ఓటీటీలోకి వెరైటీ టైటిల్‌తో వ‌చ్చిన మ‌ల‌యాళం రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ – ఐమ్‌డీబీలో టాప్ రేటింగ్

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వెరైటీ టైటిల్‌తో వ‌చ్చిన మ‌ల‌యాళం రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ – ఐమ్‌డీబీలో టాప్ రేటింగ్

Nelki Naresh HT Telugu

మ‌ల‌యాళం రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ప‌ర‌న్ను ప‌ర‌న్నుప‌ర‌న్ను చెల్లన్ ఓటీటీలోకి వ‌స్తోంది. మే 16 నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 8.3 రేటింగ్‌ను ద‌క్కించుకున్న‌ది.

మలయాళం ఓటీటీ

మ‌ల‌యాళం మూవీ ప‌ర‌న్ను ప‌ర‌న్నుప‌ర‌న్ను చెల్లన్ ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో మే 16 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మ‌నోర‌మా మ్యాక్స్ అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ మ‌ల‌యాళం మూవీలో సాజిన్ చెరుకాయిల్‌, ఉన్ని లాలు, స‌మృద్ధి తార కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జిష్ణు హ‌రీంద్ర వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఐఎమ్‌డీబీలో…

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ప‌ర‌న్ను ప‌ర‌న్నుప‌ర‌న్ను చెల్లన్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో ప‌దికిగాను 8.3 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

లేచిపోవాల‌ని ప్లాన్‌…

ఆ యువ జంట ప్రేమ‌కు కుల‌మ‌తాలు ఎలా అడ్డుగోడ‌లుగా నిలిచాయ‌నే కాన్సెప్ట్‌తో ప‌ర‌న్ను ప‌ర‌న్ను ప‌ర‌న్ను చెల్లం మూవీని ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించాడు. జిజు, సంధ్య‌ప్రేమించుకుంటారు. సంధ్య ఉన్న‌త కులానికి చెందిన అమ్మాయి కావ‌డంతో ఆమె కుటుంబ‌స‌భ్యులు వారి ప్రేమ‌కు అడ్డు చెబుతారు. సంధ్య బంధువు స‌తీష్‌…జిజును కొట్టి అవ‌మానిస్తాడు.

ఆ అవ‌మానం భ‌రించ‌లేక‌పోయిన జిజు…ఎలాగైనా సంధ్య‌ను లేవ‌దీసుకుపోయి పెళ్లిచేసుకోవాల‌ని ఫిక్స‌వుతాడు. సంధ్య కుటుంబంలో ప్ర‌తి ఎటా జ‌రిగే ఓ ఉత్స‌వాన్ని అడ్డుపెట్టుకొని త‌న ప్లాన్‌ను అమ‌లు ప‌ర‌చాల‌ని అనుకుంటాడు. జిజు ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? జిజు ప్లాన్ గురించి తెలిసిన స‌తీష్ ఏం చేశాడు? జిజు, సంధ్య‌ల‌ను అడ్డుకున్నాడా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సూప‌ర్ హిట్ సాంగ్ ఆధారంగా…

ప‌ర‌న్ను ప‌ర‌న్నుప‌ర‌న్ను చెల్లన్ స్టోరీ రొటీన్ అయినా విజ‌య‌రాఘ‌వ‌న్ పాత్ర‌కు సంబంధించి క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్‌కు మాత్రం ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకుంటుంది. ఓ మ‌ల‌యాళం సూప‌ర్ హిట్ సాంగ్ ఆధారంగా ఈ మూవీకి టైటిల్‌ను పెట్టారు డైరెక్ట‌ర్‌. ఈ మూవీలో పొర‌ట్టు న‌డ‌కం అనే కేర‌ళ ట్రెడిష‌న‌ల్ ఆర్ట్ ఫామ్ గురించి ద‌ర్శ‌కుడు చూపించాడు. ఈ మూవీకి నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ మ‌ధు అంబాట్ సినిమాటోగ్ర‌ఫీ స‌మ‌కూర్చారు.

మార‌న మాస్‌…

ప‌ర‌న్ను ప‌ర‌న్నుప‌ర‌న్ను చెల్లన్ తో పాటు మే 15న బాసిస్ జోసెఫ్ హీరోగా న‌టించిన మార‌న మాస్ మూవీ కూడా రాబోతోంది. ఈ యాక్ష‌న్ కామెడీ మూవీ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024