ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం.. ఉత్కంఠగా ట్విస్టులతో సాగే సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ థ్రిల్లర్ చిత్రం.. ఉత్కంఠగా ట్విస్టులతో సాగే సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

ఉల్ఫ్ మ్యాన్ సినిమా రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలలకు ఓటీటీలో సాధారణ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. భయపెట్టేలా ఉత్కంఠభరితంగా ఈచిత్రం సాగుతుంది.

 
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ చిత్రం.. ఉత్కంఠగా ట్విస్టులతో సాగే సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
 

క్రిస్టఫర్ అబాట్ లీడ్ రోల్ చేసిన ఉల్ఫ్ మ్యాన్ సినిమా ఈ ఏడాది జనవరి 17వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ హారర్ థ్రిల్లర్ చిత్రానికి లీ వానెల్ దర్శకత్వ వహించారు. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లనే సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇండియాలో ఉల్ఫ్ మ్యాన్ చిత్రం రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు రెడీ అయింది.

 

స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‍ఫామ్

ఉల్ఫ్ మ్యాన్ సినిమా మే 17వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజైన నాలుగు నెలలకు రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ మూవీ ఇప్పటికే రెంటల్ విధానంలో కొన్ని ఓటీటీల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఎలాంటి రెంట్ లేకుండా మే 17న జియో హాట్‍స్టార్ ఓటీటీలోకి వస్తుంది. ఆ ఓటీటీ సబ్‍స్రైబర్లు ఫ్రీగా చూసేయవచ్చు.

ఉల్ఫ్ మ్యాన్ సినిమాను వానెల్ గ్రిప్పింగ్ నరేషన్‍తో డైరెక్టర్ వానెల్ తెరకెక్కించారు. భయంకరమైన జీవుల నుంచి ఓ ఫ్యామిలీ చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా ఉంటాయి. ట్విస్టులతో ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా రూపొందించారు. ఈ మూవీలో క్రిస్టోఫర్ అబాట్‍తో పాటు జులియా గార్నర్, మటిల్డా ఫిర్త్, సామ్ జీగర్, మిలో కౌత్రోన్, బెండిక్ట్ హార్డీ కీలకపాత్రలు పోషించారు.

ఉల్ఫ్ మ్యాన్ స్టోరీలైన్

ఆనందంగా సమయం గడపాలనే ఉద్దేశంతో తన భార్య చార్లెట్ (గార్నర్), కూతురిని మారుమూల ఉన్న ఓ ఫామ్‍హౌస్‍కు బ్లేక్ ( క్రిస్టోఫర్ అబాట్‍) తీసుకెళతాడు. అయితే, అక్కడికి వెళ్లాక వారిపై కొన్ని వింత జీవులు దాడి చేస్తాయి. దీంతో వారు తప్పించుకునేందుకు ఇంట్లోనే దాక్కొని ఉంటారు. భయంగా గడుపుతుంటారు. తన భార్య, కూతురిని రక్షించుకునేందుకు బ్లేక్ కష్టపడుతుంటాడు. అయితే, ఓ రాత్రి బ్లేక్ శరీరంలో విపరీతమైన మార్పులు వస్తుంటాయి. ఓ మాన్‍స్టర్‌గా మారిపోతాడు. ఇది పెద్ద ట్విస్టుగా ఉంటుంది. చార్లెట్ భయపడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? బ్లేక్ ఎందుకు అలా మారిపోయాడు? అతడి భార్య, కూతురు పరిస్థితి ఏమైంది? అనే విషయాలు ఉల్ఫ్ మ్యాన్ సినిమాలో ఉంటాయి.

 

ఉల్ఫ్ మ్యాన్ కలెక్షన్లు

ఉల్ఫ్ మ్యాన్ సినిమా సుమారు 25 మిలియన్ డాలర్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ మూవీ ఫుల్ రన్‍లో 35 మిలియన్ డాలర్ల (సుమారు రూ.294 కోట్లు) కలెక్షన్లను దక్కించుకుంది. మోస్తరు వసూళ్లే వచ్చాయి. అయితే బాక్సాఫీస్ అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ సినిమాను యూనివర్సల్ పిక్చర్స్, బ్లూమ్‍హౌస్ ప్రొడక్షన్స్, క్లాక్ అండ్ కో బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశాయి.

జియో హాట్‍స్టార్ ఓటీటీలో మే 10వ తేదీన నోస్‍ఫెరాటు అనే హలీవుడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ మూవీలో లిలీ రోజ్‍డెప్ లీడ్ రోల్ చేశారు.

 

Best Web Hosting Provider In India 2024