ప్రైమ్ వీడియోలో ఉన్న టాప్ 7 బెస్ట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇవే..

Best Web Hosting Provider In India 2024

ప్రైమ్ వీడియోలో ఉన్న టాప్ 7 బెస్ట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇవే..

Hari Prasad S HT Telugu

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉన్న టాప్ 7 బెస్ట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలేవో ఇక్కడ తెలుసుకోండి. ఈ సినిమాలన్నీ మొదటి నుంచీ చివరి వరకు మంచి థ్రిల్ అందిస్తాయి. మరి ఆ సినిమాలేవో ఒకసారి చూద్దాం.

ప్రైమ్ వీడియోలో ఉన్న టాప్ 7 బెస్ట్ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఇవే..

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు ప్రతి ఓటీటీ ఆ ఇండస్ట్రీ సినిమాల కోసం పోటీ పడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ అలాంటి మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో బెస్ట్ మూవీస్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కూమన్ (Kooman)

కూమన్ 2022లో వచ్చిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దృశ్యం మూవీ ఫేమ్ జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆసిఫ్ అలీ నటించాడు. ఇది ఓ కఠినమైన పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథ. అతడు ఓ మారుమూల గ్రామానికి వెళ్లి సెటిలవుతాడు. అయితే అతని గతం వల్ల అతనితోపాటు చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదం తలెత్తుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

జోసెఫ్ (Joseph)

జోసెఫ్ 2018లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. జోజు జార్జ్ లీడ్ రోల్లో నటించాడు. ఇన్వెస్టిగేషన్ లో దిట్ట అని పేరు పొందిన ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ తన భార్య మరణం తర్వాత అనుకోకుండా ఓ క్రిమినల్ కేసులో చిక్కుకుంటాడు. ఆ తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్ ను పంచుతుంది.

ఎలా వీళ పూంచిరా (Ela Veezha Poonchira)

ఎలా వీళ పూంచిరా అనే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే స్టోరీ ఇది. ఓ మహిళను చంపి ముక్కలుగా చేసిన కేసును ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు దర్యాప్తు చేస్తారు. ఈ మిస్టరీ హత్య కేసును ఓ చిన్న పోలీస్ స్టేషన్ కు చెందిన ఆ ఇద్దరు పోలీసులు పరిష్కరిస్తారా లేదా అన్నదే ఈ మూవీ.

కురుత్తి (Kuruthi)

కురుత్తి 2021లో వచ్చిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ. మను వారియర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. భార్య, పిల్లల్ని కోల్పోయిన ఇబ్రహీం అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఓ రాత్రి ఓ గాయపడిన పోలీస్ అధికారి మర్డర్ కేసులో పట్టుబడిన ఓ క్రిమినల్ ను తీసుకొని అతని ఇంటికి వస్తాడు. ఆ రాత్రికి తనకు ఆశ్రయం కల్పించాలని కోరుతాడు. ఆ తర్వాత ఇబ్రహీం జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుందో ఈ సినిమాలో చూడొచ్చు.

కోల్డ్ కేస్ (Cold Case)

ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మూవీ కోల్డ్ కేస్. ఓ హత్య కేసులో అసలు చనిపోయింది ఎవరు? చంపింది ఎవరు అనే తెలుసుకునే ప్రయత్నం చేసే పోలీస్ అధికారి పాత్రలో అతడు నటించాడు. కేవలం పుర్రె మాత్రమే దొరుకుతుంది. అదే సమయంలో ఇదే కేసును ఓ జర్నలిస్ట్ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తుంది.

జోజి (Joji)

ఫహాద్ ఫాజిల్ లీడ్ రోల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఓ ఇంజినీరింగ్ చదివే స్టూడెంట్ మధ్యలోనే వదిలేస్తాడు. అప్పటికే ధనిక కుటుంబం నుంచి వచ్చిన అతడు.. తన ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సూపర్ రిచ్ కావాలని అనుకుంటాడు. అయితే అతని కుటుంబంలో జరిగే ఓ ఊహించని ఘటన అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది.

గరుడన్ (Garudan)

గరుడన్ 2023లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. సురేష్ గోపి నటించిన మూవీ ఇది. ముక్కుసూటిగా వ్యవహరించే ఓ పోలీస్ ఆఫీసర్, ఓ కాలేజీ ప్రొఫెసర్ ఓ నేరంలో చిక్కుకుంటారు. ఈ క్రమంలో ఒకరు న్యాయం కోసం, మరొకరు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం ప్రయత్నిస్తారు. ఐఎండీబీలో 7.3 రేటింగ్ సాధించిన మూవీ ఇది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024