ఆ సుఖం కూడా తెలియాలి.. కూతురు 16వ బ‌ర్త్‌డేకు సెక్స్ టాయ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నా.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

Best Web Hosting Provider In India 2024

ఆ సుఖం కూడా తెలియాలి.. కూతురు 16వ బ‌ర్త్‌డేకు సెక్స్ టాయ్ గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నా.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు

 

బాలీవుడ్ సీనియర్ నటి సంచలన విషయాలు బయటపెట్టారు. తన కూతురుతో శృంగారం సంబంధించిన విషయాలను ఓపెన్ గానే మాట్లాడతానని చెప్పారు. అంతే కాకుండా కుమార్తె పుట్టిన రోజున సెక్స్ టాయ్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నట్లు వెల్లడించారు.

 
కూతురు సియాతో గౌతమి కపూర్
 

బాలీవుడ్ సీరియల్ నటి గౌతమి కపూర్ సంచలన విషయాలు వెల్లడించారు. హిందీ సినిమాలు, సిరీస్ లోనూ నటించిన ఆమె తాజాగా చెప్పిన ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. తన కుమార్తె సియా కపూర్ తో సెక్స్ లాంటి విషయాలను ఓపెన్ గానే మాట్లాడతానని ఆమె పేర్కొన్నారు. అంతే కాకుండా సియా 16వ పుట్టిన రోజు నాడు సెక్స్ టాయ్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకున్నట్లు వెల్లడించారు.

 

సియా షాక్

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో సెక్స్, రొమాన్స్ లాంటి విషయాలను మాట్లాడేందుకు ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ విషయాన్ని నటి గౌతమి కపూర్ తన కూతురితో ఓపెన్ గా చర్చించానని చెప్పారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాన్ని బయటపెట్టారు.

‘‘నా కూతురికి 16 ఏళ్లు వచ్చినప్పుడు ఆమెకు సెక్స్ టాయ్ లేదా వైబ్రేటర్ బహుమతిగా ఇవ్వాలని అనుకున్నా. ఇదే ఆమెకు చెప్పా. వెంటనే ‘అమ్మా, మీకేమైనా మతి పోయిందా?’ అని సియా చెప్పింది. ఎంతమంది తల్లులు వచ్చి తమ కూతుళ్లను ఇలా అడుగుతారో ఆలోచించమన్నా. నేను నీకు అలాంటి బహుమతులు ఎందుకు ఇవ్వకూడదు? ప్రయోగాలు ఎందుకు చేయకూడదు?’’ అని ప్రశ్నించానని గౌతమి తెలిపారు.

ఆ సుఖం కోసం

‘‘మా అమ్మ నాతో చేయని పనిని నా కూతురితో చేయాలనుకుంటున్నా. ఆమె ప్రతిదీ అనుభవించాలని నేను కోరుకుంటున్నా. చాలా మంది స్త్రీలు జీవితంలోని సుఖాలను అనుభవించకుండానే గడుపుతారు. ఆ పరిస్థితి ఎందుకు? ఈ రోజు నా కుమార్తెకు 19 ఏళ్లు. నా ఆలోచనను ఆమె ప్రశంసిస్తుంది. అందుకు నన్ను గౌరవిస్తుంది’’ అని గౌతమి వెల్లడించారు.

 

రామ్ కపూర్ తో డేటింగ్

ఘర్ ఏక్ మందిర్ అనే టెలివిజన్ షో సెట్స్ లో గౌతమి తన భర్త, నటుడు రామ్ కపూర్ ను కలుసుకున్నారు. రెండేళ్ల పాటు డేటింగ్ చేసిన ఈ జంట 2003లో పెళ్లి చేసుకుంది. ఇది ఆమెకు రెండో పెళ్లి. వీళ్లకు ప్రస్తుతం సియా, అక్స్ కపూర్ అనే ఇద్దరు పిల్లలున్నారు. వెకేషన్స్ లో కలిసి దిగిన ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

గౌతమి చివరిసారిగా 2024లో విడుదలైన గ్యారా గ్యారా అనే వెబ్ సిరీస్ లో నటించింది. కృతికా కమ్రా, రాఘవ్ జుయాల్, ధైర్య కర్వా, ఆకాష్ దీక్షిత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ప్రముఖ కొరియన్ డ్రామా సిగ్నల్ కు రీమేక్. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో చూడొచ్చు.