




Best Web Hosting Provider In India 2024

త్వరలో ముగియనున్న గడువు.. డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నారా.. ఇంకా 10 రోజులే ఛాన్స్
ప్రభుత్వం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి దరఖాస్తు గడువు త్వరలో ముగియనుంది. మే 15 వరకు అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇప్పటికే లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. ఇంకా అప్లై చేయని వారు తొందరగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మెగా డీఎస్సీ-2025కి దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని రోజుల్లో ముగియనుంది. మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 6 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 16 వేల 347 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు మెరుగ్గా సన్నద్ధమయ్యేందుకు 2024 నవంబరులోనే డీఎస్సీ సిలబస్‌ను అధికారికంగా ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు.
ఎస్సీ ఉపవర్గీకరణ అమలు..
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ గతంలోనే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇటు ఉపాధ్యాయుల ఎంపికలో సమానత్వం, ప్రాతినిధ్యం కోసం ఎస్సీ ఉపవర్గీకరణ అమలు చేస్తున్నారు. క్రీడాకారుల్ని ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ కోటాను 3 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ విడుదల తేదీ- 20 ఏప్రిల్ 2025
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ- 20 ఏప్రిల్ 2025
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ- 15 మే 2025
హాల్ టికెట్ల డౌన్లోడ్- 30 మే 2025 నుండి
పరీక్ష తేదీలు- 6 జూన్ 2025 నుండి 6 జూలై 2025 వరకు
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు- 16,768 (టీచింగ్, నాన్-టీచింగ్)
స్కూల్ అసిస్టెంట్స్: 7,725
సెకండరీ గ్రేడ్ టీచర్స్: 6,371
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్: 1,781
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్: 286
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్: 132
ప్రిన్సిపాల్స్: 52
స్పోర్ట్స్ టీచర్స్: 421
అర్హతలు..
పోస్టును బట్టి అర్హతలు మారుతూ ఉంటాయి.
స్కూల్ అసిస్టెంట్స్- సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్, బీఈడీ/బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) ఉత్తీర్ణత ఉండాలి.
సెకండరీ గ్రేడ్ టీచర్స్ – ఇంటర్మీడియట్, డీఈడీ/డీఎల్ఈడీ లేదా గ్రాడ్యుయేషన్ బీఈడీ. టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణత తప్పనిసరి.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ – సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ, బీఈడీ.
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ – ఇంటర్మీడియట్, యూజీడీపీఈడీ/బీపీఈడీ/ఎంపీఈడీ.
సంబంధిత కథనం
టాపిక్