తమా, ఊపిరితిత్తుల క్యాన్సర్ కనిపించే లక్షణాలు. వీటి మధ్య తేడాను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

 
వరల్డ్ ఆస్తమా డే 2025

ఆస్తమా వ్యాధి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వస్తోంది. ఆ వ్యాధిపై అవగాహన పెంచేందుకు ప్రతి ఏడాది ‘వరల్డ్ ఆస్తమా దినోత్సవం’ నిర్వహిస్తారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఉబ్బసం రెండింటిలో దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల రెండు వ్యాధుల లక్షణాల మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం.

 

గ్లోబోకాన్ 2022 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నిర్ధారణ అయిన మొత్తం క్యాన్సర్ కేసులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ సుమారు 12.5 శాతం ఉంది. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ఆస్తమా 300 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తోంది. ఏడాదికి అయిదు లక్షల మంది మరణాలకు కారణమవుతోంది.

కొన్ని సాధారణ లక్షణాలు ఉన్నప్పటికీ, కొన్ని కారకాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఈ రెండు వ్యాధులపై అవగాహన పెంచుకోవచ్చు. ఛాతీ నొప్పి, దగ్గినప్పుడు రక్తం పడడం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంకేతాలు. అలెర్జీలను ప్రేరేపించే కొన్ని చికాకులు, పదార్థాలకు గురికావడం వల్ల ఆస్తమా వస్తుంది.

సిగరెట్లు తాగడం ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచేస్తుంది. ఊపిరితిత్తులలో ప్రారంభమయ్యే అసాధారణ కణితులు పెరగడమే ఈ క్యాన్సర్. అయితే ఉబ్బసం ఊపిరితిత్తుల శ్వాస మార్గాన్ని సంకుచితం చేస్తుంది. ప్రతి ఒక్కరూ ఊపిరితిత్తుల క్యాన్సర్‌ లక్షణాలకు, ఆస్తమా లక్షణాలకు మధ్య తేడాను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ఉబ్బసం

ఎవరికైనా ఉబ్బసం వచ్చినప్పుడు పొడి దగ్గు లేదా తడి దగ్గ రావచ్చు. అలాగే గొంతు దురద, చెవి దురద, ముక్కు దురద వంటివి కనిపిస్తాయి. ఊపిరి పీలుస్తున్నప్పుడు పొట్టలోంచి ఏదో లాగుతున్నట్టు చిన్న శబ్ధం వస్తుంది. కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ కణితులు రోగుల్లో ఇలాంటి లక్షణాలు కనిపించవు.

 

ట్రిగ్గర్ కారకాలు

ఉబ్బసం ఉన్నవారికి బాగా తెలిసిన ట్రిగ్గర్ కారకాలు ఉంటాయి. ఇవి వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్న ధూళి, పుప్పొడి, వాయు కాలుష్యం, వ్యాయామం సాధారణంగా సంబంధం ఉన్న కారకాలు. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ప్రేరేపించే కారకాలకు సంబంధించి ప్రస్తుతం చాలా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి.

రక్తం కనిపించడం

టెలివిజన్ లోనూ, థియేటర్లలోనూ మనం ఎన్నోసార్లు చూసిన భయానక దృశ్యాల్లో ఒకటి, దగ్గు సమయంలో రక్తం కారడం, ముఖ్యంగా చేతి రుమాలు, బట్టలు, బేసిన్ లలో రక్తం కనిపించడం. అయినప్పటికీ, ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులలో 10-20 శాతం మంది మాత్రమే దీనిని అనుభవిస్తారని గమనించడం ముఖ్యం. కానీ ఉబ్బసం ఉన్నవారికి ఇది చాలా అరుదుగా జరుగుతుంది.

అనుబంధ లక్షణాలు

క్యాన్సర్ రోగులు అనుభవించే కొన్ని లక్షణాలు అలసట, అకస్మాత్తుగా బరువు తగ్గడం, తీవ్రమైన ఎముక నొప్పి, మెడ లేదా కాలర్బోన్ ప్రాంతంలో గడ్డలు, వాపులు మరియు తలనొప్పి. బ్రాంకైయిల్ ఆస్తమా ఉన్నవారు సాధారణంగా ఈ లక్షణాలను అనుభవించరు.

పరిష్కరించని లక్షణాలు

ఉబ్బసం సాధారణంగా మందులతో నియంత్రణలో ఉంటుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ఇది వర్తించదు. క్యాన్సర్ నిర్దేశిత చికిత్స ప్రారంభించే వరకు రోగులు ఎటువంటి ఉపశమనాన్ని అనుభవించరు.

 

(గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి ఉంటుంది. సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు నిపుణులను సంప్రదించండి.)

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024