ప్రమాదంలో గాయపడిన విజయవాడ బీజేపీ ఎమ్మెల్యే.. మాజీ కేంద్రమంత్రి.. పట్టించుకోని టీడీపీ, బీజేపీ నేతలు

మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి లండన్‌ పర్యటనలో గాయపడ్డారు. భుజానికి గాయం కావడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో సుజనా చౌదరి గాయపడ్డట్టు ఆయన కార్యాలయం ప్రకటించినా ప్రభుత్వ పెద్దలు, సొంత పార్టీ బీజేపీ నేతలు స్పందించ లేదు.

గాయపడిన ఎమ్మెల్యేను పట్టించుకోని కూటమి నేతలు
 
బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి లండన్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డారు.రెండు రోజుల క్రితం లండన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయన జారి పడటంతో కుడి భుజానికి తీవ్ర గాయమైంది.

లండన్‌లో ప్రాథమిక చికిత్స తీసుకున్న సుజనా చౌదరిని.. మెరుగైన వైద్య సేవల కోసం వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. సర్జరీ కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు సుజనా చౌదరి.

ప్రకటన విడుదల..

‘సుజనా చౌదరికి నిన్న లండన్‌లో ప్రమాదం జరిగింది. లండన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడ ఒక సూపర్ మార్కెట్ లో స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సుజనా చౌదరి కుడి భుజానికి స్వల్ప గాయమైంది. అనంతరం ఆయన హైదరాబాద్‌కి తిరిగి వచ్చారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మైనర్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన హాస్పిటల్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కూటమి కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందవద్దు’ అని సుజనా చౌదరి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర మంత్రిగా…

సుజనా చౌదరి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2010లో టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. టీడీపీ తరపున రెండు సార్లు రాజ్యసభ సభ్యత్వం పొందారు.

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైన తర్వాత బీజేపీలోకి చేరారు. 2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.

టీడీపీలో ఒకప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా సుజనా చౌదరికి గుర్తింపు ఉండేది. 2024 ఎన్నికల్లో విజయవాడలో బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. సిట్టింగ్ స్థానాన్ని వదులుకోడానికి టీడీపీ సుముఖత వ్యక్తం చేయకపోవడంతో చివరి నిమిషంలో విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేశారు. విజయవాడ ఎంపీ టిక్కెట్‌ దక్కుతుందనే నమ్మకంతో కానూరులో సొంతింటిని కూడా నిర్మించుకున్నారు.

స్పందించని రెండు పార్టీల నేతలు..

విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సుజనా చౌదరి ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు ఉంది. 2004-14 మధ్య కాలంలో ప్రతిపక్షానికి టీడీపీ పరిమితమైన సమయంలో ఆ పార్టీలో కీలకమైన నాయకుడిగా సుజనా చౌదరి ఎదిగారు. చంద్రబాబు ఆశీస్సులతో కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది.

సుజనా చౌదరి బీజేపీలో చేరిన తర్వాత ఏపీ బీజేపీ పగ్గాలు ఆయనకు దక్కుతాయని ప్రచారం జరిగింది. సామాజిక వర్గాల లెక్కల్లో మొదట కన్నా లక్ష్మీ నారాయణ ఆ తర్వాత సోము వీర్రాజులకు ఏపీ బీజేపీ పగ్గాలు దక్కాయి. ఆ తర్వాత పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు అయ్యారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు సుజనా చౌదరికి దక్కుతాయని విస్తృత ప్రచారం జరిగింది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తరపున సత్యకుమార్‌యాదవ్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కింది. ఈ క్రమంలో నియోజక వర్గంలో అభివృద్ధి పనులతో సొంత ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడిన బీజేపీ ఎమ్మెల్యేకు పరామర్శలు తెలిపేందుకు కూడా కూటమి పార్టీల నేతలు తీరిక చేసుకోక పోవడం చర్చనీయాంశం అయ్యింది.

ఎమ్మెల్యే స్వయంగా గాయపడి చికిత్స పొందుతున్నట్టు స్వయంగా ప్రకటించినా అటు బీజేపీ, ఇటు టీడీపీ నేతలెవరు ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేయకపోవడానికి కారణాలేమిటనే చర్చ జరుగుతోంది.

Source / Credits

Best Web Hosting Provider In India 2024