నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 7: ప్రేమ బంధం తెంచేసుకుంటున్నా: చంద్రతో విరాట్ తెగదెంపులు.. జగదీశ్వరి ఉగ్రరూపం

Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 7: ప్రేమ బంధం తెంచేసుకుంటున్నా: చంద్రతో విరాట్ తెగదెంపులు.. జగదీశ్వరి ఉగ్రరూపం

 

నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ మే 7: శ్రీరాజ్‍ను విరాట్ కొట్టేస్తాడు. వరదరాజులుపై కత్తిదూస్తాడు. సౌజన్య అడ్డుపడటంతో వెనక్కి తగ్గుతాడు. నీ ప్రేమ వద్దు అని చంద్రకళతో చెప్పేస్తాడు విరాట్. ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

 
నిన్ను కోరి సీరియల్ టుడే ఎపిసోడ్ మే 7: ప్రేమ బంధం తెంచేసుకుంటున్నా: చంద్రతో విరాట్ తెగదెంపులు.. జగదీశ్వరి ఉగ్రరూపం
 

నిన్ను కోరి సీరియల్ నేటి (మే 7) ఎపిసోడ్‍లో.. రఘురాంను చంపాలనుకున్నది శ్రీరాజ్, వరదరాజులే అనే నిజం విరాట్‍కు చెబుతానని చంద్ర అనుకుంటుంది. అలా చేస్తే విరాట్‍తో నీ పెళ్లి ఆగిపోతుందని చంద్రతో సుభద్ర అంటుంది. అయినా చెబుతానని, నిజం దాచి బావ, అత్తయ్యని మోసం చేయలేనని చంద్ర అంటుంది. ఒకరి ప్రాణం పోవాలా అని చంద్ర ప్రశ్నిస్తుంది. విరాట్‍కు చెప్పొద్దని శ్రీరాజ్ భార్య చంద్ర కాళ్ల మీద పడి అడుగుతుంది. కానీ అత్తయ్య వాళ్లకు నిజం చెప్పేస్తానని చంద్ర చెప్పేస్తుంది. ఇంతలో వరదరాజులు ఇంటికి విరాట్, జగదీశ్వరి, కామాక్షి వస్తారు.

 

జగదీశ్వరి ఉగ్రరూపం.. నీచుడా అంటూ..

వరదరాజులును కోపంగా పిలుస్తుంది జగదీశ్వరి. నీతి మాలిన నీచుడా.. బయటికి రారా అని అరుస్తూ అన్నయ్యపై ఉగ్రరూపం చూపిస్తుంది. ఇంతలో వరదరాజు, శ్రీరాజ్ అక్కడికి వస్తారు. నా భర్తకు ఎందుకు యాక్సిడెంట్ చేశారని వారిని జగదీశ్వరి ప్రశ్నిస్తుంది.

కత్తి దూసిన విరాట్.. వేడుకున్న సౌజన్య

కోపంతో ఉన్న విరాట్.. శ్రీరాజ్‍ను కొట్టేస్తాడు. తన తండ్రిని చంపాలనుకున్నందుకు ఆగ్రహంతో చితకబాదుతాడు. వరదరాజులు అడ్డు వస్తాడు. రేయ్ వరదరాజులు ఫస్ట్ నిన్నే చంపాలని అక్కడ ఉన్న కత్తిని విరాట్ తీసుకుంటాడు. వరదరాజులును పొడిచేందుకు విరాట్ కత్తి దూస్తాడు. ఇంతలో సౌజన్య అడ్డుపడుతుంది. తనకు పతిభిక్ష పెట్టాలని వేడుకుంటుంది. దీంతో విరాట్ వెనక్కి తగ్గుతాడు. అత్తయ్య పసుపు కుంకుమల కోసం వదిలేస్తున్నానని విరాట్ చెబుతాడు.

నిజం దాచావ్.. చంద్రను అపార్థం చేసుకున్న విరాట్

నిజం తెలిసి కూడా దాచావ్ అని చంద్రకళను విరాట్ అరుస్తాడు. లేదు.. లేదు అంటూ ఏడుస్తుంది చంద్ర. నాకూ ఇప్పుడే తెలిసిందని అంటుంది. అయితే, మా నాన్నను ఎందుకు కలిశావ్, ఆ విషయాన్ని మా దగ్గర ఎందుకు దాచావ్ అని అంటాడు. మీ బండారం బయట పెట్టొద్దని అడిగావా అని అనుమానిస్తాడు. లేదు అని చంద్ర ఏడుస్తుంది. నాటకాలు ఆడొద్దని కామాక్షి అంటుంది. నిజమే చెబుతున్నానని చంద్ర కన్నీరు పెట్టుకుంటుంది. మోసం చేశావని విరాట్ అంటాడు.

 

మీ ముఖం కూడా చూడను

తాను పుట్టింటి వాళ్లతో కలవాలని అనుకున్నాని, ఇంత ఘోరం చేశాక మీ ముఖం కూడా చూడనని ఆగ్రహంగా అంటుంది జగదీశ్వరి. వరదరాజులు కుటుంబంతో బంధాన్ని తెంచుకుంటుంది. మీతో ఎలాంటి బంధం సంబంధం అవసరం లేదని తెగేసి చెబుతుంది. వీళ్ల నీడ కూడా మన మీద పడడానికి వీలు లేదని జగదీశ్వరి అంటుంది.

ప్రేమ బంధాన్ని తెంచేసుకుంటున్నా

నేను కూడా అన్ని బంధాలు తెంచేసుకుంటున్నా.. ప్రేమ బంధం కూడా అని విరాట్ అంటాడు. దీంతో షాకైన చంద్రకళ బావ అని బాధగా అంటుంది. నువ్వు వద్దు.. నీ ప్రేమ వద్దు అని చెప్పేస్తాడు. కన్నవాళ్లకు నష్టం కలిగిస్తే ప్రేమను వదులుకుంటానని గతంలో చెప్పా కదా అని విరాట్ చెబుతాడు. అక్కడి నుంచి విరాట్, జగదీశ్వరి వెళ్లిపోతారు. దీంతో చంద్రకళ అక్కడే కుప్పకూలి మరీ బోరు ఏడుస్తుంది.

వాళ్లు మనుషులా.. రాక్షసులా

మంచంపై జీవచ్ఛంలా ఉన్న భర్త రఘురాంను చూసి జగదీశ్వరి బాధపడుతుంటుంది. ఇదే అదునుగా భావించి చంద్రకళకు నిజం తెలిసినా మనకి చెప్పకుండా దాచి, స్వార్థం కోసం నా అన్నయ్యను బలి తీసుకుందని కామాక్షి అంటుంది. అలాంటి దానికోసం నా కూతురు శృతి తన ప్రేమని త్యాగం చేసింది అని దెప్పిపొడుస్తుంది. శాలిని కూడా కామాక్షికి వంత పాడుతుంది. మీ అన్నయ్య మనందరినీ నమ్మించి మోసం చేశాడు అని జగదీశ్వరితో అంటుంది. నా వల్లే ఇదంతా.. నన్ను క్షమించమ్మా అని విరాట్ అడుగుతాడు. దీంతో గట్టిగా ఏడ్చిన జగదీశ్వరి అందర్నీ బయటికి వెళ్ళిపొమ్మని అంటుంది. నా భర్త దగ్గర ప్రశాంతంగా ఉండనివ్వండని అడుగుతుంది. దీంతో నిన్ను కోరి నేటి ఎపిసోడ్ ముగుస్తుంది

 

జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదని, తాను నిజం చెప్పాలనుకున్నానని విరాట్, జగదీశ్వరితో తరువాయి భాగంలో చెబుతుంది చంద్ర. కానీ, విరాట్, జగదీశ్వరి నమ్మరు. వెళ్లిపోవాలని అరుస్తారు.

 

Best Web Hosting Provider In India 2024