రేపటిటితో ముగియనున్న ఏపీ ఈఏపీ సెట్‌ కరెక్షన్‌ విండో… మే12 నుంచి హాల్‌ టిక్కెట్లు.. ఈ ఏడాది 3.60లక్షల దరఖాస్తులు

Best Web Hosting Provider In India 2024

రేపటిటితో ముగియనున్న ఏపీ ఈఏపీ సెట్‌ కరెక్షన్‌ విండో… మే12 నుంచి హాల్‌ టిక్కెట్లు.. ఈ ఏడాది 3.60లక్షల దరఖాస్తులు

 

ఆంధ్రప్రదేశ్‌ ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్‌కు ఈ ఏడాది 3.60లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు రేపు సాయంత్రం వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చు. మే 12 నుంచి ఈఏపీ సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదలవుతాయి.

 
ఏపీ ఈఏపీ సెట్‌ 2025‌కు 3.60లక్షల దరఖాస్తులు
 

ఈఏపీ ఈఏపీ సెట్‌ దరఖాస్తుల కరెక్షన్ విండో ఆప్షన్‌ రేపటితో ముగియనుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్‌కు ఈ ఏడాది మొత్తం 3,60,702 దరఖాస్తులు అందినట్టు కన్వీనర్ వి.వి.సుబ్బారా వు మంగళవారం తెలిపారు.

 

ఏపీ ఈఏపీ సెట్‌కు ఇంజినీరింగ్ విభాగంలో ప్రవేశ పరీక్షకు 2,79,203 మంది, అగ్రికల్చరల్, ఫా ర్మసీ విభాగంలో 80,587 మంది, రెండు విభాగాలకు కలిపి 912 మంది దరఖాస్తు చేసుకున్నారని కన్వీనర్‌ సుబ్బారావు వివరించారు. విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులుంటే మే 8లోగా సరి చేసుకునేందుకు అవకాశం కల్పించారు. సందేహాలుంటే 0884-23 59599లో సంప్రదించవచ్చని సూచించారు.

లేట్‌ ఫీతో అవకాశం…

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు మరికొన్ని రోజుల్లో ముగుస్తుంది. రూ.4వేల జరిమానాతో మే 12 వరకు, రూ.10వేల లేట్‌ఫీతో మే 16వరకు ఈఏపీ సెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 12న ఈఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ ఈఏపీ సెట్‌కు మార్చి 15 నుంచి ఆన్‌‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 24 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తారు.

మే 6 నుంచి మే 8వ తేదీ వరకు దరఖాస్తుల కరెక్షన్ విండో ఓపెన్ అవుతంది. రూ.4వేల ఆలస్య రుసుముతో మే 12 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రూ.10వేల ఆలస్య రుసుముతో మే 16వరకు దరఖాస్తు చేయవచ్చు.

 

ఏపీ ఈఏపీ సెట్‌ నోటిఫికేషన్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది…

https://cets.apsche.ap.gov.in/

మే 12 నుంచి హాల్‌ టిక్కెట్లు విడుదల.. ఏర్పాట్లు పూర్తి

మే 12 నుంచి ఈఏపీ సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేస్తారు. మే 19,20తేదీలలో ఈఏపీ సెట్‌ నిర్వహిస్తారు. జూన్‌ 6న ఫలితాలు విడుదల చేస్తారు.

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 46 కేంద్రాలు, హైదరాబాద్‌లో రెండు రీజనల్ కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు వెల్లడించారు. మే 12 నుంచి హాల్‌ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని, మే 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు.

దరఖాస్తుదారులు సమాచార నమోదులో పొరపాటు జరిగితే హెల్ప్ లైన్ సెంటర్ ను సంప్రదించాలన్నారు. మే 6 నుంచి 8 లోగా సవరించుకునేందుకు అవకాశం కల్పి స్తామని వివరించారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు

ఒక పేపర్ కు ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500, ఇతరులందరికీ రూ.900 ఫీజు నిర్ణయించారు. రెండు పేపర్లకు అప్లై చేసుకునే అభ్యర్థులకు SC, ST, PWDలకు రూ. 1000 ఫీజు, మిగిలిన అభ్యర్థులు రూ.1800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఏపీలోని ప్రభుత్వ,ప్రైవేట్ ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ల కోసం ఏపీ ఈఏపీ సెట్ 2025 నిర్వహిస్తున్నారు.

 

ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ మార్చి 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. పూర్తి వివరాలు

https://cets.apsche.ap.gov.in/ లో అందుబాటులోకి ఉంటాయి.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024