కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేశు కథాచనా.. శ్రీకృష్ణుడు చెప్పిన దీనికర్థం తెలిస్తే మీకు జీవితంలో తిరుగే ఉండదు

Best Web Hosting Provider In India 2024

కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేశు కథాచనా.. శ్రీకృష్ణుడు చెప్పిన దీనికర్థం తెలిస్తే మీకు జీవితంలో తిరుగే ఉండదు

భగవద్గీత ఏడువందల శ్లోకాల హిందూ గ్రంథం ఇది. ఒక గొప్ప భారతీయ ఇతిహాసం మహాభారతంలో ఒక భాగం. మన జీవితంలో పాటించాల్సిన ప్రతి విధి, గుణగణాలు, లక్ష్యాలు, ప్రవర్తన గురించి భగవద్గీత ఏనాడో చెప్పింది.

 
అర్భునుడికి హితబోధ

ప్రపంచంలోనే అత్యంత లోతైన, ఆధ్యాత్మిక, తాత్విక గ్రంథాలలో భగవద్గీత ఒకటి. పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు మధ్య జరిగిన సంభాషణే భగవద్గీతగా రూపాంతరం చెందింది. ఇప్పటికే హిందువులకు భగవద్గీత ఆచరణీయమైన పాఠం.

 

పాండవులలో అత్యంత శక్తివంతమైన వాడు అర్జునుడు. అతడే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో తన బంధువులను, స్నేహితులను చూసి బాణం విడవలేక నిలబడి అచేతనంగా ఉండిపోతాడు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు అతడికి జ్ఞానబోధ చేస్తాడు. ఆ జ్ఞానబోధ భగవద్గీతగా మారి ఈనాటి తరాలకు మార్గ నిర్దేశం చేస్తోంది.

గుర్తుంచుకోవాల్సిన వాక్యం

భగవద్గీతలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన వాక్యం కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేశు కథాచనా. అంటే మీ చర్యలపై మాత్రమే మీకు నియంత్రణ ఉంటుంది.. దాని ఫలితాలపై మీరు ఎలాంటి హక్కును కలిగి ఉండరు. దీన్ని బట్టి మీరు పని మాత్రమే చేయాలి.. వచ్చే ఫలితాల గురించి ముందుగానే ఆలోచించి నిర్ణయాలు తీసుకోకూడదు.

చాలామంది ఏదైనా పని చేసే ముందు దాని ఫలితాన్ని ఊహిస్తారు. ఆ ఫలితం పాజిటివ్‌ గా అనిపిస్తేనే ముందుకు అడుగులు వేస్తారు. ఏమాత్రం నెగిటివ్‌గా అనిపించినా అక్కడే ఆగిపోతారు. దీనివల్ల ప్రయత్నం కూడా చేయరు. కానీ శ్రీకృష్ణుడు చెప్పినట్టు మీరు ప్రయత్నమే చేయాలి.. వచ్చే ఫలితం గురించి ఆలోచించకూడదు. ప్రయత్నిస్తూనే ఉంటే ఏదో ఒక రోజు సానుకూల ఫలితం వచ్చి తీరుతుంది.

శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం పూర్తి నిజాయితీ, అంకిత భావంతో పని చేయడం జీవితంలో ముఖ్యమైన భాగం. ఫలితాన్ని మీకు నచ్చినట్టే ఉండాలని ఆశించి ముందుకు వెళ్లకూడదు. మీరు విజయం సాధిస్తారా? లేదా వైఫల్యం పొందుతారా? అనేది మీ చేతుల్లో ఉండదు.. మీ విధి ప్రయత్నించడమే.

 

ప్రతి ఒక్కరి జీవితం భావోద్వేగాలతో నిండి ఉంటుంది. దుఃఖం, అహంకారం, కోపం, సంతోషం.. అన్నీ కూడా జీవితంలో భాగమే. అందుకే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఆనందం, బాధ, వైఫల్యం, విజయం అన్నింటిని సమానంగా చూడాలని.. దేనికీ అతి విచారం పనికిరాదని చెప్పాడు.

వైఫల్యం కారణంగా నిరుత్సాహపడితే జీవితమంతా ఆ ఓటమి వెంటాడుతూనే ఉంటుందని వివరించాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నేడు వైఫల్యం ఎదురైతే.. ఎల్లుండి విజయం ఎదురు కావచ్చు. కాబట్టి భావోద్వేగాలకు లొంగిపోయి అక్కడే ఉండిపోవద్దని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు.

ఆ బోధలు మనకు కూడా మార్గదర్శకమైనవే. చిన్న సమస్య రాగానే ఆ పనిని అక్కడే వదిలేసి వెళ్లిపోయేవారు ఎంతోమంది. పనిని చూసి భయపడితే మీకు ఏ ఫలితమూ రాదు. అదే ముందడుగు వేస్తే ప్రయత్నం చేయడం వల్ల అనుభవం వస్తుంది. వైఫల్యం చెందిన కూడా విజయానికి ఎంతోకొంత దగ్గరవుతారు.

ఓసారి తలచుకోండి

మీకు ఎప్పుడైనా నిరాశ కమ్మినప్పుడు, ఈ పని ఎందుకు చేయాలి అనిపించినప్పుడు, ఓటమి ఎదురవుతుందేమో అని భయం కలిగినప్పుడు… శ్రీకృష్ణుడు చెప్పిన కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేశు కథాచనా… అని ఒకసారి మీలో మీరే చెప్పుకోండి. తర్వాత మీ ఎదురుగా ఉన్న పని చేసేందుకు సిద్ధం అవ్వండి.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024