కోడిగుడ్డు పచ్చడి ఇలా చేశారంటే వదల్లేరు, ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేయండి

Best Web Hosting Provider In India 2024

కోడిగుడ్డు పచ్చడి ఇలా చేశారంటే వదల్లేరు, ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేయండి

Haritha Chappa HT Telugu

చికెన్ పికిల్, మటన్ పికిల్ లాగే కోడిగుడ్డు పచ్చడిని కూడా చేయవచ్చు. ఇక్కడ మేము కొత్త పద్ధతిలో ఎలా చేయాలో ఇచ్చాము. ఫాలో అయిపోండి.

కోడిగుడ్డు నిల్వ పచ్చడి రెసిపీ

పచ్చళ్ళు తెలుగు వారి భోజనంలో భాగం. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే నిల్వ పచ్చళ్ళు సిద్ధమైపోతూ ఉంటాయి. అలాగే చికెన్ పికిల్, మటన్ పికిల్ వంటి నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా సిద్ధమవుతాయి.

ఇక్కడ మేము కోడిగుడ్డు పచ్చడి ఎలా చేయాలో చెప్పాము. ఈ ఎగ్ పికిల్ చాలా రుచిగా ఉంటుంది. పైగా చాలా తక్కువ సమయంలోనే అయిపోతుంది. ఈ కోడి గుడ్డు పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కోడిగుడ్డు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు – నాలుగు

అల్లం వెల్లుల్లి పేస్టు – మూడు స్పూన్లు

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – ఐదు స్పూన్లు

కారం – ఐదు స్పూన్లు

నిమ్మరసం – మూడు స్పూన్లు

కోడిగుడ్డు పచ్చడి రెసిపీ

1. కోడిగుడ్డు పచ్చడి చేసేందుకు ఒక గిన్నెలో ఒక స్పూను కారము, అర స్పూను ఉప్పు వేసి కలపాలి.

2. అందులో పావు కప్పు నీళ్లు కూడా వేసి బాగా కలపాలి.

3. అందులోనే కోడిగుడ్లను కొట్టి బాగా గిలకొట్టుకోవాలి.

4. ఇప్పుడు ఆ గిన్నెను కళాయిలో నీళ్లు వేసి దించాలి.

5. ఆవిరి మీద పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. అది గట్టిగా ఆమ్లెట్ లాగా అవుతుంది.

6. తర్వాత ఆ కోడిగుడ్డు ఆవిరి కుడుమును తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

7. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నాలుగు ఐదు స్పూన్ల నూనె వేయాలి.

8. అందులో కోడిగుడ్లను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి.

9. కోడిగుడ్లు రంగు మారేవరకు వేయించాక నాలుగు స్పూన్ల కారం వేయాలి.

10. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి.

11. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా వేయించుకోవాలి.

12. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ మిశ్రమం చల్లారే దాకా ఉండాలి. ఆ తర్వాత నిమ్మరసం చేసి బాగా కలుపుకోవాలి.

13. అంతే టేస్టీ కోడి గుడ్డు పచ్చడి రెడీ అయినట్టే. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్లో పెట్టుకుంటే నెల రోజులు పాటు నిల్వ ఉంటుంది.

ఇది చాలా రుచిగా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ కోడిగుడ్డు పచ్చడి చేసుకొని చూడండి. అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం కోడిగుడ్డు పచ్చడి తినేందుకు సిద్ధమైపోండి.

ఎప్పుడూ ఒకేలాంటి పచ్చళ్ళు చేసుకునే బదులు ఇలా కొత్త పద్ధతిలో కోడిగుడ్డు పచ్చడి ప్రయత్నించి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. సాధారణంగా కోడిగుడ్లను ఉడకబెట్టి ముక్కలుగా కోసి ఇలా పచ్చడి చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా ఆవిరి మీద ఉడికించి చేయడం వల్ల రుచి ఇంకా పెరుగుతుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/
Source / Credits

Best Web Hosting Provider In India 2024