బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్‌: అప్పు టార్చ‌ర్‌కు రుద్రాణి ప‌రార్ – గ‌తం గుర్తుచేసుకున్న రాజ్ – కావ్య ప్లాన్ సూప‌ర్ హిట్‌

Best Web Hosting Provider In India 2024

బ్ర‌హ్మ‌ముడి టుడే ఎపిసోడ్‌: అప్పు టార్చ‌ర్‌కు రుద్రాణి ప‌రార్ – గ‌తం గుర్తుచేసుకున్న రాజ్ – కావ్య ప్లాన్ సూప‌ర్ హిట్‌

బ్ర‌హ్మ‌ముడి మే 7 ఎపిసోడ్‌లో రాజ్‌, కావ్య ఉన్న రిసార్ట్‌లోకి రుద్రాణి, రాహుల్ వెయిట‌ర్ వేషాల్లో వ‌స్తారు. రాజ్‌ను కావ్య…రామ్ అని ఎందుకు పిలుస్తుందో ఆరాలు తీయాల‌ని అనుకుంటారు. కానీ వారి ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. పెళ్లికొడుకు ఫ్రెండ్స్ రుద్రాణి, రాహుల్‌ల‌కు చుక్క‌లు చూపిస్తారు.

 
బ్ర‌హ్మ‌ముడి మే 7 ఎపిసోడ్‌
 

 

రాజ్‌, కావ్య ఉన్న రిసార్ట్‌కు రాహుల్‌, రుద్రాణి వ‌చ్చిన సంగ‌తి అప్పుకు ఫోన్ చేసి చెబుతుంది స్వ‌ప్న‌. నా క‌ళ్లుగ‌ప్పి ఇంట్లో నుంచి త‌ప్పించుకున్నార‌ని చెబుతుంది. జాగ్ర‌త్త ప‌డ‌తావ‌నే ముందుగా ఫోన్చేస్తున్నాన‌ని అప్పుతో అంటుంది స్వ‌ప్న‌. రాహుల్‌, రుద్రాణిల‌కు అస‌లు విష‌యం తెలియ‌కుండా మ్యానేజ్ చేస్తాన‌ని అప్పు స‌మాధాన‌మిస్తుంది.

 

మ్యానేజ్ కాదు…బాడీ మొత్తం కుళ్ల‌బోడ‌వాల‌ని అప్పుకు కోపంగా అంటుంది స్వ‌ప్న‌. ఇంకోసారి వేరేవాళ్ల జీవితాల్లోకి అడుగుపెట్టాలంటే భ‌యం పుట్టేలా చేయ‌మ‌ని స్వ‌ప్న చెబుతుంది. రుద్రాణి, రాహుల్ న‌న్ను త‌ప్పించుకొని ఎక్క‌డికి పోలేరు అని అప్పు బ‌దులిస్తుంది.

రాజ్..రామ్‌గా నాట‌కం…

చాటు నుంచి స్వ‌ప్న‌తో అప్పు మాట్లాడిన మాట‌ల‌ను రుద్రాణి, రాహుల్ వింటారు. మ‌నం ఆల్రెడీ లోప‌లికి వ‌చ్చామ‌నే విష‌యం తెలియ‌క బ‌య‌ట వెతుకుంటుంది అని రాహుల్ అంటాడు. అప్పు మ‌న‌ల‌ను క‌నిపెట్టే లోపే కావ్య ఇక్క‌డికి ఎందుకొచ్చింది? అస‌లు రాజ్‌తో రామ్ అన్న‌ట్లుగా ఎందుకు ప్ర‌వ‌ర్తిస్తుందో తెలుసుకోవాల‌ని రుద్రాణి అంటుంది.

సీతారామ‌య్య అల‌క‌…

మీ ప‌ద్ద‌తులు ఏం న‌చ్చ‌డం లేద‌ని, అంద‌రు త‌ప్పు చేస్తున్నార‌ని కుటుంబ స‌భ్యుల‌పై సీతారామ‌య్య కోప్ప‌డుతాడు. తండ్రి ఎందుకు అలా మాట్లాడుతున్నాడో తెలియ‌క సుభాష్‌, ప్ర‌కాశం కంగారు ప‌డ‌తారు. రాజ్ బ‌తికి ఉన్నాడ‌ని చెప్పారు…క‌నీసం వాడు ఎలా ఉన్నాడ‌న్న‌ది తెలుసుకోవాల‌ని నాకు ఉండ‌దా అని సీతారామ‌య్య అంటాడు.

ఈ రోజు నా మ‌న‌వ‌డిని చూడాల్సిందేన‌ని, రాజ్‌తో మాట్లాడాల్సిందేన‌ని ప‌ట్టుప‌డ‌తాడు. రాజ్‌కు గ‌త‌మే గుర్తు లేదంటే ఎలా మాట్లాడుతామ‌ని ఇందిరాదేవి అంటుంది. ఈ రోజు రాజ్‌తో మాట్లాడ‌కుండా భోజ‌నం చేసే ప్ర‌స‌క్తే లేద‌ని భీష్మించుకుంటాడు సీతారామ‌య్య‌. భ‌ర్త‌కు స‌ర్ధిచెప్ప‌బోతుంది ఇందిరాదేవి.

 

వీడియో కాల్‌…

అప‌ర్ణ క‌ల్పించుకొని.. రాజ్‌తో మావ‌య్య మాట్లాడుతాన‌ని అంటున్నాడు అంతేకానీ వాడే వార‌సుడు అని చెబుతాన‌ని అన‌డం లేదుగా అని అంటుంది. ఇప్పుడే కావ్య‌తో చెప్పి వీడియో కాల్ చేయిస్తాన‌ని మాటిస్తుంది. . కావ్య‌కు ఫోన్ చేసి రాజ్‌తో మాట్లాడుతాన‌ని సీతారామ‌య్య ప‌ట్టుప‌డుతున్నాడ‌ని చెబుతుంది అప‌ర్ణ‌.

ఒక‌సారి రాజ్‌తో మాట్లాడిస్తేనే తాత‌య్య భోజ‌నం చేస్తాన‌ని అంటున్నాడ‌ని అంటుంది. వీడియో కాల్ చేస్తే మ‌నిద్ద‌రం ఒక‌రికొక‌రం ప‌రిచ‌యం అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అప‌ర్ణ‌తో అంటుంది కావ్య‌. రాజ్‌కు క‌నిపించ‌కుండా ఉంటాన‌ని కావ్య‌కు మాటిస్తుంది అప‌ర్ణ‌.

కావ్య సైగ‌లు…

యామినితో మాట్లాడుతుంటాడు రాజ్‌. ఫంక్ష‌న్‌లో రాజ్‌తో క‌లిసి డ్యాన్స్ చేయాల‌ని యామిని క‌ల‌లు కంటుంది. మీతో మాట్లాడాల‌ని దూరం నుంచి రాజ్‌కు సైగ‌లు చేస్తుంది కావ్య‌. డ్యాన్స్ చేయాలంటే నువ్వు రెడీ కావాలిగా అంటూ తెలివిగా యామినిని అక్క‌డి నుంచి పంపించేస్తాడు రాజ్‌.

మీ ఫ్యామిలీనే…

ఆ త‌ర్వాత రాజ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి మా ఫ్యామిలీకి మిమ్మ‌ల్ని ప‌రిచ‌యం చేస్తాన‌ని మాటిచ్చాన‌ని కావ్య అంటుంది. ప‌రిచ‌య‌మైన ఐదు నిమిషాల్లోనే మా వాళ్లు చాలా ఎమోష‌న‌ల్ అవుతార‌ని రాజ్‌కు చెబుతుంది. ఇంత మంచి గుడ్‌న్యూస్‌ను ఇంత ఆల‌స్యంగా చెబుతారా అని రాజ్ అంటాడు. మీ ఫ్యామిలీ అంటే ఎవ‌ర‌నుకున్నారు నా ఫ్యామిలీ అని రాజ్ సంతోషంగా స‌మాధాన‌మిస్తాడు. నిజంగానే మీ ఫ్యామిలీనే అని కావ్య అంటుంది. ఏ అన్నార‌ని అన‌గానే టాపిక్ డైవ‌ర్ట్ చేస్తుంది.

 

పిలుపు విని ఎన్నిరోజులైంది…

వీడియో కాల్‌లో రాజ్‌తో మాట్లాడుతాడు సీతారామ‌య్య‌. తాత‌య్య అన్న పిలుపు విని చాలా రోజులైంద‌ని, ఎప్పుడొస్తున్నావురా అని సీతారామ‌య్య ఎమోష‌న‌ల్ అవుతాడు. తాతాయ్య ఎమోష‌న‌ల్ అయిపోయి సొంత మ‌న‌వ‌డిలా ఫీల‌వుతున్నాడ‌ని కావ్య క‌వ‌ర్ చేస్తుంది. నాకు అదే కావాల‌ని రాజ్ అంటాడు.

టైమ్‌కు తిని ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటూ తాత‌య్య‌కు జాగ్ర‌త్త‌లు చెబుతాడు. రాజ్‌కు గ‌తం గుర్తొచ్చిన‌ట్లే మాట్లాడ‌టం చూసి సుభాష్ అనుమాన‌ప‌డ‌తాడు. మీరు పిలిస్తే రోజు వ‌స్తాన‌ని సీతారామ‌య్య‌తో అంటాడు రాజ్‌. నువ్వు వ‌స్తే నాకు ప్ర‌తిరోజు పండ‌గేన‌ని సీతారామ‌య్య బ‌దులిస్తాడు.

మ‌న‌సు నిండిపోయింది…

ఇంట్లో అంద‌రితో మాట్లాడుతాడు రాజ్‌. కావ్య‌కు ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి అప‌ర్ణ మాత్రం ఫోన్ మాట్లాడ‌దు. రాజ్‌కు థాంక్స్ చెబుతుంది కావ్య‌. దీనికి థాంక్స్ ఎందుకు…మ‌న ఇద్ద‌రి ఫ్యామిలీలు ఒక్క‌టేన‌ని రాజ్ స‌మాధాన‌మిస్తాడు. రాజ్‌తో మాట్లాడ‌గానే నా మ‌న‌సు నిండిపోయింద‌ని సీతారామ‌య్య సంబ‌ర‌ప‌డ‌తాడు.

మందుబాబుల టార్చ‌ర్‌…

వెయిట‌ర్ వేషంలో ఉన్న రుద్రాణిని పెగ్‌ క‌ల‌ప‌మ‌ని పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ గొడ‌వ‌పెడ‌తారు. రాహుల్ వారికి మందు క‌ల‌ప‌బోతాడు. వీడి మొహం నాకు న‌చ్చ‌లేద‌ని అత‌డిని తిట్టి పంపించేస్తారు. మారువేషంలో ఉన్న రుద్రాణిని మ‌గ‌వాడిగా పొర‌ప‌డి రుద్రాణి భుజంపై చేయివేస్తారు. వారిపై రాహుల్ కోప్ప‌డుతాడు. మీ త‌ల్లి, చెల్లి భుజంపై చేయివేసిన‌ట్లు ఎందుకు అంత ఫైర్ అవుతున్నావ‌ని పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ గొడ‌వ చేస్తారు. త‌మ నాట‌కం బ‌య‌ట‌ప‌డ‌కుండా ఉండేందుకు వారికి పెగ్ క‌లిపి ఇస్తుంది రుద్రాణి.

 

ఇంత స్పీడ్‌గా, ప‌ర్‌ఫెక్ట్‌గా పెగ్ భ‌లే ఫిక్స్ చేశావ‌ని రుద్రాణిని పొగుడుతారు మందుబాబులు.

ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాలి…

మాకు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కావాల‌ని ఆ మందుబాబులు అంటారు. రాహుల్‌ను డ్యాన్స్ చేయ‌మ‌ని చెబుతారు. మేము డ్యాన్స్ చేయ‌మ‌ని, ఎవ‌రికి చెప్పుకుంటారో చెప్పుకొండి అని రాహుల్ వారిపై ఫైర్ అవుతాడు. వారు అడిగిన‌ట్లుగా డ్యాన్స్ చేయ‌మ‌ని రాహుల్‌ను రుద్రాణి బ‌తిమిలాడుతుంది.

మీకు ఏ డ్యాన్స్ కావాల‌న్న రాహుల్ చేస్తాడ‌ని మందుబాబుల‌తో చెప్పి కొడుకును ఇరికించేస్తుంది రుద్రాణి.

రుద్రాణి, రాహుల్ డ్యాన్స్‌లు…

నేను ఒక్క‌డిని డ్యాన్స్ చేసే బాగోద‌ని, కాంబినేష‌న్‌గా ఇంకొక‌రు తోడు ఉంటే బాగుంటుంద‌ని రుద్రాణిని బుక్ చేస్తాడు రాహుల్‌. ఇద్ద‌రు క‌లిసి డ్యాన్స్ చేయాల్సిందేన‌ని మందుబాబులు ప‌ట్టుప‌డ‌తారు.

క్లాసిక‌ల్‌, వెస్ట్ర‌న్ పాట‌ల‌కు రుద్రాణి, రాహుల్ డ్యాన్స్ చేస్తారు. వారి డ్యాన్స్ బాగాలేద‌ని, పిడ‌క‌లు వేసే స్టెప్పులు వేస్తున్నార‌ని మందుబాబులు కోప్ప‌డుతారు. ఈ సారి స‌రిగ్గా డ్యాన్స్ చేయ‌క‌పోతే బాగుండ‌ద‌ని వార్నింగ్ ఇస్తారు.

ప‌రార్‌…

మీ డ్యాన్స్‌లో కిక్ రావ‌డం లేద‌ని, టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేయ‌మ‌ని రాహుల్‌తో చెబుతారు మందుబాబులు. రాహుల్ చేత త‌మ కాళ్లు ప‌ట్టించుకుంటారు. మందుబాబుల టార్చ‌ర్ త‌ట్టుకోలేక రుద్రాణి, రాహుల్ పారిపోతారు. రాజ్‌కు గ‌తం గుర్తు రావ‌డానికి క‌ళ్యాణ్, అప్పు క‌లిసి కొత్త నాట‌కం ఆడుతారు. రాజ్‌, కావ్య‌ల క‌థ‌ను త‌మ క‌థ‌గా స్టేజ్‌పై చెబుతారు.

 

యామిని కంగారు…

త‌న‌తో గొడ‌వ‌ప‌డిన అమ్మాయి మా ఇంట్లో వినాయ‌కుడి విగ్ర‌హాన్ని ఆలంక‌రించ‌డానికి వ‌చ్చింద‌ని క‌ళ్యాణ్ అంటాడు. మా ఇంటి ప‌రువు కాపాడ‌టం కోసం ముసుగు వేసుకొని తాను పెళ్లి పీట‌ల మీద కూర్చోవాల్సివ‌చ్చింద‌ని అప్పు అంటుంది. ఈ క‌థ నేను ఎక్క‌డో విన్న‌ట్లు ఉంద‌ని రాజ్ అంటాడు. రాజ్ మాట‌లు విని యామిని కంగారు ప‌డుతుంది. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

 

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024