బూతులు మాట్లాడే నాయకులపై నిషేధం విధించాలి – పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా సీఎం పెళ్లాం – రిలీజ్ ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

బూతులు మాట్లాడే నాయకులపై నిషేధం విధించాలి – పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా సీఎం పెళ్లాం – రిలీజ్ ఎప్పుడంటే?

 

బూతులు మాట్లాడే రాజ‌కీయ నాయ‌కులపై ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండా నిషేదం విధించాల‌ని ద‌ర్శ‌కుడు ర‌మ‌ణారెడ్డి అన్నారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సీఎం పెళ్లం మూవీ మే 9న రిలీజ్ కాబోతోంది. ఈ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో అజ‌య్‌, ఇంద్ర‌జ కీల‌క పాత్ర‌లు పోషించారు.

 
సీఎం పెళ్లం మూవీ
 

 

ఇంద్రజ, అజయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సీఎం పెళ్లాం మూవీ మే 9న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. బొల్లా రామకృష్ణా రెడ్డి నిర్మించిన ఈ మూవీకి గడ్డం రమణారెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమా రిలీజ్‌ను పుర‌స్క‌రించుకొని మేక‌ర్స్ ఇటీవ‌ల పాత్రికేయుల స‌మావేశం నిర్వ‌హించారు.

 

గెలిచాక ఎంత‌మంది…

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ర‌మ‌ణారెడ్డి మాట్లాడుతూ ‘‘ఎమ్మెల్యే.. సీఎం అవుతాడు. ఎలక్షన్లు రాగానే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే వ్యక్తే కాకుండా ఆయన సతీమణి ఓట్లు అడగడం తెలిసిందే. కానీ గెలిచాక ఎంతమంది తమ ఇంటికి వచ్చిన ఓటర్లను కలుస్తున్నారు అనే పాయింట్‌ను ఈ సినిమాలో చ‌ర్చిస్తున్నాం అన్నారు,.

బూతులు మాట్లాడితే…

ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో వైరస్ వ్యాధి కన్నా మించింది బుూతు. మీడియా ముందుకు వచ్చి రాజకీయ నాయకులు బుూతులు మాట్లాడకూడదన్న పాయింట్‌ను ఈ సినిమా ద్వారా బయటపెడుతున్నా. రాజకీయ నాయకులు మీడియా ముందుకు వచ్చి బూతులు మాట్లాడితే ఎలెక్ష‌న్స్‌లో ఐదేళ్ల పాటు పోటీ చేయకుండా నిషేధం విధించాలనే రూల్ తీసుకురావాలని ఈ సినిమాలో చూపించ‌బోతున్నాం. అలాగే పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే.. పవర్ కోల్పోతారన్న రూల్ రావాలి. కాబట్టి ఇది రొటీన్ సినిమా కాదు. ఎంటర్‌టైన్‌‌మెంట్‌తో పాటుఒక మంచి మెసేజ్ ఉంటుంది అని ద‌ర్శ‌కుడు తెలిపారు.

బౌండ్ స్క్రిప్ట్‌తో…

అజయ్ మాట్లాడుతూ.. ‘‘డైరెక్ట‌ర్ ర‌మ‌ణారెడ్డి బౌండ్ స్క్రిప్ట్‌తో నా దగ్గరకు వచ్చారు. క‌థ న‌చ్చి ఈ మూవీ చేశాం. మ‌హిళా సాధికార‌త పాయింట్‌తో తెర‌కెక్కిన మూవీ ఇది. పొలిటికల్‌గా ఏమేం మార్పులు చేస్తే బాగుంటుంద‌న్న‌ది ఈ సినిమాలో చూపించారు.ఇంద్రజ తో ‘దిక్కులు చూడకు రామయ్య’ మ‌ళ్లీ ఈ సినిమాలో క‌లిసి ప‌నిచేశాను. మంచి సినిమాగా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ను పొందుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది అని అన్నారు.

 

సీఏం భార్య బ‌య‌ట‌కు వ‌స్తే…

ప్రొడ్యూసర్ రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘పొలిటికల్ లీడర్స్, వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ బయటకు వచ్చి ప్రజలకు సేవ చేస్తే ఎలా ఉంటుంది? రాష్ట్రం ఏ విధంగా బాగు పడుతుంది? అనే మెసేజ్‌తో ఈ మూవీ చేశాం. బూతులు మాట్లాడ‌టం గొప్ప క‌దాని, ప్రజలకు మంచి చేయ‌డ‌మే నాయ‌కుల ల‌క్ష్యం కావాల‌ని ఈ సినిమాలో చూపించాం. సీఎం భార్య బయటకు వస్తే ప్రజలకు ఎలా సేవ చేయగలుగుతారు? అన్న‌ది ఆలోచ‌నాత్మ‌కంగా ద‌ర్శ‌కుడు చూపించారు. అజయ్ గారు, ఇంద్రజ పాత్ర‌లు ఈ సినిమాకు ప్ల‌స్ పాయింట్‌గా నిలుస్తాయి అని అన్నారు.

సీఏం పెళ్లాం మూవీలో జ‌య‌సుధ‌, సుమ‌న్‌, శ్రీనివాస్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

 

Source / Credits

Best Web Hosting Provider In India 2024