





Best Web Hosting Provider In India 2024

ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి తమిళ్ మర్డర్ మిస్టరీ మూవీ – పది గంటల్లో జరిగే కథ – మంచి సీట్ ఎడ్జ్ థ్రిల్లర్
సిబి సత్యరాజ్ హీరోగా నటించిన తమిళ మూవీ టెన్ అవర్స్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. బుధవారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఐఎమ్‌డీబీలో 8 రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
తమిళ మూవీ టెన్ అవర్స్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. బుధవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ ఈ మూవీని ఓటీటీ ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చింది.
హీరోయిన్ లేకుండా…
టెన్ అవర్స్ మూవీలో సిబి సత్యరాజ్ హీరోగా నటించాడు. గజరాజ్, దిలీపన్, జీవారవి కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్ క్యారెక్టర్ లేకుండా ప్రయోగాత్మకంగా దర్శకుడు ఇళయరాజా కలియపెరుమాల్ ఈ మూవీని తెరకెక్కించాడు.
ఇరవై రోజుల్లోనే…
ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రావడం గమనార్హం. కాన్సెప్ట్, ట్విస్ట్‌లు బాగున్నా కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని దక్కించుకోలేకపోయింది. ఐఎమ్‌డీబీలో మాత్రం పదికిగాను ఎనిమిది రేటింగ్‌ను సొంతం చేసుకున్నది.
క్యాస్ట్రో ఇన్వేస్టిగేషన్…
క్యాస్ట్రో నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. తెలివితేటలతో పాటు కోపం ఎక్కువే. ఓ అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్‌పై క్యాస్ట్రో ఎంక్వైరీ చేస్తుంటాడు. ఈ ఇన్వేస్టిగేషన్‌లోనే ఓ మర్డర్‌కు సంబంధించిన క్లూ బయటపడుతుంది. చెన్నై నుంచి కోయంబత్తూర్ వెళుతున్న బస్‌లో ఓ వ్యక్తి హత్య చేయబడ్డాడనే నిజం తెలుసుకుంటాడు.
పది గంటల్లో ఈ మర్డర్ వెనకున్న మిస్టరీని క్యాస్ట్రో ఎలా బయటపెట్టాడు? బస్‌లో హత్యకు గురైన వ్యక్తి ఎవరు? ఈ పది గంటల్లో కేసు ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే ఈ మూవీ కథ.
టెన్ అవర్స్ మూవీకి సుందరమూర్తి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా రన్‌టైమ్ రెండు గంటల కంటే తక్కువే కావడం గమనార్హం.
మూడేళ్ల తర్వాత…
టెన్ అవర్స్ మూవీతో దాదాపు మూడేళ్ల తర్వాత కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు సిబి సత్యరాజ్. చివరగా 2022లో వచ్చిన వట్టం మూవీలో హీరోగా కనిపించాడు. సత్యరాజ్ తనయుడిగా 2003లో రిలీజైన స్టూడెంట్ నంబర్ వన్ మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సిబి. నానాయమ్, లీ, పొక్కిరి రాజా, జాక్సర్ దురై, సత్యతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు. సిబి సత్యరాజ్ కెరీర్‌లో సక్సెస్‌ల కంటే పరాజయాలే ఎక్కువగా ఉండటం గమనార్హం.
సంబంధిత కథనం