కార్తీక దీపం మే 6 టుడే ఎపిసోడ్: గౌతమ్‍ను రెచ్చగొట్టిన జ్యోత్స్న.. దీపకు రెండు కత్తిపోట్లు.. కార్తీక్ కన్నీరు

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం మే 6 టుడే ఎపిసోడ్: గౌతమ్‍ను రెచ్చగొట్టిన జ్యోత్స్న.. దీపకు రెండు కత్తిపోట్లు.. కార్తీక్ కన్నీరు

 

కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 6: దీప మన పెళ్లి జరగనివ్వదు అంటూ గౌతమ్‍ను రెచ్చగొడుతుంది జ్యోత్స్న. అతడిలో కోపాన్ని నూరిపోస్తుంది. జ్యోను ఇరికిస్తుంది పారిజాతం. దీపపై హత్యాయత్నం జరుగుతుంది. కత్తిపోట్లు దిగుతాయి. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
కార్తీక దీపం మే 6 టుడే ఎపిసోడ్: గౌతమ్‍ను రెచ్చగొట్టిన జ్యోత్స్న.. దీపకు రెండు కత్తిపోట్లు.. కార్తీక్ కన్నీరు
 

కార్తీక దీపం 2 నేటి (మే 6) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. గౌతమ్‍ను జ్యోత్స్న కలుస్తుంది. దీప మీ డాడీని షూట్ చేయడానికి.. మన పెళ్లి ఆగిపోవడానికి సంబంధం ఏంటి అని జ్యోను గౌతమ్ అడుగుతాడు. నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. లవ్ అంటే లవ్ అని గౌతమ్ అంటాడు. నువ్వు చెప్పావనే కదా దీపకు వార్నింగ్ ఇచ్చానని అంటాడు. అందుకే కదా జైలుకు వెళ్లిందని చెబుతాడు. దీప ఇప్పుడు బయట ఉంది కదా అని జ్యో అంటే.. అది కేవలం బెయిల్, మళ్లీ లోపలికి వెళుతుందని గౌతమ్ అంటాడు. అసలైన నేరస్థులను పోలీసులు పట్టుకుంటే అని జ్యో అనడంతో అతడు షాక్ అవుతాడు.

 

అసలైన నేరస్తురాలిని నేనే కదా..

అసలైన నేరస్తులు ఏంటి.. మీ డాడీని షూట్ చేసింది దీప అని చెప్పావ్ కదా అని గౌతమ్ ప్రశ్నిస్తాడు. మీ నాన్న బాడీలో దిగిన బుల్లెట్ వేరే గన్ నుంచి వచ్చిందా అని అడుగుతాడు. దీంతో జ్యోత్స్న కవర్ చేసుకోవడం మొదలుపెడుతుంది. మా బావ వాళ్ల భార్యను సేవ్ చేసేందుకు ఆధారాలను మార్చేశాడు అని జ్యో అంటుంది. మరి నువ్వెందుకలా అన్నావని గౌతమ్ ప్రశ్నిస్తాడు. “ఎందుకంటే అసలైన నేరస్తురాలిని నేనే కాబట్టి. దీపను ఏదో ఒకటి చేయకపోతే బావను ఆపలేను. నేనే అని ప్రూవ్ అయితే అక్కడితో నా జీవితం అయిపోయినట్టే” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

రెచ్చగొట్టిన జ్యో

ఎవరినో ఒకరిని నేరస్తుడిగా కార్తీక్ తీసుకొస్తాడని జ్యోత్స్న అంటుంది. కార్తీక్ నన్ను కూడా అనుమానించాడని గౌతమ్ చెబుతాడు. దీప పెళ్లి ఆపాలనుకుంది.. కేసులో కార్తీక్ నిన్ను ఇరికించాలనుకున్నాడని జ్యో అంటుంది. దీప ఉంటే మన పెళ్లి జరగనివ్వదని గౌతమ్‍ను జ్యోత్స్న రెచ్చగొడుతుంది.

డీఎన్‍ఏ టెస్టు చేయిస్తే..

మరోసారి మన పెళ్లి ఆపేందుకు చూస్తే దీప భూమి మీదే ఉండదని గౌతమ్ అంటాడు. “అదేదో ముందే చెయ్.. దీప ఉండగా మన పెళ్లి జరగదు. నిన్నే ఎక్కువగా టార్గెట్ చేస్తుంది” అని జ్యోత్స్న అంటుంది. ఈసారి ఓ అమ్మాయిని తీసుకొచ్చి డీఎన్‍ఏ టెస్టు చేయించి.. ఆ బిడ్డకు తండ్రి నువ్వే అని దీప ప్రూవ్ చేస్తుందేమో అని గౌతమ్‍ను భయపెడుతుంది జ్యోత్స్న. కోర్టులో రిపోర్టులు మార్చగల తెలివితేటలు ఉన్న వాళ్లు డీఎన్‍ఏ రిపోర్టులు మార్చలేరా అని అంటుంది. పెళ్లి ఆగిపోతుంది కదా.. అంత వరకు అవసరమా అని చెబుతుంది. అందుకే పెళ్లి క్యాన్సిల్ చేయడం బెటర్ అంటున్నానని చెబుతుంది. వందల కోట్ల ఆస్తి ఎలా వదులుకోవడం అని మనసులో అనుకుంటాడు.

 

దీపను చంపేస్తానన్న గౌతమ్

దీప లేకుంటే నీకు ఓకేనా అని గౌతమ్ అంటాడు. దీప ఉంటేనే కదా ప్రాబ్లం.. లేకపోత నీకు ఓకేనా అని మళ్లీ అడుగుతాడు. వార్నింగ్ ఇస్తావా అని జ్యోత్స్న అడిగితే.. మనిషినే లేకుండా చేస్తానని గౌతమ్ అంటాడు. అమ్మో నాకు అలాంటి అంటే భయమని నాటకాలు ఆడుతుంది జ్యో. చంపడాలు అవీ అంటే.. అంటూ నసిగినట్టు నటిస్తుంది. ఇద్దరి పేరు బయటికి రాకుండా తాను పని కానిచ్చేస్తానని గౌతమ్ అంటాడు. భయంగా ఉంది గౌతమ్ అని జ్యో అంటే.. నీకేం తెలియనట్టు ఉండు అని అంటాడు.

నాకు తెలుసురా బచ్చా..

దీప లేదు అని తెలిసిన తర్వాత మన పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందామని గౌతమ్ అంటాడు. ఎవరిని.. ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నాకు తెలుసురా బచ్చా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వు ఇంటికి వెళ్లు.. నేను ఒకరిని కలవాలి అని గౌతమ్ అంటాడు. మన దారికి ఎవరూ అడ్డురాకపోతే ఓకే.. అడ్డు వస్తే ఫినిష్ చేయాలి అని గౌతమ్ అంటాడు. త్వరగానే గుడ్‍న్యూస్ వింటావని చెప్పి వెళ్లిపోతాడు. సారీ దీప.. నీ చావును పంపింపా.. తిరిగి సంతాప సభలో కలుద్దామని జ్యో అనుకుంటుంది.

 

చీర నేను చుట్టనా.. దీపతో కార్తీక్

శౌర్య కొత్త డ్రెస్ వేసుకొచ్చి ఎలా ఉన్నానో చూడు అని దీపను అడుగుతుంది. దీప మురిసిపోతుంది. దీప బయటికి రావాలని మొక్కుకున్నామని, మొక్కు తీర్చుకునేందుకు గుడికి వెళదామని కాంచన అంటుంది. ముందు మీరు వెళ్లండి అని కార్తీక్ చెబుతాడు. కాంచన, అనసూయ, శౌర్య గుడికి వెళతారు. తాను బెయిల్‍పై వచ్చానని, కేసు ఇంకా ఉన్నా ఇప్పుడు మొక్కులు తీర్చుకుంటే చూసే వాళ్లు ఏమనుకుంటారని దీప అంటుంది. మనం నిజాయితీగా ఉంటే నమ్మిన వాళ్లు మనవాళ్లు అని సర్దిచెబుతాడు కార్తీక్.

లోపల మంచం మీద చీర ఉంది మార్చుకురా అని కార్తీక్ అంటాడు. ఇలాగే ఉంటే నేను నీకు చీర చుట్టేస్తా అని కార్తీక్. మీకు చీర చుట్టడం కూడా వచ్చా అని దీప అంటే.. ఓసారి ట్రై చేయనా అని కార్తీక్ అంటాడు. వద్దు అని చెప్పి వెళుతుంది దీప. నవ్వితే బాగుంటావని ఎన్నిసార్లు చెప్పిన.. దీపలా ఒకే ఎక్స్‌ప్రెషన్‍తో ఉంటుందని కార్తీక్ మనసులో అనుకుంటాడు.

జ్యోత్స్నను ఇరికించి పారిజాతం

జోత్స్న రెస్టారెంట్‍కు రాలేదని శివన్నారాయణ తెలుస్తుంది. సుమిత్రను అడిగిదే.. రెస్టారెంట్‍కే వెళ్లిందని అనుకున్నానని చెబుతుంది. ఇంతలో ఇంటికి వస్తుంది జ్యోత్స్న. ఈరోజు రెస్టారెంట్‍కు వెళ్లమని చెప్పా కదా.. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్లావని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. దీంతో గౌతమ్ దగ్గరికి పోయిందని జ్యోత్స్నను ఇరికిస్తుంది పారిజాతం. గ్రానీకి ఈ విషయం ఎలా తెలుసు.. ఫాలో అయిందా అని జ్యో అనుకుంటుంది.

 

జ్యోత్స్న తికమక

అవునా.. గౌతమ్‍ను కలవడానికి వెళ్లావా అని సుమిత్ర సంతోషిస్తుంది. ఎందుకు కలిశావని అడుగుతుంది. ఏన్నాడు అని శివన్నారాయణ అంటే.. పెళ్లికి రెడీ అని ఉంటాడు అని పారిజాతం అంటుంది. ఫోన్ చేసి మరీ వెళ్లిందంటే జ్యోత్స్నకు కూడా ఇష్టమే అని జ్యోను మరింత ఇరుకున పెట్టేస్తుంది. గ్రానీ ఎందుకు ఇలా మాట్లాడుతోందని జ్యో ఆలోచిస్తుంది. “వద్దు అంటే దీప మాట నిజం అనుకుంటాడు.. ఒకే అంటే ముహూర్తాలు అంటారు.. ఇప్పుడు నేనేం చెప్పాలి” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. తికమక పడుతుంది. గౌతమ్‍కు కాల్ చేసి మాట్లాడాలని పారిజాతం తొందరపెడుతుంది.

ఇది చచ్చింది నా చేతిలో..

నీకు గౌతమ్ ఓకే అనుకుంటే అతడితోనే పెళ్లి జరుగుతుంది.. లేకపోతే వేరే సంబంధం చూస్తానని శివన్నారాయణ అంటాడు. వేరే సంబంధానికి జ్యో అవకాశం ఇవ్వదని, గౌతమ్‍ను ఓకే చేసేసినట్టే అని పారు చెబుతుంది. నాకు కొంచెం టైమ్ కావాలని జ్యో అడుగుతుంది. డాడీ ఇంకా కోలుకోలేదని అంటుంది. అంటే.. జ్యో పెళ్లికి ఓకే చెప్పేసినట్టే అని పారు అంటుంది. ఈ తల తిక్కల గ్రానీకి ఈరోజు ఏమైంది అని జ్యో అనుకుంటుంది. నీ పెళ్లి చూసేందుకే నేను త్వరగా కోలుకున్నానని దశరథ్ అంటాడు. దీంతో మౌనంగా ఉంటుంది జ్యో.

 

అసలు నిజమేంటో రాబడతా..

ఏం చెప్పవేంటే అని సుమిత్ర అడుగుతుంది. పెద్దవాళ్లతో మాట్లాడి మీరు ముహూర్తాలు పెట్టించేయండి అని పారిజాతం అంటుంది. ఏదో మండపంలో మూడుముళ్లు వేయిద్దామని చెబుతుంది. గ్రానీ అంటూ చిరాకుగా అంటుంది జ్యో. “ఇది చచ్చింది నా చేతిలో” అని మనసులో అనుకుంటుంది. మంచి రోజు చూసి వాళ్లతో మాట్లాడదామని శివన్నారాయణ చెబుతాడు. ఏంటావ్ అని అడుగుతాడు. భలే ఇరికించావ్ గ్రానీ అని అనుకుంటుంది జ్యో. ఎట్టకేలకు మీ ఇష్టం అని చెప్పేస్తుంది. పారిజాతం వైపు కోపంగా చూస్తుంది. “జ్యోత్స్న.. నువ్వు నా చేతికి దొరికావే. అసలు నిజమేంటో రాబడతా” అని మనసులో అనుకుంటుంది పారిజాతం.

“నేను ఒప్పుకున్నా నా పెళ్లి బావతోనే జరుగుతుంది.. దీప చావుకు ముహూర్తం పెట్టా. శుభవార్త వినేందుకు సిద్ధంగా ఉండండి” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.

దీపకు మల్లెపూలు పెట్టిన కార్తీక్

గుడికి వెళ్లేందుకు దీప రెడీ అవుతుంటే గదిలోకి వస్తాడు కార్తీక్. మల్లెపూలు తెచ్చి ఇస్తాడు. నేను పెట్టుకుంటానని దీప అంటుంది. తిరగవమ్మా అని కార్తీక్ అంటాడు. దీప జడకు ప్రేమగా మల్లెపూలు పెడతాడు.

ఇంట్లో వచ్చిన ఆగంతకుడు

ఇంతలో ఓ ఆగంతకుడు కార్తీక్ ఇంట్లోకి వచ్చేందుకు గోడ దూకుతాడు. ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ పెట్టుకొని ఉంటాడు. అయితే, అలా వచ్చింది గౌతమే అని అర్థమవుతోంది. చేతిలో కత్తిపట్టుకొని లోపలికి వస్తాడు. చూడు ఎంత అందంగా ఉన్నావో అని దీపను కార్తీక్ పొగిస్తాడు. శౌర్య ఫోన్ చేస్తోందని కార్తీక్ అంటాడు. మీరు బయట ఉండండి.. తలుపులు వేసి వచ్చేస్తానని దీప చెబుతుంది.

 

రెండు కత్తిపోట్లు.. అల్లాడిన దీప

కార్తీక్ బయట ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. లోపల తలుపులు వేస్తూ ఉంటుంది. ఇంతలో వెనుక నుంచి వచ్చి దీప నీరు మూసేస్తాడు ముసుగులో వచ్చిన ఆ వ్యక్తి. దీప వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుంది. ఇంతలో కత్తి బయటికి తీసి దీపను అతడు పొడిచేస్తాడు. రక్తం కారిపోతుంది. మళ్లీ ఇంకోసారి పొడుస్తాడు. దీప అల్లాడిపోతుంది. దీప త్వరగా రా అని కార్తీక్ అరుస్తాడు.

రక్తపు మడుగులో దీప.. ఏడ్చేసిన కార్తీక్

కార్తీక్ అరుస్తుండటంతో.. అతడు పారిపోతాడు. కత్తిపోట్లతో దీప అల్లాడుతుంటుంది. కార్తీక్ బాబు అని చాలా కష్టంగా అంటుంది. దీప తలుపు వేసి రావడానికి ఎంత సేపు ఏంటీ అని కార్తీక్ మరోసారి అంటాడు. దీప ఎంతకీ రాకపోవటంతో ఇంట్లోకి వెళతాడు. తలుపేసే ఉంది బెడ్‍రూమ్‍లో ఉందేమో అని కార్తీక్ అనుకుంటాడు. ఇంతలో అక్కడే ఉన్న రక్తాన్ని చూస్తాడు. ఈ రక్తం ఎక్కడిది అని కంగారు పడతాడు. కత్తిపోట్లతో ఉన్న దీపను చూసి.. కార్తీక్ ఏడుస్తాడు. దీప అని బాధగా ఉంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 6) ఎపిసోడ్ ముగిసింది.

 

Best Web Hosting Provider In India 2024