Best Web Hosting Provider In India 2024

తెలుగులోకి వచ్చిన తమిళ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ థ్రిల్లర్ మూవీ -ఫ్రీ స్ట్రీమింగ్ -విలన్‌గా సిద్ధు జొన్నలగడ్డ
నేషనల్ అవార్డును గెలుచుకున్న తమిళ మూవీ వల్లినం తెలుగులోకి వచ్చింది. కఠినం పేరుతో రిలీజైన ఈ మూవీ యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. కఠినం మూవీలో సిద్ధు జొన్నలగడ్డ విలన్‌గా నటించడం గమనార్హం.
సిద్ధు జొన్నలగడ్డ విలన్‌గా నటించిన తమిళ మూవీ వల్లినం తెలుగులోకి వచ్చింది. కఠినం పేరుతో డబ్ అయిన ఈ మూవీ థియేటర్…ఓటీటీలో కాకుండా నేరుగా యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ మూవీలో నకుల్, మృదులా భాస్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. తమిళ హీరో ఆది పినిశెట్టి గెస్ట్ పాత్రలో కనిపించాడు.
విలన్‌గా…
కెరీర్ ఆరంభంలో నటుడిగా నిలదొక్కుకునే రోజుల్లో సిద్ధు జొన్నలగడ్డ నటించిన మూవీ ఇది. వల్లినం మూవీలో సిద్ధార్థ్ జొన్నలనగడ్డ పేరుతో నటించాడు. స్పోర్ట్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ విలన్‌గా నటించడం గమనార్హం. వంశీ అనే క్రికెట్ టీమ్ కెప్టెన్ పాత్రలో కనిపించాడు.
నేషనల్ అవార్డ్…
కఠినం మూవీకి వైశాలి ఫేమ్ అరివజగన్ దర్శకత్వం వహించాడు. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. బెస్ట్ ఎడిటింగ్ విభాగంలో కఠినం మూవీ నేషనల్ అవార్డును అందుకున్నది. తొలుత ఈ మూవీలో బిగ్‌బాస్ ఫేమ్, తెలుగు అమ్మాయి బిందుమాధవి హీరోయిన్‌గా ఎంపికైంది. కొన్నాళ్లు షూటింగ్‌లో పాల్గొన్నది. కానీ ఆమె యాక్టింగ్ నచ్చకపోవడంతో బిందుమాధవిని పక్కనపెట్టిన డైరెక్టర్.. ఆమె స్థానంలో మృదులా భాస్కర్‌కు అవకాశం ఇచ్చాడు.
కఠినం కథ ఇదే…
కృష్ణ, శివ చిన్ననాటి స్నేహితులు, మంచి బాస్కెట్‌బాల్ ప్లేయర్స్. నేషనల్‌కు ఆడాలని కలలు కంటుంటారు. గేమ్ ప్రాక్టీస్ చేస్తుండగా….కృష్ణ కొట్టిన షాట్ శివ గుండెలపై తగులుతుంది. హార్ట్ ఎటాక్‌తో శివ చనిపోతాడు. స్నేహితుడి మరణంతో బాస్కెట్‌బాల్‌కు దూరమవ్వాలని కృష్ణ నిర్ణయించుకుంటాడు. కాలేజీ మారిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని అనుకుంటాడు.
కానీ వంశీ అనే క్రికెటర్ కారణంగా కృష్ణ మళ్లీ బాస్కెట్‌బాల్ గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాల్సివస్తుంది. ఆ తర్వాత ఏమైంది? నేషనల్స్‌కు ఆడాలనే కృష్ణ కల తీరిందా? కృష్ణకు సపోర్ట్‌గా నిలిచిన మీరా ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
కమర్షియల్ సక్సెస్…
కమర్షియల్‌గా వల్లినం మూవీ తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలోని ఓ పాటను శింబు ఆలపించారు. అరివజగన్ ఫస్ట్ మూవీ వైశాలిలో ఆది పినిశెట్టి హీరోగా నటించాడు. ఆ అనుబంధంతోనే వల్లినం మూవీలో ఆది గెస్ట్ రోల్ చేశాడు. ఈ మూవీలో ఆది పినిశెట్టితో పాటు ఆర్‌జే బాలాజీ కూడా ఓ గెస్ట్ రోల్‌లో కనిపించడం గమనార్హం.