



Best Web Hosting Provider In India 2024
ఉగ్రవాదంపై భారత్ పోరాటానికి రష్యా మద్దతు.. ప్రధాని మోదీతో పుతిన్ ఫోన్ కాల్
కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చాలా దేశాలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు.
ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో అమాయక పౌరులు మృతి చెందడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన పుతిన్ ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి రష్యా పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. అదే సమయంలో ఈ పిరికిపంద దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను కఠినంగా శిక్షించాలని పుతిన్ స్పష్టం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడిని పుతిన్ తీవ్రంగా ఖండించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ఆయన ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని చెప్పారు.
‘పహల్గామ్ దాడిపై చర్చలతో పాటు భారత్-రష్యా ప్రత్యేక బంధాన్ని, అద్భుతమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరువురు నేతలు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.’ అని జైస్వాల్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా రష్యా విక్టరీ డే 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది చివర్‌లో భారత్‌లో జరిగే వార్షిక సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు.
ఉగ్రదాడి విషయానికొస్తే.. గత నెల ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగింది. ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌కు పూర్తి మద్దతు ఇచ్చారు. ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి భారత్- పాక్ మధ్య సంబంధాలు క్రమంగా క్షీణించాయి. ఈ దాడి తర్వాత పాకిస్థాన్‌పై భారత్ రాజకీయ, దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. అంతర్జాతీయ స్థాయిలోనూ భారత్‌కు మద్దతు లభిస్తోంది.
Best Web Hosting Provider In India 2024
Source link