Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం టుడే మే 7 ఎపిసోడ్: దీపకు ఇక 2 గంటలే.. జ్యోత్స్నకు పోలీసుల ప్రశ్నలు.. సుమిత్ర కాళ్లపై పడిన కార్తీక్
కార్తీక దీపం 2 సీరియల్ టుడే మే 7వ తేదీ ఎపిసోడ్: జ్యోత్స్నపై పారిజాతం అనుమానంగా మాట్లాడుతుంది. శివన్నారాయణ ఇంటికి పోలీసులు వస్తారు. జ్యోత్స్నను ప్రశ్నిస్తారు. దీపకు రక్తం ఇవ్వాలని సుమిత్రను ప్రాధేయపడతాడు కార్తీక్. కాళ్లపై పడతాడు. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (మే 7, 2025) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. నేను గౌతమ్‍ను కలవడానికి వెళుతున్నట్టు నీకెలా తెలుసు అని పారిజాతాన్ని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. ఫాలో అవుతున్నావా అని అడుగుతుంది. నువ్వు నేను పెంచిన మొక్కవే.. జాగ్రత్తగా కాపాడుకోవద్దు అని పారు అంటుంది. నాశనం చేసేలా ఉన్నావ్ అని జ్యోత్స్న చిరాకు పడుతుంది. బావను తప్ప ఏవరినీ పెళ్లి చేసుకోనని చెప్పా కదా అని అంటుంది. మరి గౌతమ్‍ను వదిలివేయవచ్చు కదా అని పారు అంటుంది. చివరికి అదే చేస్తానని జ్యో అంటుంది. మధ్యలో ఏం చేస్తున్నావో చెప్పు అని పారిజాతం అంటుంది. నా జీవితం కోసం ఇష్టమైన పని జ్యో మాట్లాడుతుంది.
నోరు జారిన జ్యోత్స్న.. పారుకు పెరిగిన డౌట్
నీ జీవితాన్ని నాశనం చేసే తప్పు ఏదైనా ఉంటే అని పారిజాతం అంటుంది. ఉండదు అని జ్యో బదులిస్తుంది. దీప బయటికి వచ్చేసింది.. అసలైన నేరస్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారని పారిజాతం అంటుంది. దీపే అసలైన నేరస్తురాలు కదా అని అబద్ధం ఆడుతుంది జ్యోత్స్న. బుల్లెట్ వచ్చిన గన్ ఎవరిది అయి ఉంటుందని పారు అంటుంది. అలాంటి ఛాన్సే లేదని, ఉన్నా కూడా వారు దొరకరు అని నోరు జారుతుంది జ్యోత్స్న. దీంతో పారిజాతం అనుమానంగా చూస్తుంది. దశరథ్‍పై దాడి చేయించింది జ్యోత్స్న అనే అనుమానం బలపడుతుంది. ఇదేంటి ఇలా నోరు జారాను అని మనసులో అనుకుంటుంది జ్యో.
‘దొరకరా.. ఎవరు వాళ్లు’ అని పారు అడుగుతుంది. దశరథ్‍ను కాల్చింది ఎవరో నీకు తెలుసా.. లేకపోతే నువ్వా అని అనుమానంగా అంటుంది పారిజాతం. ఒక్కసారి దొరికితే జీవితం చాలా దూరం విసిరేస్తుందని అంటుంది. దొరికేందుకు తాను ఏ తప్పు చేయలేదని జ్యో కవర్ చేస్తుంది.
శివన్నారాయణ ఇంటికి పోలీసులు.. జ్యో కంగారు
ఇంతలో శివన్నారాయణ ఇంటికి పోలీసులు వస్తారు. జ్యోత్స్న.. జ్యోత్స్న అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. ఏమైందో వెళదాం పదా అని జ్యోతో పారు అంటుంది. పోలీసులను చూసి జ్యోత్స్న కంగారు పడుతుంది. పోలీసులు వచ్చారేంటి అని పారిజాతం అంటుంది. “దీపను ఎవరో కత్తితో పడిచారంట.. కార్తీక్ పోలీస్ కేసు పెట్టాడంట.. అనుమానం ఎవరి మీదైనా ఉందా అంటే నీ పేరు చెప్పాడంట” అని జ్యోతో శివన్నారాయణ చెబుతాడు. తన మనవరాలిని ప్రశ్నలు అడగొచ్చని పోలీసులకు చెబుతాడు.
దీప బతికే అవకాశం లేదు
ఏ ఆధారం లేకుండా పోలీసులు ఇంటికి రారు కదా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఒకవేళ వాడు దొరికితే అరెస్ట్ వారెంట్‍తో వచ్చే వారు కదా ఆలోచిస్తుంది. ఇంతలో దీప పరిస్థితి గురించి పోలీసులను పారిజాతం అడుతుంది. పాపాలు చేసిన వారు తొందరగా పోరులే అని శివన్నారాయణ అంటాడు. దీపను ఆసుపత్రిలో అడ్మిట్ చేశాం. ఇంకా ఏమీ తెలియదు. ఆవిడ ఒంట్లో దిగిన కత్తిపోట్లు చూస్తే.. ఆవిడ బతికే ఛాన్సే లేదు” అని పోలీస్ చెబుతాడు. నేను వెయిట్ చేసేది ఆ గుడ్‍న్యూస్ కోసమే అని జ్యో మనసులో అనుకుంటుంది.
పోలీసుల ప్రశ్నలు
ఈరోజు మీరు ఎక్కడికి వెళ్లారని జ్యోత్స్నను పోలీసు ప్రశ్నిస్తాడు. నాకు కాబోయే భర్త గౌతమ్‍ను కలిసేందుకు వెళ్లానని, ఆ తర్వాత ఇంట్లోనే ఉన్నానని జ్యోత్స్న సమాధానమిస్తుంది. మీకు దీపతో కార్తీక్ విషయంలో ఏవైనా గొడవలు ఉన్నాయా అని పోలీసులు అడిగితే.. నా పెళ్లి విషయంలో గొడవలు పెట్టుకుందని జ్యో అంటుంది. మా డాడీని షూట్ చేసిందని చెబుతుంది. అది నిజం కాదని కోర్టు బెయిల్ కూడా ఇచ్చింది కదా అని పోలీసు చెబుతాడు. కోర్టు బెయిల్ ఇస్తే నేరం చేయనట్టేనా అని శివన్నారాయణ అంటాడు. ఏవైనా ఆధారాలు ఉంటే చెప్పండి.. లేకపోతే వెళ్లండి అని పోలీసులకు చెబుతాడు.
అవసరమైతే పోలీస్ స్టేషన్‍కు రావాల్సి ఉంటుందని పోలీసు చెబుతాడు. మేం ఏ నేరం చేయలేదు. మేం రామని సుమిత్ర అరుస్తుంది. ఈసారి వస్తే సాక్ష్యాలు, ఆధారాలతో రావాలని అంటుంది. దీంతో పోలీసులు వెళ్లిపోతారు.
జ్యోత్స్న చేసిందా.. పారు అనుమానం
దీపపై దాడి ఎవరు చేయించి ఉంటారని పారిజాతం అంటుంది. దాని మాజీ మొగుడు నరసింహమమే చేయించి ఉంటాడని శివన్నారాయణ అంటాడు. ఇంతకు ముందు జ్యోత్స్నే చేయించింది.. ఇప్పుడు కూడా జ్యోత్స్నే చేసిందా అని పారిజాతం అనుమానిస్తుంది. దీపకు తగిన శాస్త్రే జరిగిందని, కానీ జ్యోత్స్న పేరును కార్తీక్ చెప్పడమేంటని శివన్నారాయణ అంటాడు. దీప చచ్చింది అనే వార్త కోసం వెయిట్ చేస్తున్నా.. అదిపోతే సెలెబ్రేట్ చేసుకుంటా అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
దీపకు ట్రీట్‍మెంట్.. కాంచన, అనసూయ కన్నీళ్లు
కత్తి పోట్లు దిగిన దీపకు ఆసుపత్రిలో ట్రీట్‍మెంట్ జరుగుతుంటుంది. ఇంతలో కాంచన, అనసూయ ఆసుపత్రికి వస్తారు. ఏమైంది.. దీపను కత్తితో పొడవడం ఏంటి అని కాంచన కన్నీటితో అడుగుతుంది. ఏం జరిగింతో చెప్పాలని అనసూయ అడుగుతుంది. “గుడికి రెడీ అవుతుంటే త్వరగా రా అన్నా.. తలుపులు వేసి వస్తాదనని దీప లోపలికి వెళ్లింది. ఇంతకూ రాకపోయే సరికి నేనే వెళ్లా. పెరటి తలుపు కింది నుంచి రక్తం వస్తోంది. ఏంటా అని చూస్తే దీప కిందపడి పోయి ఉంది. అప్పటికే దీపను ఎవరో పొడిచి పారిపోయారు” అని కార్తీక్ చెబుతాడు.
రక్తం కావాలి.. 2 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే బతకదు
రెండు చోట్లు కత్తిపోట్లు దిగాయని, చాలా రక్తం పోయిందని, వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని కార్తీక్‍తో డాక్టర్ చెబుతుంది. ఆపరేషన్ చేయాలని కాంచన అంటుంది. ఆపరేషన్ చేయాలంటే ఓ పాజిటివ్ రక్తం కావాలని డాక్టర్ చెబుతుంది. ఇంకా మూడు నుంచి నాలుగు యూనిట్ల బ్లడ్ అవసరం అవుతుందని, మీరు అరేంజ్ చేయగలరా అని అడుగుతుంది. తనది ఓ పాజిటివేనని, నేను ఇస్తానంటాడు కార్తీక్. కానీ మొన్నే ఇచ్చారు కదా.. మీరు ఇవ్వడం కుదరదు అని డాక్టర్ చెబుతుంది. మూడు నెలల గ్యాప్ ఉండాలంటుంది. 2 గంటల్లో ఆపరేషన్ చేయకపోతే దీప బతకదని డాక్టర్ చెబుతుంది. బ్లడ్ బ్యాంక్‍లో కూడా ఈ గ్రూప్ బ్లడ్ లేదని, మీరే రక్తాన్ని అరేంజ్ చేసుకోవాలని అంటుంది. రెండు గంటల్లో డోనర్లను పట్టుకోవాలని చెబుతుంది.
జ్యోత్స్న, సుమిత్త అత్తది అదే గ్రూప్
ఇప్పుడు ఎలా రా అని కాంచన ఏడుస్తుంది. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వారు మన ఫ్యామిలీలో నాతో పాటు ముగ్గురు ఉన్నారని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న, సుమిత్ర అత్తది అదే గ్రూప్ అని చెబుతాడు. వాళ్లు రక్తం ఎందుకు ఇస్తారని అనసూయ అంటుంది. కార్తీక్ వెళ్లి అడిగితే వదిన ఇస్తుంది.. వదిన మనసు నాకు తెలుసు అని కాంచన అంటుంది. వెళ్లి వదినకు జరిగింది చెప్పు.. రక్తం ఇవ్వడానికి ఒప్పుకుంటుందని కార్తీక్‍తో కాంచన చెబుతుంది. వెళతానని కార్తీక్ అంటాడు. దీపకేం కాదు.. భయపడొద్దు.. నా భార్యను నేను బతికించుకుంటానని చెప్పి వెళతాడు.
కార్తీక్‍కు బుద్ధి వచ్చేలా చేయాలి
పదా.. వాడేనా మన మీద కేసు పెట్టేది.. మనమూ పెట్టగలం అని శివన్నారాయణ అంటాడు. కేసు మన మీద పెట్టలేదని దశరథ్ అంటాడు. కానీ పోలీసులు మన ఇంటికే వచ్చారు కదా, కార్తీక్ గాడికి మన మీదనే అనుమానం వచ్చింది కదా అని శివన్నారాయణ అంటాడు. మనం కూడా వాడికి బుద్ధి వచ్చేలా చేయాలని కోపంగా చెబుతాడు. వదిలేయాలని దశరథ్ అంటే.. వెళదాం పదా అని శివన్నారాయణ అంటాడు.
రక్తపు మరకలతో తాత ఇంటికి కార్తీక్
ఇంతలో తాత శివన్నారాయణ ఇంటికి కార్తీక్ వస్తాడు. దీప రక్తపు మరకలు ఇంకా అతడి చొక్కాపై అలాగే ఉంటాయి. దీప ఎన్నాళ్లు బతుకుతుందో తెలియదు కానీ.. నీకు వందేళ్లు అని వెటకరిస్తాడు శివన్నారాయణ. దీపను ఎవరో కత్తితో పడిచారు.. ఆపరేషన్ చేయకపోతే దీప బతకదు అని కన్నీరు పెట్టుకుంటూ చెబుతాడు కార్తీక్. ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలని.. కానీ నేను ఈమధ్యే ఓ పాపకు బ్లడ్ ఇవ్వడం వల్ల మళ్లీ ఇవ్వకూడదని అంటున్నారని బాధగా చెబుతాడు. మూడు నుంచి నాలుగు యూనిట్ల బ్లడ్ అవసరం, బయట ట్రై చేసే టైమ్ లేదని అంటాడు.
భగవంతుడు వేసిన శిక్ష
అయితే మా ఇంటికి ఎందుకు వచ్చావని శివన్నారాయణ అడుగుతాడు. జ్యోత్స్నది, అత్తది అదే బ్లడ్ గ్రూప్ కదా.. సాయం చేయమని అడగడానికి వచ్చాను అని కార్తీక్ దీనంగా అంటాడు. దేవుడు ఉన్నాడు.. పాపం చేసిన మనిషిని నీ తెలివి తేటలతో కాపాడావ్.. శిక్ష పడిందని నానా మాటలు అంటాడు శివన్నారాయణ. భగవంతుడే వేసిన శిక్ష అని అంటాడు.
కాళ్లపై పడి ప్రాధేయపడిన కార్తీక్
నువ్వు తప్ప ఎవరూ నా భార్యను కాపాడలేరు అని సుమిత్రను ప్రాధేయపడతాడు కార్తీక్. నా భర్తను చంపాలనుకున్న నీ భార్యను నేను కాపాడాలా అని చిరాకు పడుతుంది. మామయ్యకు తగిలిన బుల్లెట్ దీప పట్టుకున్న గన్‍లో నుంచి వచ్చింది కాదని కోర్టులు రుజులైంది కదా అత్త అని కార్తీక్ చెబుతాడు. సాక్ష్యాలు నువ్వు మార్చేశావని, వాటిని ఎలా నమ్ముతామని పారిజాతం కల్పించుకుంటుంది. నా భార్య ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానని అంటాడు.
దీపను చంపే అవసరం ఎవరికి ఉంది
ఎవడో పొడిస్తే కేసు పెట్టించి.. పోలీసులను మా ఇంటికి పంపించావని శివన్నారాయణ కోపంగా అంటాడు. నా భార్యను చంపే అవసరం ఎవరికి ఉంది అని కార్తీక్ అంటాడు. అంటే నా కూతురే ఈ పని చేయించిందని అనుకుంటున్నావా అని సుమిత్ర అంటుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరినీ అనుమానించలేను.. ఎవరి నమ్మలేనని కన్నీళ్లతో కార్తీక్ అంటాడు. దీపకు, జ్యోత్స్నకు మధ్య గొడవలు ఉన్నాయి కాబట్టే.. పోలీసులు ఇంటికి వచ్చారని చెబుతాడు.
నీ భార్య చనిపోతే శుభవార్తే
చేసిన ఏదో ఒక పాపం వల్ల దీపకు ఈ పరిస్థితి అంటూ కటువుగా మాట్లాడతాడు శివన్నారాయణ. ఒకవేళ నీ భార్య చనిపోయినా ఈ ఇంటికి శుభవార్తే అని అంటాడు. దీంతో కార్తీక్ బాధతో అల్లాడతాడు. గుర్తు పెట్టుకో అంటాడు. అంత మనసు లేకుండా ఎలా మాట్లాడుతున్నావ్ తాత అని కార్తీక్ ఏడుస్తాడు. పగ, ప్రతీకారాలు ఉంటే నా మీద తీర్చుకోండి.. నా భార్య చావుబతుకుల్లో ఉంది.. రక్తం కావాలి అని అంటాడు.
సుమిత్ర కాళ్లపై పడిన కార్తీక్
అత్తా నాతో ఆసుపత్రికి రా అత్తా అని దండం పెడుతూ సుమిత్రను అడుగుతాడు కార్తీక్. నా కొడలు రాదు అని శివన్నారాయణ అంటాడు. సుమిత్ర కాళ్లపై కార్తీక్ పడతాడు. దీంతో కోపంగా దూరం జరుగుతుంది సుమిత్ర. నీ అవసరానికి ఎంత నీచానికైనా దిగజారతావా అని శివన్నారాయణ అంటాడు. దీప బతకాలంటే నువ్వు రావాలత్తా అని కార్తీక్ కన్నీటితో ప్రాధేయపడతాడు. ఒకప్పుడు దీప నీ ప్రాణాలు కాపాడింది.. ఆ కృతజ్ఞతతో అయినా రా అత్తా అని అడుగుతాడు. పైకి లేవరా అని కార్తీక్‍ను లేపుతుంది సుమిత్ర.
కరగని సుమిత్ర మనసు
కార్తీక్ ఎంత ప్రాధేయపడినా సుమిత్ర మనసు కరగదు. నా భర్త రక్తం కళ్లచూసిందిరా.. దానికి నేను రక్తం ఎలా ఇస్తానని సుమిత్ర అంటుంది. నా కన్నకూతురిని చంపాలనుకుంది.. దాన్ని నేనెందుకు బతికిస్తానని తెగేసి చెబుతుంది. దీపను కాలమే శిక్షించిందని అంటుంది. అవసరమైతే నా రక్తాన్ని కళ్లు చూడు.. నా భార్యను కాపాడాలని కార్తీక్ అంటాడు. జీవితం ఎప్పుడూ ఏదీ అడగలేదు.. ఇప్పుడు అడుగుతున్నా.. నా భార్యను బతికించు అత్తా అని కార్తీక్ అంటాడు.
చచ్చిపోతే సంతోషం
ప్లీజ్ మామయ్య నువ్వైనా అత్తకు చెప్పు అని దశరథ్‍ను కార్తీక్ అడుగుతాడు. ఎవరీ చెప్పాల్సిన అవసరం లేదు.. వెళ్లు అని సుమిత్ర అంటుంది. నేను ఎవరి గురించి ఆలోచించను అని తెగేసి చెబుతుంది. చచ్చిపోతుంది అత్తా అని కార్తీక్ అంటాడు. సంతోషం అని శివన్నారాయణ అంటాడు. దీంతో బాధతోనే తాత అని అరుస్తాడు కార్తీక్.
దీప కోసం అసలు రాను
దీప కోసం నువ్వేందుకు బాధపడతావని జ్యోత్స్న. ఎందుకంటే దీప నేను తాళి కట్టిన భార్య అని కార్తీక్ అంటాడు. నా భార్య నా కళ్ల ముందే చచ్చిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటా.. ప్రాణాలు అడ్డుపెట్టైనా కాపాడుకుంటా అని ఏడుస్తూ అంటాడు. వెళ్లి తమరి ప్రాణాలు అడ్డుపెట్టి.. నీ భార్య ప్రాణాలు కాపాడుకో అని శివన్నారాయణ అంటాడు. పరాయి వాళ్లైనా అనుకొని సాయం చెయ్ అని సుమిత్రను కార్తీక్ అడుగుతాడు. పరాయి వాళ్లకైతే వెంటనే సాయం చేసే దాన్ని అని, కానీ దీప కోసమైతే నువ్వు ప్రాధేయపడినా అసలు రాను అని సుమిత్ర అంటుంది.
కన్నీళ్లతో వెనుదిరిన కార్తీక్
వెళతావా.. గెంచాలా అని కార్తీక్‍పై శివన్నారాయణ గట్టిగా అరుస్తాడు. నా కోసం రావా అని సుమిత్రను మళ్లీ అడుగుతాడు కార్తీక్. నా భర్తను చంపాలనుకున్న మనిషిని నేను కాపాడలేను.. నువ్వు వెళ్లొచ్చు అని సుమిత్ర అంటుంది. వెళ్లడం ఆలస్యమైతే ఆఖరి చూపు కూడా దక్కదేమో అని శివన్నారాయణ అంటాడు. ఈ జన్మలో చేసిన పాపం.. ఈ జన్మలో అనుభవించాల్సిందే.. పోరా అని చిరాకుగా అంటాడు శివన్నారాయణ. కన్నీటితో ఆ ఇంటి నుంచి వెనుదిరుగుతాడు కార్తీక్. నేను కోరుకున్నది కూడా ఇదే బావ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఏడుస్తూ నడుస్తుంటాడు కార్తీక్. దీంతో కార్తీక దీపం 2 నేటి (మే 7) ఎపిసోడ్ ముగిసింది.