గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్: దొంగ‌గా మారిన మీనా త‌మ్ముడు-ఆఫ్ట్రాల్ డ్రైవ‌ర్ అంటూ బాలుకు అవ‌మానం -శివ విశ్వ‌రూపం

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంట‌లు టుడే ఎపిసోడ్: దొంగ‌గా మారిన మీనా త‌మ్ముడు-ఆఫ్ట్రాల్ డ్రైవ‌ర్ అంటూ బాలుకు అవ‌మానం -శివ విశ్వ‌రూపం

 

గుండె నిండా గుడి గంట‌లు మే 7 ఎపిసోడ్‌లో ప్ర‌భావ‌తి ద‌గ్గ‌ర డ‌బ్బులు కొట్టేసిన వీడియో చూపించి శివ‌ను హెచ్చ‌రించాల‌ని బాలు అనుకుంటాడు. కానీ బాలుపైనే శివ రివ‌ర్స్ ఎటాక్ చేస్తాడు. బాలును తాగుబోతు అంటూ అవ‌మానిస్తాడు.

 
గుండె నిండా గుడి గంట‌లు మే 7 ఎపిసోడ్‌
 

 

శివ విష‌యంలో మీనాపై ఫైర్ అవుతాడు బాలు. వాడు ఎక్క‌డ ప‌నిచేస్తున్నాడో, ఎవ‌రి ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నాడో తెలుసుకోవ‌ద్దా అని మీనాకు క్లాస్ ఇస్తాడు. మీనా, బాలు వాళ్ల‌లో వాళ్లే గొడ‌వ‌ప‌డ‌టం చూసి ప్ర‌భావ‌తిలో అనుమానం మొద‌ల‌వుతుంది. శివ‌ను న‌మ్మితే మీరు బాధ‌ప‌డ‌తార‌ని మీనాతో బాలు అంటాడు.

 

బాలు బైక్‌ను దొంగ‌త‌నం చేసింది శివ‌నే క‌దా అని ప్ర‌భావ‌తి అంటుంది. ఏంటి మీనా త‌మ్ముడు దొంగ‌నా అని శృతి అంటుంది. మా అమ్మ ఏదో నోటికి వ‌చ్చింది మాట్లాడుతుంది. నువ్వు స‌గం తెలుసుకొని మాట్లాడొద్దు అని శృతితో అంటాడు ర‌వి.

స‌త్యం ఆర్డ‌ర్‌..

బావ‌మ‌రిదిని వెన‌కేసుకొచ్చే నువ్వు శివ హాస్పిట‌ల్‌లో ఉంటే ఇంట్లో ఏం చేస్తున్నావ‌ని బాలుకు క్లాస్ ఇస్తాడు స‌త్యం. జ‌రిగింది ఏదో జ‌రిగింది రేపు ఉద‌య‌మే హాస్పిట‌ల్‌కు వెళ్లి శివ‌ను చూసి ర‌మ్మ‌ని బాలుకు ఆర్డ‌ర్ వేస్తాడు స‌త్యం. రేపు ఉద‌యం కూడా ట్రిప్ బుక్క‌యింద‌ని, కుద‌ర‌ద‌ని బాలు బ‌దులిస్తాడు.

అంటే రేపు కూడా హాస్పిట‌ల్ రావ‌డం లేదా అని బాలును అడుగుతుంది మీనా. మ‌గ‌దిక్కు లేని ఆ కుటుంబానికి నువ్వే తోడుగా ఉండాల‌ని, మీ అత్త‌గారికి నువ్వే ధైర్యం చెప్పాల‌ని బాలుతో అంటాడు స‌త్యం. బాలు ఏదో మాట్లాడ‌బోతుండ‌గా…నువ్వు వెళుతున్నావు అంతేన‌ని స‌త్యం ఖ‌రాఖండిగా చెబుతాడు.

ఫ్రాడ్ ప‌నులు ఎలా చేస్తున్నావు…

ట్యాబ్లెట్స్ తీసుకురావ‌డానికి సుమ‌తి బ‌య‌ట‌కు వెళ్లిన టైమ్‌లో శివ‌ను చూడ‌టానికి హాస్పిట‌ల్‌కు వ‌స్తాడు బాలు. మ‌ళ్లీ ఏం విర‌గొట్ట‌డానికి వ‌చ్చావ‌ని బాలును చూడ‌గానే కోపంగా అడుగుతాడు శివ‌. నువ్వు ఇన్ని ఫ్రాడ్ ప‌నులు ఎలా చేస్తున్నావ‌ని శివ‌ను నిల‌దీస్తాడు బాలు. తాను ఏం త‌ప్పు చేయ‌లేద‌ని బుకాయించ‌బోతాడు.

 

కాలేజీకి బంక్ కొట్టి ఎక్క‌డ తిరుగుతున్నావ‌ని శివ‌ను ప్ర‌శ్నిస్తాడు బాలు. కాలేజీ స్టూడెంట్స్ గురించి చ‌దువుకోని మీకు ఏం తెలుసు అంటూ శివ కోపంగా బ‌దులిస్తాడు. మీరు న‌న్ను కొట్టిన విష‌యం మా అక్క‌కు తెలిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా అని బాలుపై రివ‌ర్స్ ఎటాక్ చేస్తాడు శివ‌. నువ్వు ఏం చేస్తావో తెలిస్తే మీ అక్కే నిన్ను చంపేస్తుంద‌ని బాలు అంటాడు. అక్క న‌న్ను చంపేసేంత పెద్ద త‌ప్పు ఏం చేయ‌లేద‌ని శివ వాదిస్తాడు.

జైలుకు పంపిస్తే..

నువ్వు దొంగ‌త‌నం చేశావ‌ని శివ‌కు చెబుతాడు బాలు. నా బండి దొంగ‌త‌నం చేసిన రోజే మీ నాన్న మొహం చూసి వ‌దిలేయ‌కుండా జైలుకు పంపించి ఉంటే మ‌రో దొంగ‌త‌నం చేసేవాడివి కాద‌ని శివ‌కు వార్నింగ్ ఇస్తాడు. నీ దొంగ‌త‌నాన్ని నువ్వే క‌ళ్లారా చూడ‌మ‌ని వీడియో చూపిస్తాడు.

నిన్ను న‌మ్మి మా అమ్మ‌ను ఎన్నో మాట‌లు అన్నాను…మా అమ్మ అని తెలిసి కూడా డ‌బ్బు కొట్టేశావంటే నిన్ను ఏం చేయాలి. కొట్టాలా…జైలుకు పంపాలా అని శివ‌తో అంటాడు బాలు. అయినా తానేం త‌ప్పు చేయ‌లేద‌ని శివ వాదిస్తాడు. దొంగ‌త‌నం చేయ‌డం త‌ప్పు అని నేను అనుకోవ‌డం లేద‌ని స‌మ‌ర్థించుకుంటాడు.

 

మీ అన్న‌య్య దొంగ‌కాదా…

మీ ఇంట్లో మీ అన్న ఏమ‌న్నా మంచోడా…ఆయ‌న న‌ల‌భై ల‌క్ష‌లు ఎత్తుకుపోలేదా…ఆయ‌న దొంగ‌కాదా అని అంటాడు శివ‌. ఏం చూసుకొని నాకు తిర‌గ‌బ‌డి స‌మాధానాలు చెబుతున్నావ‌ని శివ‌ను నిల‌దీస్తాడు శివ‌.

నువ్వు చ‌దువుకొని ప్ర‌యోజ‌కుడివి అవుతావ‌ని, సుమ‌తిని, అమ్మ‌ను ఉద్ద‌రిస్తావ‌ని మీ అమ్మ క‌ల‌లు కంటుంద‌ని శివ‌కు క్లాస్ ఇస్తాడు బాలు.

అవ‌మానించారు…

ఓ రోజు మా అక్క‌ను చూడ‌టానికి మీ ఇంటికి వ‌స్తే మీ అమ్మ‌, అన్న‌య్య న‌న్ను దొంగ అని అవ‌మానించార‌ని, ఆ రోజే మీ వాళ్ల‌పై ఉన్న గౌర‌వం, మ‌ర్యాద పోయాయ‌ని, అందుకే న‌న్ను దొంగ అన్న‌వాళ్ల డ‌బ్బే దొంగిలించాన‌ని శివ వాదిస్తాడు. దొంగ‌త‌నం చేయ‌డం త‌ప్పు కాద‌ని, బాధ‌, భ‌యం లేవ‌ని అంటాడు.

డ‌బ్బున్న వాళ్ల‌కే మ‌ర్యాద ఉంటుంద‌ని, డ‌బ్బుంద‌ని రోహిణి, శృతిల‌ను మీ అమ్మ మ‌ర్యాద‌గా చూస్తుంద‌ని, పేద ఇంటి నుంచి వ‌చ్చిన మా అక్క‌కు ఎప్పుడు అవ‌మానిస్తుంద‌ని వాదిస్తాడు. క‌ష్ట‌ప‌డి సంపాదిస్తున్న నువ్వు ఎంత సంపాదించావు, పుస్తెలు కొన‌డానికి ఎన్నెళ్లు ప‌ట్టింది నీకు బాలుపై రివ‌ర్స్ ఎటాక్ చేస్తాడు శివ‌. డ‌బ్బు కోసం ఏం చేసిన త‌ప్పు లేద‌ని అంటాడు.

నాకేం భ‌యంలేదు…

ఈ విష‌యం మీ ఇంట్లో చెబుతాన‌ని బాలు అన‌బోతుండ‌గా…చెప్పేయ్ నాకేం భ‌యం లేద‌ని శివ బ‌దులిస్తాడు. నేను చేసిందానికి నువ్వు చేయి విరిచేశావ్‌…మీ అమ్మ చేసిందానికి నేను డ‌బ్బు కొట్టేశాను ఇక నువ్వు వెళ్లు అని అవ‌మానిస్తూ మాట్లాడుతాడు శివ‌.

 

నా స‌హ‌నాన్ని ప‌రీక్షించ‌వ‌ద్ద‌ని, నాకు తిక్క‌రేగితే ఏం చేస్తానో నాకే తెలియ‌ద‌ని బాలు అంటాడు. వెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇచ్చుకో…నా ఫ్రెండ్ గుణ‌నే న‌న్ను విడిపిస్తాడ‌ని శివ బిల్డ‌ప్‌లు ఇస్తాడు. ఒక్క గుద్దుతో గుణ‌ను లేపేస్తాన‌ని బాలు అంటాడు. ఇక నుంచి జాగ్ర‌త్త‌గా ఉండ‌మ‌ని వార్నింగ్ ఇస్తాడు.

తాగుతూ…తిరుగుతూ…

నువ్వెవ‌రు నాకు చెప్ప‌డానికి బాలుపైనే కోప్ప‌డుతాడు శివ. నువ్వేమైనా గొప్ప ప‌నులు చేస్తావా? ఎప్పుడు తాగుతూ తిరుగుతూ అంద‌రికి కొడ‌తావుతా అని అవ‌మానిస్తాడు. నీ ఇంట్లో నీకే మ‌ర్యాద లేద‌ని, నీలాంటి వాడిని పెళ్లిచేసుకున్నందుకు మా అక్క బ‌తుకు నాశ‌న‌మైంద‌ని బాలును త‌క్కువ చేసి మాట్లాడుతాడు. హాస్పిట‌ల్‌లో గొడ‌వ‌లు వ‌ద్ద‌ని ప‌క్క‌వాళ్లు అన‌డంతో శివ‌కు వార్నింగ్ ఇచ్చి వ‌స్తాడు బాలు.

పిల్ల బ‌చ్చాగాడు…

శివ అన్న మాట‌లు భ‌రించ‌లేక‌పోతాడు. మీనాకు ఇచ్చిన మాట మార్చిపోయి మందుతాగుతాడు. శివ అన్న మాట‌లు మొత్తం రాజేష్‌కు చెబుతాడు. పెద్ద పెద్ద మొన‌గాళ్ల‌తోనే పెట్టుకున్నాన‌ని, కానీ పిల్ల బ‌చ్చాగాడు భ‌య‌ప‌డ‌టం లేద‌ని అంటాడు.

ఆఫ్రాల్ డ్రైవ‌ర్‌…

ఆఫ్ట్రాల్ న‌న్ను డ్రైవ‌ర్ అని ఎగ‌తాళి చేశాడ‌ని అంటాడు. నేను ఏం ఇచ్చిన ఇవ్వ‌క‌పోయినా ప్రేమిస్తే చాల‌ని మీనా అనుకుంటుంద‌ని, ఈ విష‌యం మీనాకు చెబితే వాడి నాలిక కోసేస్తుంద‌ని బాలు అంటాడు. మీనా చిన్నత‌నం నుంచి క‌ష్టాలే ప‌డుతుంద‌ని అంటాడు. శివ న‌న్ను తాగుబోతు అన్నాడ‌ని బాలు బాధ‌ప‌డ‌తాడు. మీనా త‌మ్ముడిలా కాకుండా త‌న సొంత త‌మ్ముడిలా శివను చూసుకున్నాన‌ని బాలు చెబుతాడు.

 

స్వార్థంతో బ‌త‌కాలి…

ఇంకెప్పుడు ఎవ‌రిని సొంత మ‌నుషులు అనుకోకూడ‌ద‌ని, లేదంటే ఇలాంటి అవ‌మానాలే ఎదుర‌వుతాయ‌ని చెబుతాడు. ఈ రోజుల్లో మ‌న అనుకున్నోడు పిచ్చోడు…స్వార్థంతోనే బ‌త‌కాల‌ని బాలు బాధ‌ప‌డ‌తాడు. అత‌డికి రాజేష్ స‌ర్ధిచెబుతాడు.

నా మ‌న‌షులు చూసుకుంటారు…

బాలు వెళ్లిపోగానే గుణ‌కు ఫోన్ చేసి జ‌రిగిన సంగ‌తి చెబుతాడు శివ‌. ప్ర‌భావ‌తి ద‌గ్గ‌ర మ‌నం డ‌బ్బులు కొట్టేసిన వీడియో ఫుటేజ్ బాలుకు దొరికింద‌ని శివ అంటాడు. ఆ కోపంతోనే న‌న్ను కొట్టాడ‌ని గుణ‌తో చెబుతాడు శివ‌. మా ఇంట్లో వాళ్ల‌కు ఆ వీడియోను చూపించ‌లేద‌ని అంటాడు. ఇంట్లో వాళ్ల‌కు చెప్ప‌లేదంటే ఎవ‌రికి చెప్ప‌డు. ఎక్కువ చేస్తే నా మ‌నుషుల‌ను పంపిస్తాను.

వాళ్లే బాలు సంగ‌తి చూసుకుంటార‌ని గుణ చెబుతాడు. అవ‌స‌రం లేద‌ని, తానే గ‌ట్టిగా బుద్ది చెప్పి బాలును పంపించాన‌ని శివ అంటాడు. శివ‌కు చేయి ఫ్రాక్చ‌ర్ అయ్యింద‌ని డాక్ట‌ర్లు చెబుతారు. ఆ మాట విని సుమ‌తి క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. మీనా కూడా విష‌యం తెలిసి కంగారు ప‌డుతుంది. అక్క‌డితో నేటి గుండె నిండా గుడి గంట‌లు సీరియ‌ల్ ముగిసింది.